అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును కొట్టబోయిన మనోహరి – నిజం దాచేసిన రాథోడ్

Nindu Noorella Saavasam Today Episode: ఆరు తల్లిదండ్రుల గురించి నిజం తెలుసని, కానీ ఆ నిజం ఎవ్వరికీ తెలియకూడదని అమర్ డైరీలో రాసుకోవడం ఆరు చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ ఆలోచిస్తూ వెళ్లిపోతుంది రాథోడ్‌ వచ్చి పలకరించినా  పలకదు. దీంతో రాథోడ్‌ తట్టి ఏమైందని అడుగుతాడు. దీంతో అడాప్ట్‌ సర్టిఫికెట్‌ గురించి భాగీ చెప్పగానే రాథోడ్‌ టెన్షన్‌ పడుతుంటాడు. సార్‌ రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే అంజలి గురించి నిజం అందరికీ తెలిసిపోయేదని అనుకుంటాడు. ఇంతకీ ఇవాళ కూడా అనుకోకుండా అనాథ శరనాలయానికి ఎందుకు తీసుకెళ్లారు. నాకెందుకో ఆయన ఏదో దాస్తున్నట్లున్నారు అని భాగీ అడగ్గానే నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు వెళ్లి పడుకో అని రాథోడ్‌ చెప్తాడు. మిస్సమ్మ వెళ్లిపోతుంది. మరోవైపు బాబ్జీతో కలిసి రణవీర్ ఇంటికి వెళ్లిన మనోహరి కూతురు కోసం బాధపడుతున్న రణవీర్‌ను చూస్తుంది.

బాబ్జీ: ఏంటి మేడం మీకో కూతురు ఉందా.

మనోహరి: ఉండేది.

బాబ్జీ: వదిలేసి వచ్చారా? మేడం.

మనోహరి: వదిలించుకుని వచ్చేశా..

బాబ్జీ: మేడం మనిషి ప్రాణం తీసేంత క్రూరత్వం ఉంటే అవసరం అనుకున్నాను. కానీ తల్లి అయ్యి ఉండి నెలల బిడ్డను వదిలించుకుని వచ్చానని కొంచెం కూడా పశ్చాతాపం లేదు మీకు.

మనోహరి: అరుంధతి ప్రాణం తీసి నువ్వు కూడా పిల్లలకు తల్లిని దూరం చేశావు. నువ్వు నేను మంచి గురించి మనుసు గురించి మాట్లాడుకోకూడదు బాబ్జీ.

 అనగానే బాబ్జీ నాది అవసరం మేడం అంటే నాది  పంతం, పగ అందుకే ఇలా చేశాను. రాజు ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ఫ్రాణాలు ఆ బిడ్డలో ఉన్నాయి రణవీర్‌. అదెక్కడ ఉందో నాకు తెలియదు. కానీ ఎక్కడ వదిలేశానో చెబితే నువ్వు ఎలాగైనా పట్టుకుంటావు. అని రణవీర్‌ను హైదరాబాద్‌ లో లేకుండా చేయమని బాబ్జీకి చెప్తుంది మనోహరి. లోపల పడుకున్న రణవీర్‌ నిద్రలో కూడా కూతురుని తలుచుకుంటూ ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ లేని టైం చూసి ఆరు అమర్‌ రూంలోకి వెళ్తుంది. అమర్‌ డైరీ రాస్తుంటాడు. అందులో ఆరు గతం గురించి కన్నవాళ్ల గురించి తెలుసుకున్నట్లు డైరీలో రాస్తుంటాడు. అయితే అందరికీ కన్నీళ్లను మిగిల్చే ఆ చేదు నిజాన్ని నాలోనే దాచుకుంటాను అని రాయడంతో ఆరు భాదపడుతుంది.

ఆరు: నా కన్నవాళ్ల గురించి నాకు తెలుసుకోవాలని ఉందండి. కానీ దాని వల్ల మీరు బాధపడుతుంటే నాకు చాలా భయంగా ఉందండి.

అమర్‌: అంజలి నా కూతురు కాదని ప్రపంచానికి, అంజలికి చెప్పే ధైర్యం నాకు ఉందో లేదో తెలియడం లేదు ఆరు. కానీ తను నా కూతురు. తన కన్నవాళ్లను కనిపెట్టి తనను దూరం చేసుకోలేను. అలా అని అంజలికి నిజం దాచిపెట్టి నేను తప్పు చేయలేను.

   అంటూ అమర్‌ ఏడుస్తేంటే ఆరు వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. అమర్‌ కూడా తనను ఎవరో తాకినట్లు ఫీలవుతాడు. ఇంతలో మిస్సమ్మ పైకి వచ్చి  ఏడుస్తున్న అమర్‌ ను చూస్తుంది. అప్పటికే మిస్సమ్మ అలికిడి విన్న ఆరు తలుపు చాటున దాక్కుంటుంది. మిస్సమ్మ చూస్తూ ఉంటుంది.

అమర్‌: మిస్సమ్మ నిన్న ఏదో అరిచాను సారీ

భాగీ: లేదండి నేనే మీకు సారీ చెప్పాలి. మీ పర్మిషన్‌ లేకుండా ముట్టుకున్నాను. ఇంకోసారి మీ పర్మిషన్‌ లేకుండా ముట్టుకోనండి.

అమర్‌: ఈ రూమ్‌లో నీకు ఏం ముట్టుకోవడానికైనా.. ఈ ఇంట్లో నువ్వు ఏం చేయడానికైనా నీకు పూర్తిగా అధికారం ఉంది. కానీ ఈ కప్‌బోర్డులో ఉన్నవన్నీ నా ఆరు జ్ఞాపకాలు. నాకు మిగిలినవి అవి మాత్రమే. ఏమీ అనుకోకు మిస్సమ్మ.

భాగీ: అయ్యో పర్లేదండి అక్క విషయంలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.

  అని భాగీ వెళ్లిపోతుంది. అమర్‌ డైరీ చూస్తూ ఉండిపోతాడు. తర్వాత పిల్లలు అందరూ గార్డెన్‌ లో క్రికెట్‌ అడుతుంటారు. బాల్‌ వెళ్లి మనోహరికి తాకుతుంది. అంజు వెళ్లి మనోహరిని బాల్‌ అడుగుతుంది. కోపంగా మనోహరి అంజును కొట్టబోతుంటే రణవీర్‌ వస్తాడు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు మనమే చూసుకుని నడవాలి. అని అంజుకు సారీ చెప్పిస్తాడు. దీంతో అంజు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి థాంక్స్‌ చెప్పగానే రణవీర్‌కు తన కూతురు గుర్తుకువస్తుంది. నిన్ను చూస్తుంటే నా దుర్గను చూస్తున్నట్లు ఉందమ్మా అని రణవీర్‌ చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. దీంతీ ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget