Prema Entha Madhuram Serial January 13th: హరీష్ ప్రాణం తీసే ఆలోచనలో జలంధర్, సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన నిండు నూరేళ్ల సావాసం పిల్లలు!
Prema Entha Madhuram Serial Today Episode: పిల్లలకి చేతిలో చెయ్యేసి మాటిచ్చిన ఆర్య తన మాటని నిలబెట్టుకుంటాడా అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మీరు తప్పు చేశారు మరెప్పుడూ ఇలాంటి తప్పు చేయకండి అని పిల్లలకి చెప్తుంది ఉష.
పిల్లలు: మరెప్పుడూ ఇలాంటి తప్పు చేయము మమ్మల్ని క్షమించండి అని అంటారు.
సుగుణ: ఇకపై ఆ అవసరం మీకు రాదు లెండి ఎందుకంటే మీ అమ్మ మీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్తుంది.
పిల్లలిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
సుగుణ: యాదగిరి తో పిల్లల ఇద్దరికీ మాల తీయించే ఏర్పాట్లు చేయండి మనం పెళ్ళి ప్రయత్నాలు చేద్దాము. దివ్య పెళ్లి సూర్య పెళ్లి కలిపి చేసేద్దాము అంటుంది. అక్కడే ఉన్న హరీష్ ఈ మాటలన్నీ వింటాడు.
ఆ తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని జలందర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు హరీష్.
ఛాయాదేవి: స్వీట్ బాక్స్ తో వచ్చావ్ ఏంటి ఏమైనా గుడ్ న్యూసా అని అడుగుతుంది
హరీష్: వాళ్లకి గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చేసారు, అంతేకాదు రాధగారు సూర్య గారు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇంక మీరు పెళ్లి భోజనం చేయడం తప్పితే ఏమి చేయలేరు అంటాడు.
ఆ మాటలకి కోపంతో రగిలిపోతాడు జలంధర్. హరీష్ పీక పట్టుకొని నులుముతాడు హరీష్ ప్రాణ భయంతో కొట్టుకుంటాడు. మాన్సీ, ఛాయాదేవి ఇద్దరు జలంధర్ ని హరీష్ ని వదిలేయండి లేకపోతే చచ్చిపోతాడు అని విడిపించడానికి ప్రయత్నిస్తారు కానీ విడిపించలేక పోతారు.
జలంధర్: వాడి చావు కోసం నేను చూస్తుంటే నువ్వు వాడి పెళ్లి వార్త తీసుకొస్తావా అని కేకలు వేస్తాడు అలా జరగటానికి వీల్లేదు అంటూ కోపంతో ఊగిపోతాడు.
ఛాయాదేవి : వాళ్ల మీద కోపం విడి మీద చూపిస్తే ఏం చేస్తాడు వదిలేయ్ అన్నయ్య చచ్చిపోతాడు అనడంతో హరీష్ ని వదిలేస్తాడు జలంధర్.
మరోవైపు పిల్లల చేత మాలతియించి ఇంటికి తీసుకువస్తాడు యాదగిరి.
ఇక పెళ్లి పనులు ప్రారంభిద్దాం అంటూ మెహందీ గురించి మాట్లాడుకుంటూ ఆ పనిలో పడతారు అందరూ.
ఉష: అందరం బాగానే పనులు చేసుకుంటున్నాము గాని రాధ గారు అన్నయ్య ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి వచ్చినట్లు లేరు ఇద్దరు ముభావంగానే ఉన్నారు అంటుంది.
సుగుణ: పోను పోను వాళ్లే సర్దుకుంటారు. సర్దుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం కావాలి అంటుంది.
ఆ మాటలు విన్న పిల్లలిద్దరూ ఆర్య దగ్గరికి వెళతారు.
పిల్లలు: ఫ్రెండ్ ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతారు.
ఆర్య: అలాంటిదేమీ లేదు అని చెప్తాడు.
పిల్లలు: మరి ఎందుకు అలా ఉన్నావు మేము ఇంట్లోంచి పారిపోయినట్లు పెళ్లి టైం దగ్గరకు వచ్చేసరికి నువ్వు పారిపోవు కదా అంటారు. నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి చేసుకోవద్దు అంటారు
అక్కి: ఫ్రెండ్ మమ్మల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోనని మాటివ్వు. ఇన్ని రోజులు తండ్రి కోసం ఏడ్చాము ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే మేము భరించలేము అంటూ ఎమోషనల్ అవుతారు.
ఆర్య : ఈ చేతిలో చేయి వేసి మీరు లేకుండా నేను ఉండలేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అంటాడు మనసులో మాత్రం ఈ పెళ్లి లోపు మీ తండ్రిని మీ ముందు నిలబెడతాను అనుకుంటాడు. ఆ తర్వాత పిల్లల కోరిక మేరకు పెళ్ళి పనులలో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తాడు.
మరోవైపు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో క్యారెక్టర్లు ఎంట్రీ అవుతాయి. ఘోర అరుంధతిని బంధించలేకపోతున్నందుకు బాధపడతాడు. ఆత్మ పిల్లల కోసం తపిస్తుంది కాబట్టి పిల్లలని ఆధీనం చేసుకుంటే ఆత్మ తనంతట తానే వచ్చి స్వాధీనం అవుతుంది అనుకొని పిల్లల దగ్గరికి బయలుదేరుతాడు.
యాదగిరి: పెళ్లి పనులు చేస్తూ ఉన్న యాదగిరి పెళ్ళాన్ని పిలిచి మొగుడు కష్టపడుతున్నాడు వాడికి ఏమైనా ఇద్దామని ధ్యాస లేదు అని కసురుకుంటాడు.
భర్తని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది జ్యోతి.
యాదగిరి: నీ మాటలు అన్నీ నాకు వినబడుతున్నాయి అని భార్యని అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ పిల్లలు దెయ్యాల రూపంలో భయపెడతారు. వాళ్ల దెబ్బకి జడుసుకుంటాడు యాదగిరి.
అప్పుడు మాస్కులు తీసిన అంజు ఆకాష్ వాళ్ళు యాదగిరి ని చూసి నవ్వుతారు. ఎవరు మీరు అని అడుగుతాడు యాదగిరి.
అక్కి : వాళ్లు స్కూల్లో మా సీనియర్స్ నేనే పెళ్లికి ఇన్వైట్ చేశాను అంటుంది.
అంజు వాళ్ళు మా ఎంట్రీ అంటే కాస్త స్పెషల్ గా ఉండాలి కదా అని మళ్ళీ నవ్వుతారు వాళ్ళ నవ్వులతో ఇంట్లో వాళ్ళందరూ నవ్వులు కలుపుతారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: సంక్రాంతి హిట్ కొట్టిన 'హనుమాన్' - ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? తేజా సజ్జాకు ఎంతంటే!