Nindu Noorella Saavasam December 14th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మనోహరికి షాకిచ్చిన కిల్లర్.. అరుంధతిని బంధించేసిన ఘోర!
Nindu Noorella Saavasam Today Episode: ఘోర బంధించిన మనోహరిని తెలియకుండానే రక్షించడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరుంధతిని చూస్తూ చనిపోయినా నువ్వు ఆ ఇంటికి మహారాణివే, నిన్ను అక్కడ బంధించలేను ఇక్కడ నిన్ను బంధించినా ఎవరూ అడ్డుకోలేరు అని అనుకుంటాడు ఘోర.
మరోవైపు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాస్తున్న అంజుని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంతలో అరుంధతికి పిల్లలు ఆడుకునే బొమ్మ శబ్దం వినిపిస్తుంది. శబ్దం వస్తున్న వైపు వెళ్లి ఆ బొమ్మని తీసుకుంటుంది. అయితే అప్పటికే ఘోర అక్కడ అరుంధతిని బంధించే ఏర్పాట్లు చేసి ఉంచుతాడు.
అరుంధతి: ఇక్కడ ఎవరూ లేరు కానీ బొమ్మ ఉంది.. ఎవరో పిల్లలు వదిలేసి ఉంటారు అనుకొని బొమ్మని పట్టుకొని వెనక్కి రాబోతుంది కానీ కనిపించని వలయం ఒకటి ఆమెని అడ్డేస్తుంది. కంగారు పడిపోతుంది అరుంధతి. అప్పుడే వికటంగా నవ్వుతున్న ఘోర కనిపిస్తాడు.
ఘోర : ఇప్పుడు నువ్వు నాకు బందీవి.
అరుంధతి: నన్ను వదిలేయ్.. నేను మా ఇంటికి వెళ్లి పోతాను అని బ్రతిమాలుకుంటుంది
ఘోర : చనిపోయిన దానివి నీకు బంధాలు బంధుత్వాలు ఏమిటి? ఇప్పుడు నువ్వు గాలివి మాత్రమే అంటూ బంధించడానికి వస్తూ ఉంటాడు.
మరోవైపు మనోహరికి అరుంధతిని చంపిన కిల్లర్ ఫోన్ చేస్తాడు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు అనుకోని పక్కకు వెళ్లి మాట్లాడుతుంది.
మనోహరి : నిన్ను అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి దాకోమన్నాను కదా అయినా నాకు ఫోన్ చేసావ్ ఏంటి అని చిరాకు పడుతుంది.
కిల్లర్: ప్రాణాలు తీసి పొట్ట పోసుకునే వాడిని అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే నాకు తిండి ఎలా అంటాడు.
మనోహరి : సరే పదివేలు పంపిస్తాను తీసుకుని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపో.
కిల్లర్: 10 లక్షలు కావాలి.
మనోహరి: నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటున్నావా.
కిల్లర్: నాదేముంది మేడం, నేరుగా లెఫ్ట్నెంట్ సార్ దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తాను, నిజం చెప్పినందుకు నాకు శిక్ష కూడా తగ్గిస్తారు. నాకు జైలు జీవితం కొత్త కాదు కానీ మీ గురించే ఆలోచిస్తున్నాను.
మనోహరి : ఎప్పటికి కావాలి.
కిల్లర్: మీరు మనీ రెడీ చేసుకోండి నేను ఎప్పుడు ఇవ్వాలో చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
మనోహరి : టెన్షన్ పడుతూ వీడిని ఎలాగైనా అమర్ కి దూరంగా పంపించేయాలి.
మరోవైపు ఎగ్జామ్ రాసిన అంజు పేపర్ ప్రిన్సిపల్ మేడం చేతికిస్తుంది. అంజు రాసిన పేపర్ చూసి షాక్ అయిపోతుంది ప్రిన్సిపల్. షాక్ లోనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే పిల్లలు ఎదురుపడతారు.
పిల్లలు: మా చెల్లి ఎగ్జామ్ బాగా రాసిందా అడ్మిషన్ దొరుకుతుందా అని ఆనందంగా అడుగుతారు.
ప్రిన్సిపల్: షాక్ లో ఉండగానే ఎక్సమ్ పాస్ అయింది అడ్మిషన్ ప్రాసెస్ చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆనందంతో కూతుర్ని హగ్ చేసుకుంటాడు అమర్.
మరోవైపు తనని బంధించడానికి వస్తున్న ఘోరని చూసి భయపడిపోతుంది అరుంధతి. అప్పుడే అక్క అనే పిలుపు వినిపిస్తుంది. ఒక్కసారిగా అటువైపు చూస్తారు అరుంధతి, ఘోర. అక్కడ మిస్సమ్మ నిల్చోని ఉంటుంది.
ఘోర : షాక్ అయిపోతూ ఒక మనిషికి ఆత్మ కనిపిస్తుందా? ఇది ఎలా సాధ్యం? అని అనుకుంటాడు. అటువైపే వస్తున్న మిస్సమ్మని చూసి దాక్కుంటాడు.
మిస్సమ్మ: అక్క.. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అరుంధతి వైపు వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఘోర పెట్టిన మంత్రించిన నిమ్మకాయలని చూసుకోకుండా తోసేస్తుంది. అప్పుడే ముందుకి తూలి పడిపోబోతుంటే చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లో నీళ్లు ఘోర గీసిన గీత మీద పడి ఆ గీత శక్తి కోల్పోతుంది. అది చూసిన ఘోర ఫ్రెష్టేట్ అయిపోతాడు. ఆ తర్వాత మిస్సమ్మ అరుంధతి దగ్గరికి వచ్చి ఎందుకు అలా అయిపోతున్నారు ఒంటినిండా ఆ చెమటలు ఏమిటి అని అడుగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.