అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోర ఇంటికి వచ్చినట్టు తెలుసుకున్న అమర్‌ – ప్రిన్సిపాల్‌ కు బుద్ది  చెప్పనున్న అంజు

Nindu Noorella Saavasam Today Episode:  ఘోర ఇంటికి వచ్చి  వెళ్లడం సీసీటీవీ పుటేజీలో  చూస్తాడు అమర్‌ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తాతయ్యా మీరు జాబ్‌ చేస్తేనే హ్యాపీగా ఉంటానంటే ఓకే అంటారు పిల్లలు. దీంతో అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. ప్రిన్సిపాల్‌ వచ్చి రామ్మూర్తిని పిలిచి క్యారేజ్‌ లు కడిగి తీసుకురా అని చెప్తుంది. రామ్మూర్తి వెళ్లి వాటిని కడుతుంటాడు. పిల్లలు చూసి బాధపడతారు. తినకుండా రామ్మూర్తి కోసం ఎదరుచూసి.. వెళ్లి చూస్తారు. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు అని ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామని వెళ్తుంటే ఈ పనులు  నేను చేస్తానని చెప్పాను అంటాడు రామ్మూర్తి అయితే ఈ పని మేము చేస్తాము మీరు జరగండి తాతయ్యా అని పిల్లలు ఆ పని చేస్తారు. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. అక్కడికి గుప్త వస్తాడు. సీసాలో బంధిగా ఉన్న ఆరును చూసి బాధపడతాడు.

గుప్త: బాలికా ఆ ఇంట మహరాణిలా ఉన్న నిన్ను ఇక్కడ బంధీగా చూడలేకపోతున్నాను. ఘోర

ఘోర: ఎవరు..? ఎవరు మీరు.. ఓ గుప్తుల వారా? ఎలా ఉన్నారు..

గుప్త: మాతో పరిహాసం ఆడుటా.. నీకు శ్రేయస్కరం కాదు.  

ఘోర: అయ్యో నేను మీ పని తగ్గించాను కదా గుప్త గారు. మీరిప్పుడు ఎంచక్కా యమపురికి వెళ్లిపోవచ్చు. ఇక వెంటనే వెళ్లిపోండి.

గుప్త: భూలోకము నుంచి నేను మా లోకమునకు వెళ్లుట జరుగునది ఆ బాలికతోనే..

ఘోర: అయితే మీరిక మాతో పాటు ఈ భూలోకమునే ఉంటారన్నమాట.

గుప్త: ఘోర తప్పిదముల మీద తప్పిదములు చేయుచున్నావు ఘోర. ఇక చాలింపుము ఇకనైనను నీవు పొందిన శక్తులను సరియైన మార్గమున వినియోగించుము. నీవు చేసిన పాపములు కొన్ని అయినా హరించును.

ఘోర: అయ్యా గుప్త గారు ఈ పూజలు చేస్తున్నదే చావకుండా చిరంజీవిగా ఉండుట కొరకే మరి నేను ఎందుకు నరకానికి వస్తాను.

గుప్త: సృష్టి ధర్మమునకు ఎదురెళ్లుతున్నావు ఘోర. తపస్సుతోనే రానిది నీ లాంట తప్పిదాలు చేసేవాళ్లకు ఎలా వస్తుందనుకున్నావు.

అనగానే కొత్త చరిత్రను నేను మొదలు పెట్టబోతున్నాను ఇక మీరు వెళ్లిపోవచ్చు అంటాడు. గుప్త వెళ్లిపోతాడు. మరోవైపు రాథోడ్‌ లాప్‌ టాప్‌ తీసుకుని కంగారుగా ఇంటికి వచ్చి అమర్‌ ను పిలుస్తుంటాడు.

అమర్: రాథోడ్‌ ఏమైంది..

రాథోడ్‌: సార్‌ ఇది చూడండి..

మనోహరి: వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు. నేను భాగీతో మాట్లాడింది ఏమైనా చూశాడా? ( అని మనసులో అనుకుంటుంది.)

లాప్‌టాప్ లో సీసీటీవీ ఫుటేజీ చూపిస్తాడు. అందులో ఘోర ఇంటికి రావడం ఉంటుంది. మనోహరి రూంలోకి వెళ్లింది కూడా వీడియోలో ఉంటుంది.

మనోహరి: అదేంటి అమర్‌ అతను నా కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి ఏం చేస్తున్నాడు.

భాగీ: అప్పుడు మీరు రూంలో లేరా మనోహరి గారు. చూస్తుంటే మిమ్మల్ని కలవడానికే వచ్చినట్టు ఉంది.

మనోహరి: ఏయ్‌ నాకు వాడితో ఏం పని ఉంటుంది. నేను అప్పుడు రూంలోనే లేను. లేదంటే వాణ్ని చూసిన వెంటనే అమర్‌కు చెప్పి వాడి అంతు చూసేవాళ్లం కదా?

అమర్‌: అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు.

రాథోడ్‌: సార్‌ బ్యాక్‌ సైడ్‌కు వెళ్లినట్టు ఉన్నాడు సార్‌ అక్కడ వెనక ఉన్న కెమెరా పని చేయలేదు.

అమర్‌: వాడు చాలా సేపటి వరకు తిరిగి రాలేదంటే వాడు అంత సేపు మన ఇంట్లోనే ఉన్నాడు.

నిర్మల: వాణ్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా. ఇలాంటి వాళ్ల కళ్లు మన ఇంటి మీద పడకూడదు.

 అని చెప్పగానే భాగీ అమ్ము చెప్పింది… మనోహరి రూం లాక్‌ చేసుకున్నది గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అమర్‌ ఆ బ్యాక్‌ డోర్‌ నీ రూంకి దగ్గరే ఉంటుంది కదా? నీకు అలికిడి వినిపించలేదా? అని అమర్‌ అడగ్గానే లేదని భయపడుతూ చెప్తుంది మనోహరి. వాడు నిన్ను కలవడానికే వచ్చాడని నాకు అనుమానంగా ఉంది మనోహరి అని మనసులో  అనుకుంటుంది భాగీ. ఇంతలో ఘోర సీసాలో ఆరు ఆత్మను తీసుకెళ్లడం సీసీటీవీ పుటేజీలో కనిపిస్తుంది. వాణ్ని పట్టుకుని తంతే అసలు నిజం తెలుస్తుందని అమర్‌ అంటాడు. మరోవైపు ప్రిన్సిపాల్ రామ్మూర్తిని పిలిచి కారు తుడవలేదని తిడుతుంది. పిల్లలు దూరం నుంచి గమనిస్తారు. రామ్మూర్తి చేత కారు క్లీన్‌ చేయిస్తుంది. అంజు ఫోన్‌ తీసుకొచ్చి వీడియో తీస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget