Nuvvunte Naa Jathaga Serial Today April 17th: నువ్వుంటే నా జతగా సీరియల్: తల్లిదండ్రుల కోసం కూలీ చేసిన దేవా.. మిధునకు ఇకపై నేనే తల్లిని లలితతో శారద!
Nuvvunte Naa Jathaga Today Episode తల్లిదండ్రులకు బట్టలు తీసుకురావడానికి దేవా బస్తాలు మోసి డబ్బు సంపాదించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున ఈ ఇంటి కోడలు కాదని సూర్యకాంతం అంటే మీ ఇద్దరిలాగే మిధున కూడా ఈ ఇంటి కోడలే అని శారద కాంతం మీద కోప్పడి ఒప్పిస్తుంది. శారద మిధునతో క్యాలెండర్ రాసి తీసుకొచ్చావ్ ఏంటి అని అంటుంది. దానికి మిధున మీ రాశిఫలం చూడటానికి వచ్చాను అమ్మ ఈ రోజు మీకు ఊహించని గిఫ్ట్ వస్తుందని అంటుంది. ఏదో ఒక గిఫ్ట్ మీకు వెతుక్కుంటూ వస్తుందని ఈ అమ్మ మీద ప్రేమ ఉన్నవారు తీసుకొస్తారు అంటుంది. మామయ్య ఈ రోజు ఊహించని విధంగా ఆశ్చర్యపడతారు అని మనసు సంతోషపడుతుందని మిధున అంటుంది.
అదంతా జరగదు అని శారద అంటే నాకు కచ్చితంగా జరుగుతుందని అనిపిస్తుందని మిధున అంటుంది. ఇక శారద తాను పువ్వులు పెట్టుకొని తర్వాత ముగ్గురు కోడళ్లకు పెట్టుకోమని చెప్తుంది. ముగ్గురు కోడళ్లు వరసగా కూర్చొంటారు. కాంతంతో మిధున, ప్రమోదిని పువ్వులు పెట్టించుకుంటారు. సత్యమూర్తి, శారద గుడికి వెళ్తుంటే మిధున విష్ చేస్తుంది. సత్యమూర్తి ఏం అనరు. ఇక ప్రమోదిని, కాంతం విష్ చేస్తారు. వాళ్లకి సత్యమూర్తి వాళ్లకి థ్యాంక్స్ చెప్తారు. మిధున ఫీలవుతుంది. శారద మిధునని చూసి మీ మామయ్య సైలెంట్‌గా ఉన్నారు అంటే విష్ తీసుకున్నట్లే అంటుంది. మిధున మనసులో మీకు మంచి గిఫ్ట్‌లు వస్తాయి అని మిధున అనుకుంటుంది.
దేవా ఓ చోటుకి వెళ్లి పని అడుగుతాడు. ఆయన దేవాతో ఎంత డబ్బు కావాలి అన్నా ఇస్తాను అన్న వెళ్లిపో అన్న అంటాడు. దేవా తనకు భయపడి ఎవరూ పని ఇవ్వడం లేదని ఎలా అయినా 2 వేలు సంపాదించి బట్టలు కొనాలని అనుకుంటాడు. శారద సత్యమూర్తి గుడికి వెళ్లి అర్చన చేయిస్తారు. తమ పేర్లు చెప్పిన తర్వాత పంతులు పిల్లల పేర్లు చెప్పమని అంటారు. సత్యమూర్తి ఆనంత్, రంగంల పేర్లు వాళ్లు భార్యల పేర్లు చెప్తాడు. మూడో కొడుకు పేరు చెప్పమని పంతులు అడిగితే సత్యమూర్తి దేవా పేరు చెప్తాడు. దేవా భార్య మిధున అని శారద చెప్తుంది. అది విన్న జడ్జి కోపంతో వెళ్లిపోబోతే లలిత ఆపుతుంది. ఆ రౌడీ గాడి భార్యగా నా కూతురి పేరు చెప్తుంటే చిరాకుగా ఉందని జడ్జి అంటాడు.
జడ్జి వాళ్లని సత్యమూర్తి చూస్తారు. పంతులు జడ్జిని పలకరించి మంచి వాళ్లని అప్పుడప్పుడు దేవుడు కలుపుతాడని చెప్పి సత్యమూర్తిని జడ్జిని పరిచయం చేస్తాడు. జడ్జి పూజారితో ఒకరిని పరిచయం చేయడానికి ముందు వాళ్ల స్థాయి సరిపోతుందా లేదా చూసుకోవాలి అంటాడు. దానికి సత్యమూర్తి సంస్కారంలో మీ కంటే నేను ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో ఉన్నానని అంటాడు. జడ్జి వాళ్లతో గొడవకు దిగితే లలిత భర్తని ఆపుతుంది. తనకు ఎవరూ పని ఇవ్వడం లేదని దేవా గెటప్ మార్చి కూలీలా పని చేస్తాను డబ్బు ఇవ్వమని అంటాడు. దేవా డబ్బులు కోసం మూటలు మోస్తాడు. ఇద్దరి ముగ్గురి పని ఒక్కడివే చేశావని కూలీ 3 వేలు ఇస్తారు. దేవా ఆ డబ్బు తీసుకొని చాలా సంతోషపడతాడు.
మిధున అక్కతో మనం కేక్ తయారు చేసి కట్ చేయిద్దాం అంటుంది. ప్రమోదిని వద్దని భయపడుతుంది. కాంతం చూసి వీళ్లిద్దరూ నన్ను వదిలేసి మిధున పార్టీలో కలిసిపోయిందని అసూయ పడుతుంది. మిధున ప్రమోదినిని ఒప్పిస్తుంది. దాంతో ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ కేక్ తయారు చేస్తారు. ఇద్దరూ ఉత్తమ కోడళ్ల అవార్డు కొట్టేస్తారని కాంతం కన్నీరు పెట్టుకుంటుంది. మిధునకు ఫోన్ వచ్చి వెళ్లడంతో కాంతం ప్రమోదిని దగ్గరకు వెళ్లి కేక్ పాడు చేయాలి అనుకుంటుంది.
శారద దగ్గరకు లలిత వస్తుంది. లలితను చూసి మీరు ఏదో అనడానికి వచ్చారు కదా అమ్మ అనేసి వెళ్లండి అంటుంది. దానికి లలిత మా ఆడపిల్ల గురించి మాత్రమే నా బాధ కానీ మీ మీద ద్వేషం లేదు అని అంటుంది. తాళి కట్టినవాడితో జీవితం అన్ని కన్నవాళ్లని వదిలేసిందని లలిత ఏడుస్తుంది. కష్టం కన్నీళ్లు తెలీకుండా నా కూతురిని పెంచుకున్నాం తన కంట్లో కన్నీరు వచ్చినా తట్టుకోలేమని తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. దాంతో శారద మిధున తనని అమ్మ అని పిలిచినప్పుడే తను నా కూతురి అయిపోయిందని మీరు తన పక్కను తల్లిగా ఉండరు కానీ తనకు కన్న తల్లి ప్రేమలో ఏం లోటు ఉండదు అని తన కొడుకు మంచోడు అని మీ అమ్మాయి జీవితం బాగుంటుందని త్వరలోనే ఆ రోజు వస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















