Nuvvunte Naa Jathaga Serial Today December 4th: నువ్వుంటే నా జతగా: మిథున-రిషిల నిశ్చితార్థంలో ఊహించని ట్విస్ట్! దేవా కుటుంబానికి పెద్ద బాధ్యత!
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 4th రిషి తల్లిదండ్రులుగా దేవా తల్లిదండ్రులు మిథున, రిషిలకు దగ్గరకుండి నిశ్చితార్థం జరిపించడానికి రెడీ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, రిషిల నిశ్చితార్థం గుడిలో ఏర్పాటు చేస్తారు. దేవా ఫ్యామిలీ మొత్తం గుడిలో ఉండటం చూసిన త్రిపుర పెళ్లి ఆపాలనే ఇలా గుడికి వచ్చారని అంటుంది. రాహుల్ వాళ్ల అంతు చూస్తా అని వెళ్లబోతే లలిత ఆపుతుంది. వాళ్లు మన ఇంటికి వచ్చారు అంటే నిశ్చితార్థం ఆపాలని చూస్తున్నారు అనుకుంటాం.. కానీ ఇక్కడికి వచ్చారు అంటే ఇది గుడి కదా ఎవరైనా రావొచ్చు కదా.. వాళ్లు ఎందుకు వచ్చారో తెలీకుండా మనం తొందర పడితే మనకి మనమే రిషికి విషయం చెప్పినట్లు అవుతుందని లలిత సర్దిచెప్తుంది.
రిషి దేవా తల్లిదండ్రుల్ని చూసి వెళ్లి పలకరిస్తాడు. సత్యమూర్తి గుర్తు పట్టకపోవడంతో తనని తాను పరిచయం చేసుకుంటాడు. సత్యమూర్తి గుర్తు పట్టి మాట్లాడి ఏం చేస్తున్నావ్ అంటే అమ్మానాన్నలతో అమెరికాలో సెటిల్ అయిపోయా.. సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని చెప్తాడు. సత్యమూర్తి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అంతలోనే దేవాని కోపంగా చూస్తాడు. రిషి తనకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తాడు. సత్యమూర్తి, శారద చాలా సంతోషపడతారు. కాబోయే భార్య గురించి శారద అడగటంతో రిషి మిథునని పిలిచి సత్యమూర్తి, శారదలకు పరిచయం చేస్తాడు. సత్యమూర్తి వాళ్లు మిథునని చూసి షాక్ అయిపోతారు.
రిషి మాస్టారుతో ఈ రోజు మాకు నిశ్చితార్థం అని చెప్తాడు. దేవాతో పాటు అతని తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతారు. రిషి మిథునతో మాస్టారు గారి ఆశీర్వాదం తీసుకుంటే మనకు అంతా మంచే జరుగుతుందని చెప్పి మిథునతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. తర్వాత నిశ్చితార్థం అయ్యాక మిథునని తీసుకొని వస్తానని చెప్తాడు. మిథున దేవాని చూస్తూ బాధగా వెళ్లిపోతుంది. దేవా కూడా చాలా బాధ పడతాడు. సత్యమూర్తి శారద వాళ్లతో మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు.. జడ్జి గారు మనల్ని చూస్తే గొడవలు అవుతాయి అని అంటాడు. అందరూ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటారు.
మిథున, రిషిల నిశ్చితార్థం కార్యక్రమం మొదలువుతుంది. రిషి తల్లిదండ్రులు ముహూర్తం టైంకి వస్తామని చెప్పి వాతావరణం బాలేదని ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని రిషికి చెప్తారు. నా కూతురి జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో అని హరివర్థన్ బాధ పడతాడు. పంతులు రిషితో మీ కన్నవాళ్లు మాత్రమే అవసరం లేదు అయిన వాళ్లు ఉంటే సరిపోతుంది. మీ తరుఫున తాంబూలం తీసుకుంటారు అని అంటారు. రిషి హరివర్థన్‌తో మామయ్య ఈ నిశ్చితార్థం ఆగదు.. నిర్ణయించిన టైంకే అవుతుంది అని అంటాడు.
రిషి పరుగున ఇంటికి వెళ్లిపోతున్న సత్యమూర్తి వాళ్ల దగ్గరకు వెళ్తాడు. సత్యమూర్తితో మాస్టారు ఇది నా జీవితానికి సంబంధించిన విషయం.. చిన్నప్పుడు నాకు చదువు చెప్పి జీవితం తీర్చిదిద్దారు.. ఇప్పుడు సాయం చేసి జీవితం నిలబెట్టండి అని మా అమ్మానాన్నల స్థానంలో నిలబడి తాంబూలం తీసుకోండి అని చెప్తాడు. సత్యమూర్తి వాళ్లు షాక్ అయిపోతారు. దేవా కూడా బిత్తరపోతాడు. రిషి సత్యమూర్తి వాళ్లని ఒప్పించి తాంబూలం తీసుకోమని బతిమాలి తీసుకెళ్తాడు. రిషి వాళ్లని తీసుకురావడం హరివర్థన్ వాళ్లు చూసి షాక్ అయిపోతారు. రెండు కుటుంబాలు ఒకర్ని ఒకరు చూసుకొని అలా ఉండిపోతారు. రిషి సత్యమూర్తి, శారద వాళ్లని హరివర్థన్ వాళ్లకి పరిచయం చేస్తాడు. మా అమ్మానాన్నల స్థానంలో వీళ్లు కూర్చొంటారు అని చెప్తాడు. లలిత, హరివర్థన్ వాళ్లు ఇబ్బంది పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















