అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  హాస్పిటల్ కు వెళ్లిన వార్డెన్‌ - వార్నింగ్‌ ఇచ్చిన మను

Nindu Noorella Saavasam serial Today Episode September 11th: మనోహరి గురించి నింజ చెప్పడానికి సరస్వతి వార్డెన్‌ హాస్పిటల్‌కు వెళ్తుంది. మను, వార్డెన్‌ ను చూస్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆశ్రమంలో ఉన్న సరస్వతి వార్డెన్‌ అంజుకు జరిగిన ప్రమాదం గురించి టీవీలో చూస్తుంది. అప్పుడు వచ్చిన రాజుతో ఆ విషయం గురించి అడుగుతుంది. రాజు కూడా తనుక విషయం తెలుసని బాధపడతాడు.

వార్డెన్‌: దేవుడికి దయ లేదు రాజు గారు. ఎంత మంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ కుటుంబానికి ఇంత కష్టమా..? ఆ చిన్న పాపను తలుచుకుంటుంటేనే గుండె తరుక్కపోతుంది.

రాజు: అవును మేడం కొంత మంది మనుషులు స్వార్థంగా ఆలోచిస్తూ.. మారణహోమం సృష్టిస్తూ ఉంటారు. అక్కడ అంత మంది ఉన్నా ఒక్క అమరేంద్ర కుటుంబం మీదే దాడి జరిగింది అంటే కచ్చితంగా ఆ దాడి వెనక మనోహరి హస్తం ఉండే ఉంటుంది

వార్డెన్‌: ఆ మారణహోమం మనోహరి పనే అయ్యుంటుందా..?

రాజు: ఆ రాక్షసి ఎంతకు తెగిస్తుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ దుర్మార్గురాలి  ఆగడాలకు అంతే లేకుండా పోతుంది

మనోహరికి వార్డెన్‌ ఫోన్‌ చేస్తుంది.

వార్డెన్‌: ఓసేయ్‌ రాక్షసి నువ్వు మనిషివేనా..? ఆడదానివేనా..? మారవా నువ్వు

మను:  ఎవరు నువ్వు..

వార్డెన్‌: నేను ఎవరో గుర్తు పట్టలేదా..? నా వాయిస్ గుర్తు రావడం లేదా..?

మను: ఓ వార్డెనా..

వార్డెన్‌: అవునే నేను వార్డెన్‌ నే మాట్లాడుతున్నాను నీలాంటి నీచురాలిని దుర్మార్గురాలిని హంతకురాలిని పెంచిన వార్డెన్‌ ను మాట్లాడుతున్నాను..

మను: ఈ రోజు నేను ఇలా తయారు అవ్వడానికి కారణం నువ్వే కదా వార్డెన్‌

వార్డెన్‌: ఈ చేతులతో నిన్నే కాదే.. అరుంధతిని కూడా పెంచాను. తను దేవత అయితే నువ్వు దెయ్యానివి అయ్యావు.. స్నేహితురాలు అని కూడా చూడకుండా అరుందతిని పొట్టన పెట్టుకున్నావు.. ఆ కుటుంబాన్ని అష్టకష్టాల పాలు చేస్తున్నావు.. నీ దుర్మార్గానికి అంతే లేదా.? ఇప్పుడు ఆ చిన్న పాప చావుబతుకుల్లో ఉండటానికి కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది

మను: అనిపించడం ఏంటి వార్డెన్‌ అదే నిజం

వార్డెన్‌: నాకు తెలుసే నువ్వే చేసి ఉంటావని.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావు నీ రక్త దాహం ఇంకెప్పటికీ తీరుతుంది.

మను: అవును నేనే అరుంధతిని చంపాను.. ఇప్పుడు ఆంజు చనిపోతే దానికి కూడా నేనే కారణం.. ఇవే కాకుండా నేను ఇంకా ఎన్నో చేశాను అయితే ఏంటి..? నన్నేం చేయగలవు నువ్వు..

అని మను వార్నింగ్‌ ఇవ్వగానే.. ఇప్పుడే వచ్చి నీ గురించి అమరేంద్రకు నిజం చెప్తాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది వార్డెన్‌. వెంటనే హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ మను ఎదురవుతుంది.

మను: ఫోన్‌లో బెదిరిస్తుంటే.. ఏమో అనుకున్నాను.. ధైర్యం చేసి డైరెక్టుగా వచ్చేశావన్న మాట

వార్డెన్‌: అవును ధైర్యం చేసి వచ్చాను.. ఇక నీకు బెదురుకునే ప్రసక్తే లేదు.. అందుకే ధైర్యంగా వచ్చేశాను. నువ్వు చేసిన పాపాలన్నీ ఈరోజు బయట పెట్టడానికే వచ్చాను.  

మను: అవునా ఎవరితో నా విషయాలు బయట పెడతావు.. అసలు నువ్వు చెప్తే వినడానికి అమరేంద్ర ఇక్కడ ఉండాలి కదా..? అమర్‌ ఎప్పుడో బయటకు వెళ్లిపోయాడు..

వార్డెన్‌: అమరేంద్ర ఉన్నా లేకపోయినా.. భాగీ ఉంది కదా ఆవిడకు చెప్తాను.

మను: ఆగు ఇప్పుడు నువ్వు అక్కడకు వెళ్లి దానికి నిజాలు చెప్పావంటే నా సంగతి తెలుసు కదా.? తర్వాత నిన్ను చంపేస్తాను..   

వార్డెన్‌: నీ ఇష్టం వచ్చింది చేసుకో.. నువ్వేం చేసినా ఇవాళ నేను వాళ్లకు నిజం చెప్పి తీరుతాను..

అంటూ వార్డెన్‌ ఐసీయూ దగ్గరున్న భాగీ దగ్గరకు వెళ్తుంది. భాగీతో మాట్లాడుతుంది. అంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి కోపంగా చూస్తుంటుంది. వార్డెన్‌ చెప్పిన విషయాలు వింటూ భాగీ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget