అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాను కనిపెట్టిన అమర్‌ – అదే టైంకి ఘోరతో పూజలో ఉన్న మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:     కానిస్టేబుల్‌ సమాచారంతో ఘోర పూజ చేసిన చోటికి వెళ్తాడు అమర్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరుగుతుంది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి వచ్చి మరి నేను ఎప్పుడు గెలుస్తాను ఘోర అని అడుగుతుంది. ఈ ఘోర మాటిచ్చాడు అంటే  సచ్చేదాకా కాస్తునే ఉంటాడు. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను అంటాడు ఘోర. దీంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.

మనోహరి: అయితే దీని వల్ల నేను కోల్పోయినవి అన్ని దీంతోనే వెనక్కి తెప్పించబోతున్నావన్న మాట. అమర్ తో గడిపిన జీవితం నేను పెట్టిన బిక్షే.. దానికి రుణం తీర్చుకో ఆరు.

కానిస్టేబుల్‌ వచ్చి ఘోర, మనోహరిని చూసి రాథోడ్‌కు ఫోన్‌ చేస్తాడు.

రాథోడ్‌: సార్‌ కానిస్టేబుల్‌ సార్‌..

అమర్‌: స్పీకర్‌ ఆన్‌ చేయ్‌.

కానిస్టేబుల్‌: సార్‌ ఓఆర్‌ ఆర్‌ 19 ఎగ్జిట్‌ దగ్గర మీరు చెప్పినట్టే అతనెవరో ఏవో పూజలు చేస్తున్నారు సార్‌. పక్కన ఇంకెవరో ఉన్నారు సార్‌.  

రాథోడ్‌:  అవునా అయితే మేము వస్తున్నాం.

అమర్‌: వాళ్లను నువ్వు దూరం నుంచి అబ్జర్వ ‌చేస్తూ ఉండు ఇప్పుడే మేము వస్తున్నాం. కమాన్‌ రాథోడ్‌.

 అని ఇద్దరూ కలిసి వెళ్తారు. కానిస్టేబుల్‌ వాళ్లను చూస్తూనే ఉంటాడు.

మనోహరి: సరే ముందు నువ్వు చెప్పినట్టు భాగీలోకి ఇది ప్రవేశించేలా చేసి అమర్‌కు దూరం అయ్యేలా చేయ్‌. తర్వాత నా మొగుడి సంగతి చూద్దాం.

ఘోర: అలాగే.. పని అవ్వగానే నేను దేవాను కలవడానికి వెళ్లాలి. ఈ శక్తులను నా నుంచి లాక్కోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఆలోగా చాలా శక్తులను శాశ్వతం చేసుకోవాలి.

అని ఘోర చెప్తాడు. ఇంతలో అక్కడికి అమర్‌, రాథోడ్‌ అక్కడికి వస్తారు. కానిస్టేబుల్‌ ఘోర, మనోహరిలను దూరం నుంచి చూపిస్తాడు. అమర్‌ ఘోర దగ్గరకు వెళ్తుంటే మనోహరి గమనించి ఘోరాను పారిపోమ్మని చెప్తుంది. ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారిపోతారు. అమర్‌ వచ్చి వెతుకుతుంటాడు. ఎవరూ కనిపించరు. మరుసటి రోజు భాగీ అమ్మవారి దీక్ష మొదలుపెడుతుంది. ఇల్లంతా దూపం వేస్తుంది. పూజ పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తుంది.

మనోహరి: ఈ అవతారం ఏంటి..? ఈ పూజలేంటి..? ఈ పాటలేంటి..?

భాగీ: మనోహరి గారు అవతారం అంటే కళ్లు పోతాయి. నేను అమ్మవారి దీక్ష చేస్తున్నాను.

నిర్మల: పూజ చేస్తాను అంటే నేనేదో  మామూలు పూజ అనుకున్నాను కానీ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నావు అనుకోలేదు.

శివరాం: అయినా ఇంత సడెన్‌ గా దీక్ష ఏంటమ్మా..?

భాగీ: నేను నాన్నా మనసుకు ఎప్పుడు కష్టంగా అనిపించినా అమ్మవారికి దీక్ష చేసి కోరిక కోరుకోగానే కష్టాలన్నీ అమ్మవారే తీరుస్తారని మేము నమ్ముతాము. నాన్నకే కాదు.. నాక్కూడా రెండు రోజుల నుంచి మనసంతా అలజడిగా ఉంది. అందుకే దీక్ష చేపట్టాలని అనుకున్నాం. మీకు ఇబ్బంది అవుతుందని చెప్పలేదు.

అమర్: నీ పూజ మాకు ఇబ్బంది అవ్వడం ఏంటి మిస్సమ్మ.. దీక్ష అంటే చాలా పాటించాలి కదా..? నీకే కష్టంగా అనిపిస్తుందేమోనని ఆలోచిస్తుంన్నాం.

అమ్ము: ఎందుక అంత బాధపడుతున్నావు మిస్సమ్మ. మాకు ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా?

భాగీ: కారణం తెలిస్తేనే కదా అమ్ము పంచుకోవడానికి. ఇది కారణం లేని బాధ మనసు మోయలేకపోతుంది. కనీసం ఈ దీక్ష వల్ల పోతుందని నమ్మకం.

నిర్మల: నాకు ముందే చెప్పి ఉంటే నేను సాయం చేసేదాన్ని కదమ్మా..

భాగీ: పర్వాలేదులే అత్తయ్యా… పిల్లలు మీరు వెళ్లి రెడీ అయి రండి మీకు టిఫిన్‌ రెడీ చేస్తాను.

   అని భాగీ చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. మనోహరి మాత్రం ఈ విషయం వెంటనే ఘోరాకు చెప్పాలి అనుకుంటుంది. మరోవైపు రామ్మూర్తి కూడా దీక్ష చేస్తుంటాడు. మంగళ చూసి దీక్ష చేస్తున్నావేంటి అని అడుగుతుంది. నా పెద్ద కూతురు కోసం దీక్ష చేస్తున్నాను అంటాడు. దీంతో మంగళ తిడుతుంది. నాకు చెప్పకుండా చేస్తున్నావేంటి అని నిలదీస్తుంది. నేను నా కూతురు ఇంట్లో దీక్ష చేస్తున్నాను అని వెళ్లిపోతాడు. మరోవైపు మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి భాగీ దీక్ష చేస్తుందని చెప్తుంది. దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అంటుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget