Nuvvunte Naa Jathaga Serial Today December 30th: నువ్వుంటే నా జతగా: మిథున ఆలోచనలకు అర్థమేంటి? పెళ్లిళ్లను ఆపేదెవరు? బేబీ దేవాని ఎందుకు కొట్టింది?
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 30th దేవా మిథున పెళ్లి ఆపాలి అనుకుంటే చంపేస్తా అని హరివర్థన్ గన్ తీసి ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సూర్యకాంతం అత్తామామలతో మిథున మెడలో తాళి తీయలేదు అని.. తాళి తీసేయమని చెప్పిన పెద్దవాళ్లతో ప్రాణం పోయినా తాళి తీయను అని చెప్పిందని.. గంటలో మరో పెళ్లి పెట్టుకొని మరీ దేవా కట్టిన తాళి తీయడం లేదు అంటే ఇంకా దేవాని భర్తగా అనుకున్నట్లే కదా.. దేవా, భానులకు పెళ్లి అవ్వకుండా మిథున ఆపేస్తుంది.. తన భర్తకి మరో పెళ్లి చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు లేదా ఇంకేమైనా చేయొచ్చని చెప్తుంది.
శారద సూర్యకాంతాన్ని కోప్పడి పంపేస్తుంది కానీ భర్తతో మిథున ఈ పెళ్లి ఆపేస్తుందని భయంగా ఉందని చెప్తుంది. మిథున అలా ఎప్పటికీ చేయదు అని సత్యమూర్తి అంటారు. ఇక అక్కడే ఉన్న అమ్మవారి ఉపాసకురాలు శారద వాళ్లని చూసి జరగని అలాగే జరగని ఎవరు అనుకున్నట్లు అలాగే జరగని.. శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటుంది. శారద ఆవిడ దగ్గరకు వెళ్లి కాసేపట్లో నా కొడుకు పెళ్లి అని అంటే ఆవిడ శారదతో పెళ్లి జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావా.. జరగని అలాగే జరగని అని అంటుంది. ఆవిడ మాటలకు శారద చాలా కంగారు పడుతుంది.
మిథున దేవా కట్టిన తాళి పట్టుకొని దేవాని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక హరివర్థన్ వాళ్లు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. ముహూర్తానికి టైం అయిపోతుందని కంగారుగా పనులు చేస్తుంటారు. ఇంతలో ఓ గెస్ట్ వచ్చి హరివర్థన్‌తో మీ అమ్మాయి పెళ్లి ఆ దేవాతో చేస్తున్నారా అని అడుగుతారు. దానికి జడ్జి ఆయన మీద కోప్పడతాడు. ఒక విషయం అడిగే ముందు ఆలోచించాలి అని తెలీదా.. ఆ రౌడీతో నా కూతురి పెళ్లి ఎందుకు చేస్తాను అని అంటారు. దానికి ఆయన దేవా కూడా పెళ్లి కొడుకు గెటప్‌లో కనిపించాడని చెప్తారు. హరివర్థన్, లలిత వాళ్లు చాలా కంగారు పడతారు. ఇక అలాంటిది ఏమీ లేదని రిషిని చూపించి అతనే నాకు అల్లుడు అని చెప్తారు.
లలిత భర్తతో ఆ దేవా పెళ్లి కొడుకులా ఉండటం ఏంటి అని అడుగుతుంది. దానికి రాహుల్ టెన్షన్ పడొద్దని ఆ రౌడీ పెళ్లి కూడా ఇదే గుడిలో అని చెప్తాడు. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదు అంటే ఇదేనేమో మన కూతురి పెళ్లి జరిగే చోట అదే ముహూర్తానికి ఆ దేవా పెళ్లి ఏంటి అని లలిత కంగారు పడుతుంది. ఏం కాదులే అని హరివర్థన్ సర్ది చెప్తాడు. త్రిపుర మాత్రం దేవా ఈ పెళ్లి ఆపాలి అనే ఇలా ఇక్కడ పెళ్లి ఏర్పాటు చేశాడు.. పైగా మిథున కూడా తాళి తీయమని అంటే తీయడం లేదు.. ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారని అనిపిస్తుందని అంటుంది. అలా జరిగితే దేవాని చంపేసి అయినా నా కూతురి పెళ్లి చేస్తానని హరివర్థన్ గన్ తీస్తాడు. రాహుల్ తండ్రితో కంగారు అవసరం లేదని తాను ముందే రౌడీలకు చెప్పానని అంటాడు. లలిత ఏడుస్తుంది.
దేవా దగ్గర ఫ్యామిలీ మొత్తం ఉంటారు. దేవాకి పారాణి రాయమని శారద పెద్ద కోడలికి చెప్తుంది. ఇంతలో అక్కడికి బేబీ బామ్మ వస్తుంది. బేబీ బామ్మని చూసి అందరూ అందరూ షాక్ అయిపోతారు. నా మనవడికి ఎందుకు రెండో పెళ్లి చేస్తున్నారు అని బేబీ అడిగితే అసలు మిథునతో తనకు పెళ్లి ఎప్పుడు జరిగింది అని సూర్యకాంతం అంటుంది. బేబీ కాంతానికి ఒక్కటిచ్చి మిథున లాంటి మంచి భార్యని వాడికి ఎందుకు దూరం చేస్తారు.. భార్యభర్తల్ని విడదీయకూడదు అని తెలీదా అని నిలదీస్తుంది.
సత్యమూర్తి తల్లితో మరేం చేయాలి అమ్మ,, నీ ముద్దుల మనవడే మిథునని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. భానుమతిని పెళ్లి చేసుకుంటా అని తనకి మాటిచ్చాడు. పెళ్లి జరగకపోతే చనిపోతాం అని ఆ తల్లీకూతుళ్లు మన ఇంట్లోనే చావబోయారు.. ఇప్పుడు ఈ పెళ్లి చేయకమరేం చేయమంటావ్ అని అంటాడు. మీనాన్న చెప్పేది నిజమారా అని బామ్మ అడుతుంది. దేవా ఏం చెప్పకపోవడంతో చెప్పరా అని దేవాని లాగిపెట్టి కొడుతుంది. దేవాని తిట్టి ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.. భాను తల్లిని పిలవండి పెళ్లి ఆపేస్తా అంటుంది. ఈ పెళ్లి జరిగి తీరుతుంది అత్తయ్య అని శారద అంటుంది. బేబీ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















