(Source: Poll of Polls)
Nindu Noorella Saavasam Serial Today October 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ల్యాబ్‌కు వెళ్లిన రాథోడ్ - భయంతో వణికిపోయిన మను
Nindu Noorella Saavasam serial Today Episode October 31st: రాథోడ్ ఫింగర్ ఫ్రింట్స్ తీసుకుని ల్యాబ్‌కు వెళ్లడంతో మనోహరి నిజం బయటపడుతుందన్న భయంతో వణికిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని చంపాలనుకున్నది ఎవరో తెలుసుకోవడానికి అమర్ ఇంట్లో వాళ్ల ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వమంటాడు. దీంతో భాగీ షాక్ అవుతుంది.
భాగీ: ఏవండి మళ్లీ ఫింగర్ ఫ్రింట్స్ ఎందుకు
రాథోడ్: ఈ శారీకి కెమికల్స్ స్ప్రే చేసింది ఎవరో తెలియాలి కదా మిస్సమ్మ. ఈ శారీ మీద వాళ్ల వేలి ముద్రలు ఉంటాయి
భాగీ: కానీ ఇంట్లో వాళ్ల వేలి ముద్రలు ఎందుకు
అమర్: నిన్నటి నుంచి బయటి వాళ్లు ఎవ్వరూ ఇంట్లోకి రాలేదు. అంటే ఇది కచ్చితంగా ఇంట్లో వాళ్ల పనే అయ్యుండాలి. అందుకే అందరూ మీ ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వండి
రాథోడ్: సార్ ముందుగా నా వేలి ముద్రలు తీసుకోండి
అమర్ కూడా తన వేలి ముద్రలు ఇస్తాడు. మనోహరి, ఛంభా భయపడుతుంటారు.
అమర్: పిల్లలు మీరు కూడా మీ వేలి ముద్రలు వేయండి
అమ్ము: మేమేందుకు డాడ్ మేమేందుకు వేలి ముద్రలు ఇవ్వాలి. మమ్మల్ని అనుమానిస్తున్నారా..?
అంజు: డాడీ అందరి ఫింగర్ ఫ్రింట్స్ ఇవ్వమన్నారు కదా అమ్ము
ఆనంద్: డాడీ కూడా తన ఫింగర్ ఫ్రింట్స్ ఇచ్చారు కదా
అమ్ము: దిస్ ఈజ్ టూ మచ్ డాడ్ మేమెందుకు అలా చేస్తాము
అమర్: మీరు చేశారు అని కాదు.. దిస్ ఈజ్ ఫార్మాలిటీ అమ్ము డూ ఇట్
భాగీ: ఏవండి పిల్లలు అవసరం లేదండి.. నా మాట వినండి. పిల్లలు మీ వేలి ముద్రలు అవసరం లేదు.. మీరు పైకి వెళ్లండి..
అమ్ము: మీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. డాడీ చెప్పారు కదా..? మేము కూడా ఫింగర్ ఫ్రింట్స్ ఇస్తాము
అంటూ వేలి ముద్రలు వేస్తారు.
రాథోడ్: మనోహరి గారు.. యాదమ్మ మీరు కూడా వచ్చి మీ వేలి ముద్రలు వేయండి
మను: ఏంటి రాథోడ్ నన్ను అనుమానిస్తున్నావా..?
రాథోడ్: సారూ పిల్లలు కూడా వేలి ముద్రలు ఇచ్చారు కదా మేడం.. మీరు ఇవ్వడానికి ఏమైంది రండి
చంభా: అమ్మో ఇంకా నయం నేను ఆ చీరను ముట్టుకోలేదు. (మనసులో అనుకుని) నేను వేస్తాను
రాథోడ్: రండి మనోహరి గారు ఇది ఫార్మాలిటీ అని సార్ చెప్పారు కదా..? వచ్చి మీ వేలి ముద్రలు వేయండి
మనోహరి భయపడుతూనే వెళ్లి వేలి ముద్రలు వేస్తుంది.
చంబా: (మనసులో) అయిపోయింది ఈ రోజుతో నీ చాప్టర్ అయిపోయింది మనోహరి.
అమర్: రాథోడ్ ఇవన్నీ తీసుకెళ్లి ల్యాబ్‌లో ఇచ్చి టెస్ట్ చేయించు.. నాకు ఈరోజే రిజల్ట్ కావాలి
రాథోడ్: ఎస్ సార్.. నాకు మిస్సమ్మను చంపాలని చూసిన వాళ్లు ఎవరో తెలుసుకోవాలని ఉంది. ల్యాబ్‌కు వెళ్లి ఫోన్ చేస్తాను సార్
అని రాథోడ్ ల్యాబ్‌కు వెళ్లి అక్కడ టెస్ట్‌కు ఇస్తాడు. ల్యాబ్‌లో శారీ మీద టెస్ట్ చేస్తుంటారు. మరోవైపు ఇంట్లో మనోహరి టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంది. పక్కనే ఉన్న చంభా మాత్రం ఇవాళ మనోహరి పని కతం అయిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక ల్యాబ్‌లో టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ రాథోడ్‌కు చెప్తాడు అక్కడి డాక్టర్. ఆ డాక్టర్ మాటలకు రాథోడ్ షాక్ అవుతాడు. వెంటనే అమర్‌కు ఫోన్ చేసి చెప్తాడు. అమర్ కోపంగా మనోహరి దగ్గరకు వెళ్తాడు. మనోహరి భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















