Nindu Noorella Saavasam Serial Today September 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి – రౌడీలతో వెళ్లిన రణవీర్
Nindu Noorella Saavasam serial Today Episode September 13th: గణపతి నిమజ్జనానికి వెళ్లిన పిల్లలను చంపేందుకు రౌడీలతో వెళ్తాడు రణవీర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు వెంటనే కోలుకోవాలని అక్కడే హాస్పిటల్ లో ఉన్న దేవుడి దగ్గరకు వెళ్లి పిల్లలు ముగ్గురు మొక్కుతుంటారు. మనోహరి వచ్చి పిల్లలను చూసి దగ్గరకు వెళ్తుంది.
మను: అమ్ము మీరేంటి ఇక్కడున్నారు.. ఇక్కడేం చేస్తున్నారు..? భాగీ, తాతయ్య ఎక్కడ
అమ్ము: తాతయ్య కారిడార్‌లో ఉన్నారు. మిస్సమ్మ ఎవరి కోసమో వెళ్లింది.
మను: ఎవరి కోసం వెళ్లింది.
ఆనంద్: తెలియదు ఆంటీ
మను: సరే మీరు ఇక్కడేం చేస్తున్నారు
ఆకాష్: అంజు త్వరగా కోలుకోవాలని దేవుడిని మొక్కుతున్నాము
మను: మీరు ఇలా అడిగితే దేవుడు వరం ఇవ్వడు.. డైరెక్టుగా దేవుడి దగ్గరకు వెళ్లి వేడుకుంటే అంజును కాపాడతాడు
అమ్ము: దేవుడి దగ్గరకా ఆయన ఎక్కడున్నాడని వెతకాలి
మను: ఈరోజు వినాయకుడి నిమజ్జనం కదా అక్కడికి వెళ్లి నిమజ్జనం అయ్యే వినాయకుడిని ప్రార్థిస్తే వెంటనే అంజు లేచి కూర్చుంటుంది.
ఆనంద్: నిజంగానా.. ? అలా చేస్తే అంజుకు నయం అవుతుందా..?
మను: కచ్చితంగా అవుతుంది. నేను చాలా సార్లు అలానే చేశాను. నా కోరికలన్నీ నెరవేరాయి.
ఆకాష్: మరి ఈ సారి అంజు కోసం మీరు ప్రార్థించవచ్చు కదా..? నిమజ్జనం దగ్గరకు వెళ్లి రావొచ్చు కదా
మను: అది మీరు అంజలికి ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ నాకు అంజలికి ఎలాంటి సంబంధం లేదు.. అంజలి నా కూతురు లాంటిదే కానీ నా సొంత కూతురు కాదు కదా..? రక్త సంబంధం ఉన్న వాళ్లు ప్రార్థిస్తేనే దేవుడు వారి కోరికను మన్నిస్తాడు. అర్థం అయిందా..?
అమ్ము: అర్థం అయింది ఆంటీ
మను: అయితే మీరు ముగ్గురు నిమజ్జనం జరిగే చోటుకు వెళ్లి దేవుడిని ప్రార్థిస్తారా..? అంజు బతుకుతుంది
ఆనంద్: మా అంజు కోసం మేము ఏమైనా చేస్తాం.. పదండి వెళ్దాం
మను: అటు ఎక్కడికి ఎంట్రన్స్ ఇటువైపు ఉంది
అమ్ము: మా తాతయ్యతో మిస్సమ్మతో చెప్పి వెళ్తాం.. పైగా డాడీ పర్మిషన్ తీసుకోవాలి
మను: వాళ్లను అడిగితే మిమ్మల్ని వెళ్లనివ్వరు.. మీ డాడీ మీకు పర్మిషన్ కూడా ఇవ్వరు..
ఆనంద్: ఎవరితో చెప్పకుండా ఎలా వెళ్తాము
మను: ఒక మంచి పని చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రార్థనల వల్ల అంజలి కోలుకుంటే అదే చాలు కదా..?
ఆకాష్: కరెక్టే.. మనం తిరిగి వచ్చే లోపు అంజలి లేచి కూర్చుంటే మనకు కూడా సర్‌ప్రైజ్ గా ఉంటుంది కదా..? పదండి వెల్దాం
అమ్ము: చాలా థాంక్స్ ఆంటీ మాకు మంచి ఐడియా ఇచ్చారు వెళ్లొస్తాము ఆంటీ..
మను: ( మనసులో) వెళ్లండి వెళ్లండి మీరు కూడా ప్రాణాలతో తిరిగి రారు.. నిమజ్జనం దగ్గర తొక్కిసలాటలో చచ్చిపోతారు. ఇక్కడ అంజు అక్కడ మీరు చచ్చిపోతే అమరేంద్ర భాగీని తన్ని తరిమేస్తాడు. ఆ తర్వాత అమర్‌ను నా సొంతం చేసుకుంటాను
అనుకుంటూ మనోహరి రణవీర్‌కు ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పి పిల్లలను అక్కడే చంపేయమంటుంది. రణవీర్ తన మనుషులతో నిమజ్జనం దగ్గరకు వెళ్లి పిల్లల కోసం వెతుకుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















