అన్వేషించండి

Hanuman Cast Remuneration: సంక్రాంతి హిట్‌ కొట్టిన 'హనుమాన్‌' - ఎవరి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? తేజా సజ్జాకు ఎంతంటే!

Hanuman Cast Remuneration: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్న సినిమా 'హనుమాన్‌'. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాతో పోటీ ఉన్నప్పటికీ హనుమాన్‌పైనే అందరి దృష్టి పడింది.

Hanuman Cast Remuneration: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్న సినిమా 'హనుమాన్‌'. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాతో పోటీ ఉన్నప్పటికీ 'హనుమాన్‌'పైనే అందరి దృష్టి పడింది. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్‌ కాగా అందులో ఎక్కువ బజ్‌ అందుకుంది మాత్రం 'హనుమాన్‌' అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అంతా 'గుంటూరు కారం' వైపే చూశారు. ఈ మూవీ పక్కా హిట్‌ అనుకున్నారు. కానీ ఈ సినిమా కంటే కూడా 'హనుమాన్‌' మూవే బెటర్‌ రివ్యూస్‌ అందుకుంది.

దాంతో ఇండస్ట్రీ అంతా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ గురించే మాట్లాడుకుంటుంది. త్రివిక్రమ్‌-మహేష్‌ వంటి దిగ్గజాల సినిమాను సైతం వెనక్కి నెట్టి హిట్‌ కొట్టడమంటే సాధారణ విషయం కాదు. అదీ కూడా ఓ యంగ్‌ హీరోతో కలిసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. దాంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. ఇదే టైంలో హనుమాన్‌ నటీనటుల రెమ్యూనరేషన్‌ కూడా ఆసక్తిగా మారింది. ఈ లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం హనుమాన్‌ కోసం ప్రధాన తారాగణంకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ పది కోట్లు కూడా దాటలేదట. మరి ఈ సినిమా హీరోహీరోయిన్‌, ప్రధాన పాత్రల రెమ్యునరేషన్‌ ఎలా ఉందో చూద్దాం!

తేజ సజ్జా రెమ్యునరేషన్

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జా.. అద్భుతం, జాంబిరెడ్డి వంటి సినిమాలతో హీరోగా మెప్పించాడు. తనదైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో హనుమాన్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాలో లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. ఈ సినిమాలో సెటిల్డ్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న తేజా సజ్జా హనుమాన్‌ కోసం దాదాపు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు సమాచారం. 


వరలక్ష్మీ శరత్ కుమార్ పారితోషికం

తెలుగు, తమిళ్‌లో లేడీ విలన్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఉమెన్‌ ఒరియెంటెడ్‌ చిత్రాలతో పాటు పెద్ద హీరోలు, పాన్‌ ఇండియా చిత్రాల్లో లేడీ విలన్‌గా అలరిస్తున్నారు. అంతేకాదు పలు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్న వరలక్ష్మీ.. హనుమాన్‌లో హీరోకు అక్కగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇందుకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. 1 కోటీ నుంచి రూ. 1.5 కోట్ల వరకు తీసుకుందని తెలుస్తోంది. 

డైరెక్టర్‌గా ప్రశాంత్‌ వర్మ రెమ్యునరేషన్‌

అ! వంటి తొలి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా నిరూపించుకున్న ప్రశాంత్‌ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సూపర్‌ హీరో జానర్లో హనుమాన్‌ రూపొందించి బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. కేవలం రూ. 55 కోట్ల బడ్జెట్‌తో 11 భాషల్లో సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీకి బిగ్‌ హిట్‌ అందించాడు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ తీసుకున్న రెమ్యునరేసన్‌ రూ.1.5 కోట్లని సమాచారం. దీనిపై అధికారిక సూమాచారం లేదు కానీ, సోషల్‌ మీడియాలో ఆయన పారితోషికంపై చర్చ నడుస్తోంది. 

హీరోయిన్‌గా అమృత అయ్యర్‌కు ఎంత ముట్టిందంటే..

ఈ సినిమాలో మీనాక్షిగా అమృత అయ్యార్ కనువిందు చేసింది. హనుమాన్ సినిమాకు అమృత అయ్యర్ అదనపు ఆకర్షణను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక హనుమాన్ మూవీ కోసం అమృత అయ్యర్ సుమారు రూ. కోటీ పారితోషికం తీసుకుందని టాక్‌.

మిగిలిన కీ పాత్రల పారితోషికం ఇలా ఉంది..!

హనుమాన్ సినిమా కోసం రాజ్ దీపక్ శెట్టి (ఇస్మార్ట్ శంకర్ ఫేమ్) రూ. 85 లక్షలు, పాపులర్ కమెడియన్ వెన్నెల కిశోర్ రూ. 55 లక్షలు, వినయ్ రాయ్ రూ. 65 లక్షల రెమ్యునరేషన్, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను రూ. 35 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
Niharika NM: 'ది ప్యారడైజ్' విలన్‌తో నిహారిక మ్యూజిక్ వీడియో... వర్షంలో రొమాంటిక్ డ్యాన్స్
నిహారిక ప్రేమలో పడలేదు... వైరల్ ఫోటోల వెనుక అసలు కహానీ బయటపడింది
Balakrishna Surgery: బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget