Nindu Noorella Saavasam Serial January 10th: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఉంగరాన్ని కనిపెట్టిన చిత్రగుప్తుడు - అరుంధతి ఆత్మ అంతం కానుందా?
Nindu Noorella Saavasam Serial Today Episode: చిన్న ట్రిక్ ప్లే చేసి తన అంగుళీకము ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు చిత్రగుప్తుడు. ఆపై చిత్రగుప్తుడు ఏం చేస్తాడు అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అంజు కి దెబ్బ తగిలి ఏడుస్తుంటే ఆమెని ఓదార్చలేక విలవిలలాడిపోతుంది అరుంధతి.
అరుంధతి: హనుమంతుడిని ప్రార్థించి అంజు కడుపులో ఉన్నప్పటి నుంచి నేను నిన్నే పూజించాను నీ స్థలంలో పుట్టినందుకు ఆమెకి నీ పేరే పెట్టాను ఈరోజు అది బాధతో విలువిలలాడిపోతుంది ఆ బాధను తీర్చే శక్తిని ప్రసాదించు అని వేడుకుంటుంది.
ఆమె ప్రార్థన విన్న హనుమంతుడు హనుమాన్ ని పంపిస్తాడు. హనుమాన్ అరుంధతితో మాట్లాడుతాడు.
అరుంధతి: కంగారుపడుతూ నేను మీకు కనిపిస్తున్నానా అని అడుగుతుంది.
హనుమాన్: కనిపిస్తున్నారు అని చెప్పడంతో మీరు హనుమంతుడా అని అడుగుతుంది అరుంధతి. కాదు నేను కూడా మీలాంటి మనిషినే కానీ ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ఆయన శక్తిని నాకు ప్రసాదిస్తాడు మీరు కూడా ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి మీ దగ్గరికి పంపించాడు. నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అంటాడు.
అరుంధతి పిల్లల్ని చూపిస్తుంది.హనుమాన్ మ్యాజిక్ చేసి పిల్లల్ని ఫ్రీజ్ చేసేస్తాడు. అరుంధతి కంగారుపడుతూ హనుమాన్ వైపు చూస్తుంది.
హనుమాన్: నవ్వుతూ ఇప్పుడు మీరు మీ పిల్లలని తాకగలరు వెళ్లండి అని చెప్తాడు.
అరుంధతి ఆనందంగా పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని తనివి తీరా తాకి ముద్దులాడుకుంటుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి పసుపు తీసుకువచ్చి అంజు గాయానికి రాస్తుంది. ఆ తర్వాత హనుమాన్ దగ్గరికి వెళ్లి థాంక్స్ చెప్పుకుంటుంది. అప్పుడు పిల్లలు మళ్లీ మామూలుగా అయిపోతారు.
పిల్లలు: ఏం జరిగింది, ఏదో జరిగింది. అమ్మ వచ్చినట్లు నన్ను తాకినట్లు అనిపించింది అని అందరూ అంటారు.
అంజు: నా కాలి మీద ఈ పసుపు ఎలా వచ్చింది అంటే అమ్మ వచ్చిందా అమ్మే వచ్చి ఈ పసుపు వేసిందా అంటూ ఎమోషనల్ అవుతూ చుట్టూ చూస్తారు.
అప్పుడే వాళ్లకి హనుమాన్ కనిపిస్తాడు. ఆనంద పడుతూ హనుమాన్ దగ్గరికి వెళ్తారు పిల్లలు. నువ్వు స్పైడర్ మాన్ లాగా, ఐరన్ మాన్ లాగా అన్ని చేయగలవా అని అడుగుతారు.
హనుమాన్: ఈ మేన్అందరికీ మూలపురుషుడు మన మేన్అంటాడు. ఎవరు ఆ మేన్ అని పిల్లలు అడగటంతో హనుమాన్ అంటాడు.
పిల్లలు ఆనందంతో ఇంకా మీరు ఏమేమి చేయగలరు అని అడుగుతారు.
నేను ఏమేమి చేయగలనొ ఫిబ్రవరి 12వ తారీఖున థియేటర్ కి వస్తే అక్కడ చూద్దురుగాని మీ అందరికీ టిక్కెట్లు పంపిస్తాను అని చెప్తాడు.
పిల్లలు నవ్వడంతో ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు హనుమాన్. మేము ఆల్రెడీ టికెట్లు బుక్ చేసేసుకున్నాం అంటారు పిల్లలు. అయితే జనవరి 12న థియేటర్లో కలుద్దాం అని చెప్పి ఎగిరిపోతాడు హనుమాన్.
ఆ తర్వాత చిత్రగుప్తుడికి జరిగినదంతా చెప్తుంది అరుంధతి. ఆ హంంతకుడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు ఈ ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తాడా అని అడుగుతుంది.
చిత్రగుప్తుడు: చేయటానికి కాదు కలవడానికి వచ్చాడు దొంగ దొరక వలసింది కానీ త్రుటిలో తప్పించుకుంది. ఆ బాలిక బండారం బయటపడే రోజు దగ్గర పడింది అని మనసులో అనుకొని బయటికి ఏదో మాట్లాడాలనుకుంటాడు.
అరుంధతి: వద్దులెండి ఏమైనా అంటే నా అంగుళీకము నాకు ఇస్తే చెప్తాను లేకపోతే నేనేమీ చెప్పలేను అంటారు. నా దగ్గరేమో మీ అంగుళీకము లేదు, మీరేమో నమ్మరు అంటుంది.
చిత్రగుప్తుడు: ఆ అంగుళీకము నీ దగ్గర లేదు అని నాకు తెలుసు ఎందుకంటే అది ఎక్కడ ఉన్నదో తెలుసుకొని నేను తీసుకున్నాను ఇక మన ఇద్దరం మా లోకానికి వెళ్ళవలసిన టైం వచ్చింది అని సీరియస్ గా చెప్తాడు.
అరుంధతి: కంగారుపడుతూ కొంపదీసి ఉంగరం ఈయన చూసేసారా అనుకుంటూ తను ఎక్కడైతే ఉంగరం దాచిందో అక్కడికి వెళ్లి వెతుకుతుంది. అరుంధతిని ఫాలో అయ్యి చిత్రగుప్తుడు ఆ ఉంగరాన్ని చూసేస్తాడు.
చిత్రగుప్తుడు: అంగుళీకాన్ని పక్కనే పెట్టుకొని నన్ను ఎన్ని ముప్ప తిప్పలు పెట్టావు అనుకుంటాడు.
అరుంధతి: ఉంగరాన్ని చూసి ఉంగరం ఇక్కడే ఉంది గుప్తా గారు ఏమిటి అలా అన్నారు ఆయన పని చెప్తాను అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అయితే పక్కనే దాక్కొని ఉన్న చిత్రగుప్తుడిని గమనించదు. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.
Also Read: 'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? - ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారంటే?