Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఆస్థికలు మార్చిన మంగళ – అయోమయంలో పడిపోయిన ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode October 11th: చంబా డబ్బులు ఇస్తానని చెప్పడంతో మంగళ ఆస్తికలు మారుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: స్పృహలోంచి బయటకు వచ్చిన అమర్‌ను చూసిన అందరూ ఏమైందని అడుగుతారు. ఎందుకులా దీర్ఘంగా నిద్రపోయారు అంటూ అడుగుతారు.
రాథోడ్: అసలు అక్కడ ఏం జరిగింది సార్
అమర్: రణవీర్ వైఫ్ ఎవరో కనుక్కుందామని నేను నటిస్తూ అక్కడికి వెళ్లాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదు
మను: (మనసులో) థాంక్యూ గాడ్ నేను సేఫ్. చంభా చెప్పినట్టు అమర్‌కు ఏమీ గుర్తు లేదు.
భాగీ: రణవీర్ వైఫ్ ఎవరో మీరు తెలుసుకోలేకపోయారా అండి
అమర్: నేను కిడ్నాప్ అయ్యానని తెలిసి రణవీర్‌కు కాల్ చేసింది. నన్నేమీ చేయోద్దని చెప్పింది.
రాథోడ్: మీ పైన రణవీర్ వైఫ్‌కు అత శ్రద్ద ఏంటి సార్
అమర్: అదే నాకు అర్తం కావడం లేదు. తను ఎవరో కానీ మనకు దగ్గరలోనే ఉన్నట్టు ఉంది.
భాగీ: చాలా దగ్గరలోనే ఉందండి.. మీ గురించి ఆమెకు అంతా తెలసినట్టు ఉంది. లేకపోతే మీపైన అంత కేరింగ్ ఎందుకు తీసుకుంటుంది.
రాథోడ్: మీరు స్పృహ తప్పినట్టు నటించారు కదా సార్ మీకు ఏమీ గుర్తు లేకపోవడం ఏంటి..?
అమర్: అదే నాకు అర్థం కావడం లేదు.. నేను స్పృహలో లేననుకుని రణవీర్ నాపై అటాక్ చేయబోయాడు. అంతలోనే నా ఒంట్లోకి ఏదో ప్రవేశించినట్టు అనిపించింది.. ఆ తర్వాత ఏం ఆటోచించినా గుర్తు రావడం లేదు.. కళ్లు తెరచి చూస్తే ఇక్కడ ఉన్నాను.
రాథోడ్: ( మనసులో) అంటే ఆరుంధతి మేడం ఆత్మ సార్ లోకి ప్రవేశించి ఆ రణవీర్ ఆట కట్టించింది అన్నమాట
అమర్: ఏదో పెద్ద ఫైట్ చేసినట్టు ఒళ్లంతా నొప్పులు గా ఉంది
మను: ( మనసులో) ఫైట్ జరిగింది అమర్ కాకపోతే ఫైట్ చేసింది నువ్వు కాదు.. నీ భార్య ఆరు.. అదే నన్ను సేఫ్ చేసింది.
అనుకుంటుంది. అమర్‌ను రెస్ట్ తీసుకోమని అందరూ వెళ్లిపోతారు. ఇక ఘోరా కోసం చంభా వెయిట్ చేస్తుంది. ఇంతలో ఘోరా వస్తాడు.
ఘెరా: నువ్వేనా నన్ను కలవాలని పిలిపించింది
చంభా: అవును నా పేరు
ఘెరా: ఆగు నీ పేరు చంభా.. కలకత్తా మాత్రికురాలివి
చంభా: అవును నన్ను రణవీర్ పిలిపించాడు..
ఘోరా: ఎందుకు పిలిపించాడు
చంభా: ఆ అరుందతి ఆత్మను పట్టుకోవడానికి
ఘెరా: అది అసాధ్యం ఆ ఆత్మకు దివ్య శక్తులు ఉన్నాయి.
చంభా: తెలుసు నాలాగే నువ్వు కూడా ఆ ఆత్మను బంధించడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యావని కూడా తెలుసు
ఘెరా: అన్ని తెలిసి నన్నెందుకు పిలిపించావు
చంభా: ఆ ఆత్మను పట్టుకోలేనన్న అవమానంతో నువ్వు కుంగిపోయావని తెలుసు. నేను కూడా అదే ఓటమి భారంతో ఉన్నాను.. ఇప్పుడు ఆ ఆత్మను గెలవడానికి మనకొక అవకాశం వచ్చింది
ఘెరా: అదెలా దాని శక్తులన్నీ అంతరించిపోయాయా..?
చంభా: లేదు రేపు అది అంతర్ధానం కాబోతుంది. దాని అస్థికలు గంగలో కలపబోతున్నారు. ఆ ఆత్మ ఈ జన్మ విడిచి మరు జన్మ ఎత్తబోతుంది
ఘెరా: మరి ఎలా ఆ ఆత్మను గెలుస్తాం.. అది అంతర్దానం అయితే దాన్ని పట్టుకోవడం అసాధ్యం కదా
చంభా: దాని అస్థికలు గంగలో కలపకపోతే అది మన చేతికి దొరుకుతుంది.
ఘెరా: ఆ ఆస్తికలు మనకెలా దొరుకుతాయి.
చంభా: దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపు.. మన ఉమ్మడి శత్రువైన అరుంధతి ఆత్మను ఓడిద్దాం.. ఆ ఆత్మకు మరు జన్మ లేకుండా చేద్దాం
అనగానే ఘోరా సరే అంటాడు. తర్వాత చంభా మంగళను పిలిపిస్తుంది. మంగళకు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అమర్ ఇంట్లోకి వెళ్లి ఆరు అస్థికలు తీసుకురావాలని చెప్తారు. మరో కుండలో భస్మం ఇచ్చి అది అక్కడ పెట్టి ఆస్తికలు తీసుకురావాలి అని చెప్తారు. చంభా చెప్పినట్టే మంగళ అమర్ ఇంట్లోకి వెళ్లి ఆస్తికలు మార్చేసి తీసుకుని వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















