అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial February 7th: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అమర్‌కు అడ్డంగా దొరికిపోయిన కాళీ, మనోహరి.. నిజం చెప్పే ప్రయత్నంలో మిస్సమ్మ!

Nindu Noorella Saavasam Serial Today Episode: తనని అపార్థం చేసుకుంటున్న అమర్ కి నిజం చెప్పాలని మిస్సమ్మ ప్రయత్నిస్తూ ఉండటంతో కధలో కీలక మలుపులు ఏర్పడతాయి

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కన్నీరు పెట్టుకుంటూ కాళీ తో షాపింగ్ కి బయలుదేరుతుంది మిస్సమ్మ.

మరోవైపు అమర్ రాథోడ్ ని పిలిచి కార్ కీస్ ఇవ్వు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి మనోహరిని తనతో పాటు బయటికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి అని మనోహరి అడిగితే సమాధానం చెప్పడు.

 అరుంధతి: మనోహరిని ఈయన ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనుకుంటుంది.

కారులో వెళ్తున్న మనోహరి ఆనందంతో గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఫస్ట్ టైం మనిద్దరమే కలిసి బయటికి వెళ్తున్నాము, ఎప్పటికైనా కలిసి వెళ్ళేది మనిద్దరమే ఆగిపోయిన నీ జీవితం నాతోనే ప్రారంభం అవ్వాలి అని మనసులో సంతోష పడిపోతుంది.

ఇంతలో రాంగ్ రూట్ లో వస్తున్న  కాళీ అమర్ కారుని ఢీ కొంటాడు.

అమర్: రాంగ్ రూట్లో నీ ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నావు నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేది అంటాడు.

కాళీ : నా బండి నా ఇష్టం అయినా పని మీద పోతున్నాను కాబట్టి ఇలా రాంగ్ రూట్లో వస్తున్నాము అంటాడు.

అమర్ మిస్సమ్మ మళ్ళీ కలవకూడదు అనుకున్న మనోహరి వాళ్ళిద్దరూ ఎదురుపడటంతో కంగారుపడుతుంది.  అలాంటి వాళ్లతో మనకి మాటలు ఏంటి మనమే తప్పించుకుని వెళ్ళిపోవాలి అని అమర్ తో చెప్తుంది.

మిస్సమ్మ: రాంగ్ రూట్లో రావడం తప్పే సారీ అని చెప్తుంది.

అమర్: ప్రతిసారి తప్పు చేయటం తర్వాత సారీ చెప్పటం అలవాటైపోయింది అంటాడు.

కాళీ : తను నా కాబోయే భార్య తనని ఏమైనా అంటే ఊరుకోను అంటాడు.

అమర్: తనని పెళ్లి చేసుకుంటావో, పల్లకిలో ఊరేగిస్తావో నాకు అనవసరం కానీ మళ్ళీ ఇలా రాంగ్ రూట్లో కనిపిస్తే ఊరుకోను అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

తర్వాత అమర్ మనోహరి ని ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్లి చీర సెలెక్ట్ చేసుకోమంటాడు.

మనోహరి: ఇది నిజమేనా నువ్వు ఎందుకు చీర కొంటున్నావు అని ఆనంద పడిపోతూ అడుగుతుంది.

అమర్: ఇది నా బాధ్యత వెళ్లి చీర సెలెక్ట్ చేసుకో అనటంతో మరింత ఆనంద పడిపోతుంది మనోహరి.

మనోహరి: ఇప్పుడు ఎందుకు చీర కొంటున్నావు అని అడుగుతుంది.

అమర్: రేపు నీకు పెళ్లిచూపులు అందుకే నీకు నచ్చిన చీర కొనుక్కో అంటాడు.

మనోహరి: నాకోసం చీరకొంటున్నావంటే బంధం దగ్గర అవటానికి అనుకున్నాను కానీ శాశ్వతంగా బంధాన్ని దూరం చేయడానికా అని మనసులో అనుకుంటుంది.

అదే సమయానికి అదే షాప్ కి వస్తారు మిస్సమ్మ, కాళీ. మళ్లీ ఇద్దరూ ఎదురు పడటంతో కళ్ళతోనే కాళీ ని మందలిస్తుంది మనోహరి.

మనోహరి:  కోపంగా ఎందుకు మా వెంట పడుతున్నారు. మళ్లీ మాయ మాటలు చెప్పి అమర్ ని మాయ చేయడానికా అని అంటుంది.

అమర్: ఒకసారి నమ్మి మోసపోయాను.. మళ్ళీ అలాంటి పొరపాటు చేయను అంటాడు.

కాళీ : తర్వాత మిస్సమ్మని వేరే కౌంటర్ కి తీసుకుని వెళ్లి నువ్వు చీర సెలెక్ట్ చేస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్తాడు.

అమర్ పక్కకు వెళ్లడంతో మనోహరి కూడా కాళీ దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరూ ఎదురెదురు పడితే ఇనుము అయస్కాంతం లాగా అతుక్కుపోతారు. అప్పుడు మనిద్దరం చెప్పకూడ తినాలి. మర్యాదగా షాపింగ్ పూర్తి చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది.

వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగే సరికి అక్కడ అమర్ ఉంటాడు. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.

అమర్: నా దగ్గర ఏం దాచాలని ప్రయత్నిస్తున్నావు మనోహరి, మిస్సమ్మలాగా నువ్వు కూడా ఏమైనా దాస్తున్నావా అని నిలదీస్తాడు

మనోహరి : అవును, తను నీ కంటపడిన ప్రతిసారి నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమవుతుంది. అందుకే తనని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో అని అతనితో మాట్లాడుతున్నాను. అదే నీ దగ్గర దాచాను అని అబద్ధం చెప్తుంది.

ఇలాంటి వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది త్వరగా వచ్చేయ్ అని అమర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఎదురుగా వస్తున్న మిస్సమ్మని చూసుకోకుండా డాష్ ఇస్తాడు. మిస్సమ్మ ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు.

మిస్సమ్మ: మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను ముందు నేను చెప్పేది వినండి అంటుంది.

అమర్: నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను అంటాడు.

మిస్సమ్మ : నా ఆత్మ తృప్తి కోసం నేను చెప్పాలనుకున్నది చెప్తాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పి తను తన తండ్రి కోసమే ఇదంతా చేశాను అని మొత్తం జరిగిందంతా చెప్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget