Nindu Noorella Saavasam Serial Today October 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌తో ఎమోషనల్ అయిన భాగీ – అమర్ మాటలకు షాక్ అయిన రామ్మూర్తి
Nindu Noorella Saavasam serial Today Episode October 28th: రామ్మూర్తితో అమర్ ఫోన్ మాట్లాడిన తర్వాత భాగీ ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీకి ఫోన్ చేసిన రామ్మూర్తి పండగకు రమ్మని చెప్తాడు. దీంతో భాగీ రామ్మూర్తినే తమ ఇంటికి రమ్మని చెప్తుంది. దీంతో రామ్మూర్తి వద్దని చెప్తాడు.
రామ్మూర్తి: అయ్యో పండగ పూట అత్తారింటికి అల్లుడు వస్తే బాగుంటుంది కానీ అక్కడికి నేను ఎలా వస్తాను అమ్మా
భాగీ: ఏం కాదు నాన్న మీరే ఇక్కడికి రండి
రామ్మూర్తి: అది పద్దతి కాదులే అమ్మా.. అల్లుడు గారు ఉంటే ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను
భాగీ: నాన్న ఇదిగో ఇప్పుడే ఆయన వచ్చారు.. మా నాన్న గారు మీతో మాట్లాడతారంట
అమర్: చెప్పండి మామయ్య
రామ్మూర్తి: బాబుగారు రేపు పండగకి మీరు అమ్మాయి, పిల్లలు మన ఇంటికి భోజనానికి రావాలి బాబు
అమర్: నేనే మీకు ఫోన్ చేసి చెబుదామనుకున్నాను.. రేపు పండగక్కి మీరు అత్తయ్య గారు ఇక్కడికి వచ్చేయండి
రామ్మూర్తి: అక్కడికి మేము ఎందుకు బాబు..
అమర్: పండగకి మామయ్య అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం..
రామ్మూర్తి: అది కాదు బాబు మేము అక్కడికి రావడం ఏం బాగుంటుంది. మీరే ఇక్కడికి వస్తే..
అమర్: మేమంతా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా..? మేము ఆరు మందిమి అక్కడికి రావడం కంటే మీరు ఇద్దరూ ఇక్కడికి రావడం మంచిది మామయ్య.. ఇంకేం చెప్పకండి మామయ్య మీరు వస్తున్నారంతే.. మీకోసం బట్టలు కూడా కొనేశాను.. రేపు మీకోసం ఇష్టమైన పిండి వంటలు కూడా చేయిస్తాను.. ఈవెనింగ్ అందరం కలిసి జాలీగా టపాసులు కాలుద్దాం.. మామయ్య గారు వింటున్నారా..?
రామ్మూర్తి: వింటున్నాను బాబుగారు.. నాకు ఇద్దరూ కూతుళ్లే అని అప్పుడప్పుడు బాధపడేవాణ్ని ఇప్పుడు మీ మాటలు వింటుంటే కొడుకు లేడన్న కొరత తీరినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం బాబు.. మనసుకు తృప్తిగా ఉంది
అమర్: రేపు వస్తారు కదా..? తప్పకుండా రావాలి
రామ్మూర్తి: వస్తాను బాబు తప్పకుండా వస్తాను..
అంటూ ఫోన్ కట్ చేస్తాడు రామ్మూర్తి. భాగీ ఏడుస్తూ అమర్‌ను హగ్ చేసుకుంటుంది.
అమర్: భాగీ ఏమైంది భాగీ
భాగీ: నువ్వు మా నాన్నతో మాట్లాడుతుంటే.. ఒక మామ అల్లుడు మాట్లాడుకున్నట్టు లేదు.. ఒక తండ్రితో కొడుకు మాట్లాడుతున్నట్టు ఉంది. ఆయన పాలిట దేవుడు కూడా మీరేనండి.. అక్క కోసం నా కోసం ఆయన ఎంతగా ఆరాటపడ్డాడో ఒక మంచి మనిషి చేతిలో మమ్మల్ని పెట్టారని ఆయన సంతోష పడని రోజంటూ లేదు.. ఆయన జీవితపు ఆఖరి దశలో ఇంత ఆనందాన్ని ఇస్తున్న మీకు చాలా థాంక్స్ అండి..
అమర్: ఏంటి భాగీ ఏదేదో మాట్లాడుతున్నావు.. నాకు మా నాన్న ఎంతో మీ నాన్న కూడా అంతే నేనేం పరాయి వాణ్ని కాదు. ఆయన అల్లుడిని
అంటూ అమర్ చెప్పి వెళ్లిపోతాడు. భాగీ ఏమోషనల్‌గా చూస్తూ ఉంటుంది. తర్వాత అంజు అనుమానంగా చూస్తూ చంభా రూంలోకి వెళ్తుంది. చంభా చుట్టూ తిరుగుతూ చూస్తుంది.
చంభా: ఏంటి పాల చుట్టి చుట్టి అలా చూస్తున్నావు
అంజు: నిన్ను ఎక్కడో చూశాను. కానీ ఎక్కడ చూశాను.. ఉదయం నుంచి గుర్తు రావడం లేదు
చంభా: మాది ఈ ఊరు కాదమ్మా.. వేరే ఊరు నన్ను నువ్వు చూసే అవకాశమే లేదు..
అంజు: మనం ఎప్పుడో ఎక్కడో కలిశాం
చంభా: లేదమ్మా మనం ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు..
అంజు: నాకు సామాన్యంగా డౌటు రానే రాదు.. వచ్చిందనుకో అది తీరే వరకు అసలు ఆగను
చంభా భయంతో ఈ పిల్ల రాక్షసి నుంచి నన్ను కాపాడు దేవుడా అనుకుంటూ మనసులో అనుకుంటుండగా.. ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















