అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోర వశమైన ఆరు ఆత్మ – ఆరు ఆక్రందనలు విన్న అమర్‌

Nindu Noorella Saavasam Today Episode:    పూజలు పూర్తి చేసుకుని ఆరు ఆత్మను వశం చేసుకుంటాడు ఘోర ఇంతలో అక్కడికి వచ్చిన మనోహరి.. ఘోరాను అనుమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎంత కష్టం వచ్చినా అక్కకు అమ్మవారే తోడుగా ఉంటుందని చెప్తావు కదా నాన్నా అందుకే ఇప్పుడు అమ్మవారి దీక్ష చేద్దామని అంటుంది భాగీ. తల్లి చాలా బాగా చెప్పావు అమ్మా రేపు ఉదయాన్నే అమ్మవారి దీక్ష మొదలు పెట్టి ఎల్లుండి కావడి ఎత్తుదాము అంటాడు రామ్మూర్తి సరే నాన్నా అంటూ రామ్మూర్తిని లోపలికి తీసుకెళ్తుంది భాగీ. అంతా గమనించిన గుప్త ఆశ్యర్యపోతాడు. జగన్నాథ నీ లీల భలే ఉంది అయ్యా.. అంటూ పైకి చూస్తూ దేవుణ్ని మొక్కుతుంటాడు. కారులో వెళ్తూ ఘోరను గుర్తు చేసుకుంటాడు అమర్‌.

అమర్‌: అసలు వాడికి ఏం కావాలి. అసలు మన ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాలని ఇన్ని రోజులు మన ఇంటి చుట్టు తిరిగాడు. అంజు బర్తుడే రోజు ఎందుకు ఇంటికి వచ్చాడు. ఎవరిని కలిశాడు..? ఏం తీసుకెళ్లాడు..? మన ఇంట్లో వాణ్ని కలిసే అవసరం ఎవరికి ఉంది.

రాథోడ్: వాడు ఏం తీసుకెళ్లాడో తెలియదు కానీ ఇంట్లో అందరూ భయపడుతున్నారు సార్‌.

అమర్‌: అవును రాథోడ్‌ మనసంతా ఏదో అలజడి. ఎందుకో చాలా భయంగా ఉంది. ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆరుకు దూరంగా ఉన్నప్పుడు అలా అనిపించేది. మళ్లీ ఇప్పుడు అలజడిగా ఉంది.

 అంటూ అమర్‌ ఎమోషన్‌ అవుతుంటే ఇంతలో కారుకు ఒక సాయబు అడ్డు వస్తాడు. రాథోడ్‌ కారు ఆపి వెళ్లి తిడుతుంటే.. ఆ ముసలాయన నవ్వుతాడు. ఆ అలజడికి కారణం ఉంది అంటాడు. అమర్‌ కారు దిగి వస్తాడు.

అమర్: ఏమన్నారు..? కారణం ఉందా?

సాయబు: అదే కదా నీ ప్రశ్న

అమర్‌: నేను నిన్ను ఏ ప్రశ్న అడగలేదే..?

సాయబు: అడగాలి సామి.. మీకు తెలియనప్పుడు అడగాలి. అప్పుడే సమాధానం దొరుకుంతుంది.

అమర్‌: మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు..

సాయబు: నీకు ముఖ్యమైనది వాడు స్వార్థానికి  తీసుకెళ్లాడు.

అమర్‌: ఏ తీసుకెళ్లాడు.. ఇదంతా మీకెలా తెలుసు..? అసలు మీరెవరు..?

సాయబు: ఇప్పుడు నేను ఎవరన్నది ముఖ్యం కాదు. నీకు ముఖ్యమైనది ఏమిటి..? వాడి నుంచి నువ్వు కాపాడాల్సింది ఏమిటి? ఇది నీది నువ్వు చేయాల్సిన యుద్దం.

అమర్: మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.

సాయబు: నువ్వు వెతుకుతున్నది ఊరి బయట ఉంది. నీ చేతుల్లో ఓడిపోవడానికి సిద్దంగా ఉంది. వెళ్లు..

 అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ఏంటి ఆయన ఏం చెప్పారో అర్థం కావడం లేదు అంటాడు రాథోడ్‌. అతను చెప్పినదాంట్లో అర్థం లేకపోయినా.. ఏదో అర్థం ఉంది. ఎస్సైతో మాట్లాడి ఘోర గురించి వెతకమను అని చెప్తాడు అమర్‌. మరోవైపు భాగీ.. ఆరు కోసం వెతుకుతుంది. ఎక్కడా ఆరు జాడ తెలియకపోవడంతో బాధపడుతుంది. ఇంతలో నిర్మల వస్తుంది.

