Nindu Noorella Saavasam Serial January 15th: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: భర్త ఎమోషన్స్ తో ఆడుకుంటున్న మంగళ, డబ్బుపై కన్నేసిన మనోహరి ఏం చేయబోతుంది
Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ తీసుకు వెళ్తున్న డబ్బుపై మనోహరి కన్ను పడుతుంది. ఆపై ఆమె ఏం చేయబోతుంది అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పంతులు ఇంట్లో ఉండటం చూసిన రామ్మూర్తి ఎందుకు ఈయనని పిలిపించావు అని భార్యని అడుగుతాడు.
మంగళ: మన పిల్లకి ఎప్పుడు పెళ్లి అవుతుందో, అసలు పెళ్లి యోగం ఉందో లేదో చూపిద్దామని రమ్మన్నాను జాతకం చూపించండి అంటుంది.
జాతకం తేవడానికి రామ్మూర్తి లోపలికి వెళ్తాడు అప్పుడు పంతుల్ని చెప్పింది గుర్తుంది కదా మేము ఏం చెప్పామో అదే చెప్పు అని హెచ్చరిస్తారు అక్కా, తమ్ముళ్లు.
రామ్మూర్తి జాతకం తీసుకొని వస్తాడు జాతకం చూసిన పంతులు ఈ అమ్మాయికి నాలుగు రోజుల్లో గా పెళ్లి జరగాలి లేదంటే జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.
రామ్మూర్తి: బాధగా ఇంట్లోంచి బయటికి వెళ్తాడు.
కాళీ: మన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలాగా ఉందక్క అంటాడు.
మంగళ: అవ్వక ఏమవుతుంది, ఎప్పటికైనా భాగమతి మనదే ఆ అరుంధతి ఆస్తి కూడా మనదే అని అంటుంది.
మరోవైపు ఇది ఈరోజుతో ఆగదు మాంత్రికుడు మళ్ళీ మళ్ళీ వస్తాడు. ఈరోజు పాముని వదిలాడు రేపు నిన్ను బంధించడానికి ఇంకేమైనా చేస్తాడు. ఈరోజు పిల్లలు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ పాము వలన ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడేవారు అందుకే నిన్ను నాతోపాటు మాలోకానికి వచ్చేయమంటున్నాను అంటాడు చిత్రగుప్తుడు.
అరుంధతి: సమస్యలు ఎదురైతే పోరాడుతాను కానీ పిల్లల్ని వదిలి రాలేను అంటుంది.
చిత్రగుప్తుడు : అంగుళీకము లేకపోయినా కూడా నిన్ను మా లోకానికి తీసుకుపోగలను కానీ పాపాత్ములని మాత్రమే అలా చేస్తారు. నిన్ను అలా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్తున్నాను నాతోపాటు వచ్చేయ్ అంటాడు.
ఇంతలో మిస్సమ్మ అక్కడికి వస్తుంది.
మిస్సమ్మ : అక్క.. ఇందాక మా ఇంట్లో పాము దూరింది అంటూ జరిగిందంతా చెప్తుంది. ఆ సమయంలో పిల్లలు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది అంటుంది. ఇంతలో పిల్లలు రావడంతో వాళ్ల దగ్గరికి వెళుతుంది.
పిల్లలు: మిస్సమ్మ.. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? గర్ల్స్ అందరూ అమ్ముకే సపోర్ట్ చేశారు.. ఇదంతా అంజలి ప్లానింగే అంటారు.
అమ్ము : అవును మిస్సమ్మ అబ్బాయిలలో కూడా ఇంకొందరు మనకు సపోర్ట్ చేస్తే చాలు గెలిచేయవచ్చు అంటుంది.
మిస్సమ్మ : సరే పదండి ముందు మీరు ఫ్రెష్ అయ్యి తర్వాత హోంవర్కులు చేసుకుంటే ఆపై ఏం చేస్తే బాయ్స్ మీకు సపోర్ట్ చేస్తారో ఆలోచిద్దాం అని పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది.
అరుంధతి: ఇదంతా చూస్తూ నాకంటూ ఉన్న రక్తసంబంధం వాళ్లే నాలాగా చూసుకునే ఒక తోడు వాళ్లకు దొరికే వరకు నేను రాలేను అని చిత్రగుప్తుడికి చెప్తుంది.
చిత్రగుప్తుడు: సరే ఆ తోడుని కూడా చూసిన తరువాతే అప్పుడే వద్దు గానివి అని చెప్పి వెళ్ళిపోతాడు.
మరోవైపు అరుంధతికి హంతకుడు మనోహర్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు భయపడిన మనోహరి నీలని ఫోన్ లిఫ్ట్ చేయమని నేను ఇంట్లో లేను అని చెప్పు అంటుంది.
నీల: ఫోన్ లిఫ్ట్ చేసి మా అమ్మగారు ఇంట్లో లేరు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేయమని చెప్తాను అంటుంది.
హంతకుడు : ఎప్పుడో చిన్నప్పుడు కాలం నాటి ఆటలు ఇప్పుడు ఆడవద్దు. మీ అమ్మగారు అక్కడే ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా డబ్బు ఇస్తే సరే సరి లేదంటే నేను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తాను అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు.
వీడికి ఎలాగైనా డబ్బులు ఇచ్చి అమర్ కి దూరంగా పంపించేయాలి ఇప్పుడు డబ్బులు సర్దడం ఎలా అని ఆలోచనలో పడుతుంది.
అదే సమయంలో అమర్ దగ్గరికి పొలం పై వచ్చిన డబ్బు తీసుకొని వస్తాడు అమర్ తండ్రి.
అమర్: ఈ డబ్బు నాకెందుకు నాన్న మీ సంపాదన మీద వచ్చింది మీ దగ్గరే ఉంచుకోండి అంటాడు.
అమర్ తండ్రి : ఈరోజో రేపో పోయే వాళ్ళం మేమేం చేసుకుంటాము ఎప్పుడూ అరుంధతికి ఇచ్చేవాడిని తను పిల్లల పేరు మీద డిపాజిట్ చేసేది. ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తాను అని కొడుకుతో చెప్పి మిస్సమని పిలిచి ఈ బ్యాగ్ పెద్దమ్మ గారికి ఇవ్వు అని చెప్పి పంపిస్తాడు.
ఇదంతా నీల, మనోహరి చూస్తారు.
నీల : చూడండమ్మా కాబోయే కోడలు మీరు ఉండగా డబ్బు ఆవిడ చేతికి ఇస్తున్నారు అంటే మీ స్థానం ఏమిటో అర్థం అవుతుందా అని అడుగుతుంది.
మనోహరి : ఆ డబ్బుని చూసి ఏదో ఆలోచనలో పడిన మనోహరి వాళ్ల ఆలోచన ఎలా ఉన్నా నా ఆలోచన మరోలాగా ఉంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని కసిగా నవ్వుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: ‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్‌లుక్!