అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంగళ అస్థికలు మార్చడం చూసిన ఆరు గుప్త – ఆరును తక్షణమే యమలోకానికి రమ్మన్న గుప్త  

Nindu Noorella Saavasam serial Today Episode October 12th:  ఆరు రూంలోకి వెళ్లి అస్థికలు మారుస్తున్న మంగళను ఆరు చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు అస్థికలు కోసం మంగళను రంగంలోకి దించుతుంది చంభా. డబ్బు ఆశ చూపించగానే అస్థికలు తీసుకురావడానికి ఒప్పుకుంటుంది మంగళ. దీంతో ఒక కుండలో భస్మం ఫోటో సేమ్‌ ఆరు అస్థికలు ఉన్న కుండలాగే రెడీ చేసి మంగళకు ఇస్తారు. ఆ కుండ తీసుకుని ఎవరూ లేని టైంలో మంగళ, అమర్‌ ఇంట్లోకి వెళ్తుంది. మంగళ రావడం చూసి షాక్ అవుతుంది ఆరు.

ఆరు: ఈవిడ ఇప్పుడెందుకు వచ్చింది. అయినా బ్యాగ్‌ తీసుకుని వచ్చింది ఎందుకై ఉంటుంది గుప్తగారు

గుప్త: ఏమో బాలిక చూస్తేనే తెలుస్తుంది కదా..?

ఆరు: అయితే పదండి చూద్దాం

ఆరు గుప్త కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తుంటారు. ఇంట్లోకి వెళ్లిన మంగళ నేరుగా ఆరు రూంలోకి వెళ్లిపోతుంది.

ఆరు: అదేంటి గుప్త గారు ఆమె నా రూంలోకి వెళ్తున్నారు.. ఎందుకు ఏం చేయబోతున్నారు..?

గుప్త: ఏం చేస్తుందో ఇప్పుడు చూస్తేనే ఉన్నాం కదా బాలిక.. ఎందుకు కంగారు పడతావు.. చూడుము.

అని గుప్త చెప్పగానే.. ఆరు మౌనంగా చూస్తుంది. రూంలోకి వెళ్లి తనతో సంచిలో తీసుకుని కుండను ఫోటో ముందు పెట్టి అక్కడి అస్థికలు తీసుకుని సంచీలో వేసుకుంటుంది మంగళ.

ఆరు: అదేంటి గుప్త గారు ఆవిడ నా ఆస్థికలు మారుస్తున్నారేంటి..? ఆస్థికలతో ఏం చేయబోతుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు గుప్త గారు (గుప్త మౌనంగా ఉంటాడు) గుప్త గారు చెప్పండి గుప్తగారు.. ఏం చేయబోతున్నారు ఆవిడ..

గుప్త: ఆ బాలిక నీ ఆస్థికలు తీసుకెల్లి ఆ దుష్ట మాత్రికురాలకు ఇవ్వబోతుంది బాలిక. ఈ పాటికే దుష్ట ఘోర, ఆ మాంత్రికురాలు కలిసి పోయారు.. ఎలాగైనా నిన్ను బంధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆరు: ఏంటి గుప్త గారు ఇంతలా భయపెడుతున్నారు. ఘోర, చంభా కలవడం ఏంటి..?

గుప్త: అవును బాలిక దుష్టులంతా ఒకేచోటికి చేరిపోయారు.. ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అని చెప్తుండగానే మంగళ అస్థికలు తీసుకుని బయటకు వెళ్లిపోతుంది. ఆరు గుప్త లాన్‌లోకి వెళ్తారు.

గుప్త: ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చేసిన అనాలోచిత పని ఎంతటి అనర్థమును తెచ్చిపెట్టిందో చూసినవా బాలిక

ఆరు: అవును గుప్త గారు నేను తొందరపడి ఆయనలో ప్రవేశించకుండా ఉండి ఉంటే..ఈ పాటికే మనోహరి గురించి ఆయనకు మొత్తం తెలిసిపోయేది. తప్పు చేశాను గుప్త గారు..

గుప్త: ఇంకనూ ఆలస్యం చేసినచో మరిన్ని అనర్థాలు జరుగును బాలిక. అది నీకునూ నీ కుటుంబమునకు మంచిది కాదు

ఆరు: ఏమంటున్నారు గుప్త గారు నాకేం అర్థం కావడం లేదు.

గుప్త: నువ్వు తక్షణమే మా లోకమునకు రావలెను.. లేదంటే ఆ చంభా, ఘోరా కలిసి నిన్ను బంధించి క్షుద్ర పూజలు చేయాలని చూస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానో అవగతం చేసుకో బాలిక. లేదంటే నువ్వు ఆ దుష్ట శక్తుల పన్నాగమునకు బలి అయినచో మరు జన్మ పొందక.. పిశాచివై ఈ లోకంలో సంచరిస్తావు

ఆరు: భయపెడతారేంటి గుప్త గారు. మీరు చెప్తుంటేనే నాకు వణుకు పుడుతుంది.

గుప్త: భయపెట్టడం కాదు బాలిక. వాస్తవం చెప్తున్నాను. నువ్వు త్వరపడవలెను.. నీ శ్రాద్ద కర్మలు జరిపించుకొనవలెను. అప్పుడే నీ మరుజన్మకు మార్గం సుగమం అవును. అప్పుడే నీ పతి దేవుడు నీ పిల్లపిచ్చుకలు సుఖముగా ఉండెదరు.

ఆరు: కానీ నా చేతుల్లో ఏమి ఉంది గుప్త గారు. ఇవ్వనీ చేయాల్సింది వాళ్లు కదా..? అని అడుగుతుంది.

గుప్త: వారితో చేయించాల్సింది నువ్వే అందులకు నీ సహోదరి సహాయం తీసుకొనుము..

ఆరు: భాగీనా..? భాగీతో ఎలా చెప్పాలి.. ఈ విషయాలు.. అయినా భాగీ ఒప్పుకుంటుందా గుప్త గారు

గుప్త: అవును ఏ సహోదరికి నువ్వు పుత్రికగా జన్మించెదవో.. ఆ సహోదరే నీ ఉత్తర క్రియలకు మార్గం వేయును

అంటూ గుప్త చెప్పగానే అయితే భాగీతో నేను ఎలా చెప్పాలి గుప్త గారు అంటూ అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget