.Nindu Manasulu Serial Today December 30th:నిండు మనసులు: ఒక్కటైన మంజుల, ప్రేరణ! గణ ఉద్యోగం తీయించేసిన కాఫీ పార్టనర్స్!
Nindu Manasulu Serial Today Episode December 30th మంజులని ప్రేరణ హగ్ చేసుకోవడం ఇద్దరూ సంతోషంగా కలిసిపోవడం చూసి విజయానంద్ భయపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూల చేతులు పట్టుకొని మంజుల క్షమాపణ అడుగుతుంది. విజయానంద్ మనసులో పెద్ద సాయమే అడిగింది.. అదే ఇదంతా నేనే చేశాను అని తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని అనుకుంటాడు. సిద్ధూ, ప్రేరణలు మేం క్షమించడం ఏంటి అని అడుగుతారు.
ప్రేరణ మనకు సాయం చేయాలని వస్తే అనరాని మాటలు అన్నాను.. చెల్లి మీద నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయా.. మొదటి సారి నేను ఓడిపోయాను.. ఏదో మాయలో పడ్డాను.. నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాను.. నా పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ప్రేరణను నిన్ను చాలా మాటలు అన్నాను.. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాన్న నేను మనిషినా అని .. అసలు ఒక తల్లినా అని అంటుంది. ఆంటీ ఆపండి అలా మాట్లాడొద్దు.. మీరు ఏం చేసినా సిద్ధూ, సాహితిల తల్లిగానే చేస్తారు. మీరే కాదు మీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారు. ఎందుకంటే ఆ గణ అలాంటి వాడు.. సాహితికి గణకి పెళ్లి జరగకపోవడం మీ కుటుంబానికి జరిగిన మంచి అని ప్రేరణ అంటుంది.
విజయానంద్ మనసులో కరెక్ట్గానే చెప్పింది. కచ్చితంగా ప్రేరణకు ఆ గణకి ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. అదేంటో కనుక్కోవాలి అని అనుకుంటాడు. మంజుల వాళ్లతో ఒక వేళ సాహితి పెళ్లి ఆ గణతో జరుగుంటే నా సాహితి జీవితం ఏమైపోయేది అని అంటుంది. మీరు నన్ను క్షమిస్తారా అని మంజుల అంటుంది. దానికి ప్రేరణ సరే ఆంటీ మిమల్ని క్షమించాలి అంటే మీరు ఒకటి చేయాలి అంటుంది. ఏంటమ్మా అది అని మంజుల అడిగితే ప్రేరణ సంతోషంగా మంజులని హగ్ చేసుకొని ఏ సమస్య వచ్చినా మా నాన్న కూడా ఎప్పుడూ ఇలాగే గట్టిగా పట్టుకొని పెద్దోడా జరిగింది అంతా మర్చిపోరా అని అనేవాళ్లు అని అంటుంది.
మంజుల చాలా సంతోషపడుతుంది. ప్రేరణ తండ్రిని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఎందుకమ్మా ఆ కన్నీళ్లు అని మంజుల అడుగుతుంది. మొత్తానికి మేడం మా అమ్మని క్షమించారన్నమాట అని అంటాడు. సిద్ధూ తల్లితో ఇంకోసారి మనమధ్య ఇలాంటి క్షమాపణలు వద్ద అని అంటాడు. ఇక ప్రేరణ మంజులతో ఆంటీ మీకో మంచి కాఫీ చేసి ఇస్తా.. మీరే ఇలా ఉంటే సాహితి ఎంత బాధ పడుతుందో తనని మీరే ధైర్యం చెప్పాలి అంటుంది.
ప్రేరణ అందరికీ కాఫీ ఇస్తుంది. అందరూ కాఫీ బాగుందని అంటారు. విజయానంద్ ప్రేరణని ఉద్దేశించి అందుకే కదా సిద్ధూ తనని ఏరి కోరి పార్టనర్ని చేసుకున్నాడని అంటాడు. అందరూ కోపంగా చూడటంతో అదే బిజినెస్ పార్టనర్ అని అంటాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ప్రేరణ సాహితిని మోటివేట్ చేస్తుంది. నేను బాగానే ఉన్నాను అని సాహితి వెళ్లిపోతుంది.
వర్ష కేఫ్ దగ్గరకు వచ్చి మీరే ఇప్పుడు నన్ను కాపాడాలి. మీ చెల్లి పెళ్లి ఆగిపోయింది మీరంతా సంతోషంగా ఉన్నారు.. కానీ నా జీవితం నాశనం అయిపోయింది. నావల్లే ఇదంతా జరిగింది అంటే గణ ఊరుకుంటాడా.. కచ్చితంగా నన్ను చంపేస్తాడు.. మీరే నన్ను కాపాడాలి అని అంటుంది. మేం చూసుకుంటా ఏం అవ్వదు. ఇంటికి వెళ్లు అని సిద్ధూ అంటాడు. గణ దగ్గర పవర్ ఉంది.. నన్ను ఆ పవర్ వాడుకొని చంపేసి అదే పవర్తో ఏమైనా చేస్తాడు అంటుంది. అయితే వాడి పవర్ కట్ చేద్దాం అని సిద్ధూ ప్రేరణలు చెప్పి మీడియా సమావేశం పెట్టిస్తారు.
ప్రేరణ మీడియాతో గణ తనకు చేసిన మోసం మొత్తం చెప్తుంది. గణ వల్ల నాకు ప్రాణాపాయం ఉంది.. నన్ను మీరే కాపాడాలి అని చెప్తుంది. గణ కూడా ఆ న్యూస్ చూసి కోపంతో రగిలిపోతాడు. విజయానంద్, మంజుల, సాహితి కూడా ఆ న్యూస్ చూస్తారు. సాహితి బాధ పడుతూ వెళ్లిపోతుంది. గణ ఇంత మోసగాను అని అనుకోలేదని మంజుల కోప్పడుతుంది. ఇక నుంచి గణ పేరు కూడా మన ఇంట్లో వినిపించడానికి వీల్లేదు అని అంటుంది. సుధాకర్ ప్రేరణ దగ్గరకు వచ్చి నన్ను కూడా నువ్వు కాపాడావే.. నాకు పట్టిన పీడ వదిలించేశావే అని గణని సస్పెండ్ చేశారని చెప్తాడు. ప్రేరణ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