నిర్మల: నిన్న ఘోర రావడం. అప్పటి నుంచి ఇంట్లో అందరి మనసు కీడు శంకిస్తు ఉండటం ఇవన్నీ చూస్తుంటే మనసు ఎందుకో భారంగా ఉంది అమ్మా..

భాగీ: అవును అత్తయ్య ఆలోచికస్తుంటే కరెక్టుగా ఘోర ఇంటికి వచ్చి వెళ్లినప్పటి నుంచే అక్క కూడా కనిపించకుండా పోయింది. అసలు మనకు తెలియకుండా నిన్న ఇంట్లో ఏదో జరిగింది అత్తయ్య. ఏది ఎందుకు జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్తం కావడం లేదు. ఎటు చూసినా ప్రశ్నలే కానీ సమాధానాలు దొరకడం లేదు.

దూరం నుంచి అంతా వింటున్న మనోహరి.. భాగీని ఎలాగైనా డైవర్ట్‌ చేయాలని అనుకుని దగ్గరకు వెళ్తుంది.

మనోహరి: ఏమైంది ఆంటీ దేని గురించో సీరియస్‌గా మాట్లాడుతున్నారు.

భాగీ: పక్కింటి అక్క గురించి నిన్నటి నుంచి కనిపించడం లేదు.

మనోహరి: అదేంటి మీకు చెప్పలేదా? ఆవిడ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది కదా?

భాగీ: వెళ్లడం అంటే ఎక్కడికి వెళ్లింది. ఎలా వెళ్లింది. ఎందుకు వెళ్లింది.

మనోహరి: ఇప్పటికే చాలా ఆలస్యం అయింది భాగీ.. కానీ వెళ్లడం రాసి పెట్టి ఉన్నప్పుడు వెళ్లక తప్పదు కదా? అక్క ఇక తిరిగి రాదు. రాలేదు. నువ్వు మర్చిపోవడం బెటర్‌ భాగీ. సరే నాకు చిన్న పని ఉంది వెళ్లోస్తాను.

గుప్త: ఇదే ముగింపు అనుకుని గెలిచావు అనుకుని అప్పుడే మురిసిపోతే ఎలా బాలిక

నిర్మల: మనం కష్టాలు బాధల్లో ఉంటే ఈ అమ్మాయి ఒకతి.. దేనికి ఎలా స్పందించాలో తెలియదు.

భాగీ: మేమంతా ఇంత కంగారు పడుతుంటే మనోహరి మాత్రం నిన్నటి నుంచి ఆనందంగా ఉంది. ఘోర ఇంట్లోకి రాగలిగాడు అంటే అది కచ్చితంగా మనోహరి సాయంతోనే

 అంటూ ఆలోచిస్తుంది భాగీ. భాగీ పోరాటంలో గెలవాలని గుప్త దీవిస్తాడు. మరోవైపు ఘోర పూజల చేస్తుంటాడు. అమర్‌ ఘోర కోసం వెతుకుతుంటాడు. ఘోర దగ్గర సీసాలో బంధీగా ఉన్న ఆరు ఏడుస్తుంది. దేవుడా ప్లీజ్‌ నన్ను కాపాడు అంటూ వేడుకుంటుంది. అక్కడే దగ్గరలో ఉన్న అమర్‌ హార్ట్‌ వేగంగా కొట్టుకుంటుంది. అమర్‌ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆరును గుర్తు చేసుకుంటాడు.

రాథోడ్‌: ఏమైంది సార్‌..

అమర్‌: ఎందుకో ఆరు మాటలు వినిపించినట్టు అనిపించింది రాథోడ్‌. మనసంతా ఎందుకో భయంగా ఉంది. ఎవరి మీదనో తెలియదు కానీ చాలా కోపంగా ఉంది. మనిషిని ఇక్కడ ఉన్నా కానీ మనసు ఎక్కడొక్కడో తిరుగుతుంది.

  అంటూ అమర్‌ ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు ఘోర గట్టిగా నవ్వుతూ ఆత్మా ఇప్పటి నుంచి నువ్వు నా బంధీవి నా బానిసవి.. నా మాటే నీకు శాసనం. ఈ ఘోర లోకాధిపతి అయ్యాడు అంటూ నవ్వుతుంటాడు. ఇంతలో అక్కడికి మనోహరి వచ్చి మరి నేను ఎప్పుడు గెలుస్తాను ఘోర అని అడుగుతుంది. ఈ ఘోర మాటిచ్చాడు అంటే  సచ్చేదాకా కాస్తునే ఉంటాడు. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను అంటాడు ఘోర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Viral News: ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 234 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 234 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Topudurthi Mahesh Reddy Murder: తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్
తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్
Janhvi Kapoor : పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
Embed widget