అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial January 24th - నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అరుంధతిని అనుమానిస్తున్న మిస్సమ్మ.. కాళీతో చేయి కలిపిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode: కాళీ తో చేయి కలిపిన మనోహరి మిస్సమ్మ మీద జ్యూస్ ఒలిపేయటం తో కధలో కీలక మలుపులు ఏర్పడతాయి.

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరి ముందు బాధపడే అదృష్టం లేదు కదా అందుకే పక్కకు వచ్చేసాను అంటాడు అమర్.

మిస్సమ్మ : ఈ చీర కట్టుకోవడం వల్లనే మీకు మీ వైఫ్ గుర్తొస్తున్నట్లున్నారు చీర మార్చేసుకుంటాను అంటుంది.

అమర్: అలాంటిది ఏమీ లేదు అంటాడు.

మిస్సమ్మ : ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదండీ ఆడపిల్లలు తల్లితో షేర్ చేసుకున్నట్లు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు అంటుంది. తర్వాత అమర్ ని చూసి భయపడి తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

తర్వాత అమర్ బాధపడటం చూసి అరుంధతి కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అంత లో మనోహరి ఘోరని తీసుకువచ్చి అరుంధతిని బంధించమని చెప్తుంది. ఘోర కూడా ఒంటరిగా ఉన్న అరుంధతిని బంధించాలనుకుని అరుంధతి దగ్గరికి వెళ్లబోతాడు. ఇంతలో మిస్సమ్మ అక్కడికి వస్తుంది.

మిస్సమ్మ : ఇక్కడే కూర్చుండిపోయారేమీ ఎందుకు ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నారు మీ హస్బెండ్ ని మిస్ అవుతున్నారా అని అడుగుతుంది.

అరుంధతి: కన్నీరు పెట్టుకుంటూ చాలా మిస్ అవుతున్నాను అంటుంది.

మిస్సమ్మ: మా సార్ కూడా ఆయన వైఫ్ ని మిస్ అవుతున్నాను అని బాధపడుతున్నారు అంటుంది. తర్వాత టాపిక్ మార్చడం కోసం రండి బయటికి వెళ్దాము అక్కడ స్నాక్స్ తీసుకుందురుగాని అంటుంది అరుంధతి వద్దనడంతో ఆమె చేయి పట్టుకుని తీసుకువెళ్లనుకుంటుంది కానీ అరుంధతి చేయి దొరకదు. ఒకసారి గా షాక్ అవుతుంది మిస్సమ్మ. ఇంతలో అరుంధతి తనని పట్టుకోవడానికి వచ్చిన ఘోర ని చూసి భయపడిపోతుంది. స్నాక్స్ తీసుకోవడం కోసం మిస్సమ్మతో వెళ్లకపోతే నన్ను బంధించేస్తాడు అనుకోని స్నాక్స్ తీసుకోవడానికి మిస్సమ్మ కన్నా ముందే బయలుదేరుతుంది.

అయితే అప్పటికే కాళీ మిస్సమ్మ మీద జ్యూస్ పొయ్యడానికి ప్రిపేర్ గా ఉంటాడు. ఆ జ్యూస్ మిస్సమ్మ మీద కాకుండా అరుంధతి మీద పడుతుంది. అరుంధతి ఆత్మకావటం మూలాన ఆ జ్యూస్ మొత్తం నేల మీద ఒలిగిపోతుంది. అది చూసి అరుంధతిని అనుమానిస్తుంది మిస్సమ్మ.

అరుంధతి: జ్యూస్ నామీదే పడింది మిస్సమ్మ కానీ పక్కకు తప్పుకున్నాను అందుకే నేల మీద పడిపోయింది అని చెప్పి తప్పించుకుంటుంది.

మరోవైపు అమర్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ముభావంగా ఉంటారు అమర్ తల్లిదండ్రులు. అమర్ కి కోపం వచ్చినా సరే అతనితో మాట్లాడి పెళ్లి చేయాలి అనుకుంటారు. అటుగా వెళుతున్న మనోహరి వాళ్ళని చూస్తుంది.

మనోహరి : వీళ్లు ఇంత ముభావంగా ఉన్నారంటే కచ్చితంగా అమర్ పెళ్లి గురించే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని అమర్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. మనం ఉన్నన్నాళ్ళు అమర్ ని జాగ్రత్తగా చూసుకుంటాము ఆ తర్వాత అతని పరిస్థితి ఏమిటి? అతనికి ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేయాలి, అమర్ త్వరగా ఎవరితోని కలవలేడు కాబట్టి బాగా తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుంది అంటుంది.

నిర్మలమ్మ : అలాంటి అమ్మాయి ఎవరున్నారు అని అడుగుతుంది.

మనోహరి : బాగా వెతికితే మీకే దొరుకుతుంది. ఏమో మీ కళ్ళముందే ఉండి ఉండవచ్చు అంటుంది. ఆ మాటలకి ఆలోచనలో పడతారు అమర్ తల్లిదండ్రులు. ఇంతలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని పొద్దున్నుంచి మీరు ఏమి తీసుకోలేదు అని చెప్పి సర్వర్ ని పిలిచి వాళ్ళకి కూల్ డ్రింక్ లు ఇస్తుంది.

అయితే అక్కడికి కూల్ డ్రింక్స్ తీసుకువచ్చింది సర్వర్ రూపంలో ఉన్న కాళీ. అతనిని గుర్తు పడుతుంది మనోహరి. మీరు జ్యూస్ తాగుతూ ఉండండి అని అమర్ తల్లిదండ్రులతో చెప్పి కాళీ వెనుక వెళ్తుంది.

మనోహరి: నువ్వు మంగళ తమ్ముడు కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. కాళీ జరిగిందంతా చెప్తాడు. దేవుడు నాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు అనుకొని ఆ మిస్సమ్మ మీద నేను జ్యూస్ ఒంపి రూమ్ దగ్గరికి పంపిస్తాను నువ్వు అక్కడ వెయిట్ చేయు అని చెప్పి జ్యూస్ గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

డోర్ పక్కన నుంచొని మిస్సమ్మ రావడం గమనించి ఆమె మీద జ్యూస్ ఒంపేస్తుంది మనోహరీ. సారీ చూసుకోలేదు అని చెప్పి రూమ్ చూపించి అటువైపు వెళ్లి క్లీన్ చేసుకుని రా అని చెప్తుంది. మిస్సమ్మ క్లీన్ చేసుకోవడానికి వెళ్తే వెళ్ళు అక్కడ మీ బావ చేసిన పనిని తలుచుకుని జీవితాంతం కుమిలి కుమిలి ఏడుద్దువుగానివి అని కసిగా అనుకుంటుంది.

మరొకవైపు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ తల్లిదండ్రులు.

అమర్ తండ్రి : కాపురం బాగోవాలంటే ఆడదాని చేతిలోనే ఉంటుంది నా కొడుకు సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కానీ మనశ్శాంతిగా లేకపోతే నేను చూడలేను అంటాడు. ఏం చేసినా మనం వాడికి అరుంధతి లాంటి భార్యని తీసుకురాలేము. వచ్చినావిడ పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే వాడు మనశ్శాంతిగా ఉండలేడు. పిల్లలు మిస్సమ్మతో తప్పితే ఎవరితోనూ కలవలేకపోతున్నారు అంటాడు.

నిర్మలమ్మ: ఇప్పుడు మిస్సమ్మ లాంటి అమ్మాయి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటుంది

ఆ మాటలు వింటున్న అరుంధతి ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది అంతలోనే మిస్సమని ఫాలో అవుతున్న వెయిటర్ ని చూసి అతను ఎందుకు మిస్సమ్మ ని ఫాలో అవుతున్నాడు అనుకుంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: నెల రోజుల ముందుగానే ఓటీటీకి వెంకటేష్‌ 'సైంధవ్‌'? స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Ram Gopal Varma: 'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద ఆర్జీవీ సెటైర్లు - ట్విట్టర్‌లో విరుచుకుపడిన వర్మ
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Balakrishna Akhanda 2: ఇక్కడ థియేటర్లలో, అక్కడ కుంభమేళాలో... 'అఖండ 2' అప్డేట్ ఇచ్చిన బాలయ్య, ఫ్యాన్స్‌కి పూనకాలే
ఇక్కడ థియేటర్లలో, అక్కడ కుంభమేళాలో... 'అఖండ 2' అప్డేట్ ఇచ్చిన బాలయ్య, ఫ్యాన్స్‌కి పూనకాలే
Embed widget