అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి వచ్చిన కరుణ – రాథోడ్‌ ను కొట్టిన ఆరు

Nindu Noorella Saavasam Today Episode :  భాగీ, అమర్‌ ను హగ్‌ చేసుకోవడంతో కోపంగా ఆరు రాథోడ్ ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌  ఇంటికి స్కూటీ మీద వచ్చిన కరుణ రాథోడ్‌ కు డాష్‌ ఇస్తుంది. ఎందుకొచ్చావని రాథోడ్ అడుగుతాడు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. అదేంటి భాగీకి తెలియకుండా కలవాలనుకుంటే ఇప్పుడు డైరెక్టుగా లోపలికే వెళ్లింది. నిజం చెప్తుందేమో అన రాథోడ్‌ కంగారు పడతాడు. గార్డెన్‌ లో అంతా గమనిస్తున్న ఆరు.. ఆయన ఎందుకు భాగీ ఫ్రెండును సీక్రెట్‌ గా కలవాలనుకున్నారు అని అడుగుతుంది. దీంతో గుప్త నాకు తెలియదు అంటాడు. అక్కడికి వెళ్లి చూద్దాం పదండి అంటే నేను రానని గుప్త చెప్పగానే ఆరు ఒక్కతే వెళ్లి కిటికీలోంచి చూస్తుంది. లోపలికి వెళ్లిన కరుణ, భాగీని చూసి పాట పాడుతుంది. భాగీ కూడా పాడుతుంది.

కరుణ: ఎట్లున్నవే..

భాగీ: నువ్వెలాగున్నావే..

కరుణ: నేను మస్తుగున్న..

భాగీ: నేను ఇంకా బాగున్నా.. ఏయ్‌ నువ్వేంటి ఇక్కడ..?

అమర్‌: తను వచ్చిందేంటి? రాథోడ్‌ కు చెప్పిన అర్థం కాదు.

కరుణ: హాయ్‌ సార్‌..

అమర్‌: రాథోడ్‌ కరుణ ఇక్కడేం చేస్తుంది.

రాథోడ్‌: ఆపడానికి చాలా ట్రై చేశాను ఆగకుండా తుర్రున వచ్చేసింది సార్‌.

అని ఇద్దరూ కళ్లతో మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి శివరాం వస్తాడు.

కరుణ: మీరిద్దరేంటి అట్ల చూసుకుంటున్నారు.

శివరాం: ఏమ్మా బాగున్నావా?

కరుణ: ఆ మంచిగున్న అంకుల్‌ మీరెట్టున్నారు.

శివరాం: నేను బాగున్నాను అమ్మా..

భాగీ: వాళ్ల సంగతి పక్కన పెట్టు కానీ నువ్వేంటి సడెన్‌ గా వచ్చి షాక్‌ ఇచ్చావు.

కరుణ: సడెన్‌ గా రావడం ఏందే. అమరేంద్ర గారు ఫోన్‌ చేసి రమ్మంటే మరీ వచ్చిన. మీ ఆయన నీకు చెప్పలేదా?  

భాగీ: ఏవండి మీరే రమ్మని చెప్పారా? ఎప్పుడండి..? ఎక్కడండి..? ఏంటండి ఏమీ మాట్లాడరు.

రాథోడ్‌: ఆఫీసుకు రమ్మన్న  అమ్మాయి సడెన్‌గా ఇంటికి వస్తే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎలా కవర్‌ చేయాలో ఆలోచించుకోవద్దా మా సారు. అసలే మా సారుకు అంజు పాపలా అబద్దం చెప్పడం రాదు.

ఆరు: దేవుడా..  అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు.

శివరాం: కవర్‌ చేయడం ఏంటి..?

నిర్మల: అబద్దం చెప్పలేకపోవడం ఏంటి?

 అనగానే రాథోడ్‌ రాత్రి సరిగ్గా పడుకోలేదమ్మా అందుకే ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు. అనగానే అవును సార్‌ నిద్ర వస్తుంది అంటాడు రాథోడ్‌. దీంతో అమర్‌ నీతో కొంచెం పర్సనల్‌ గా మాట్లాడాలి పద రాథోడ్‌ అంటూ బయటకు వెళ్తారు. కిటికీలోంచి గమనిస్తున్న ఆరు కచ్చితంగా వీళ్లు ఏదో చేస్తున్నారు. కనుక్కుంటాను అని అనుకుంటుంది. బయటకు వెళ్లిన రాథోడ్‌, అమర్‌ ఎదురెదురుగా నిలబడితే ఆరు పక్కన ఉండి చూస్తుంది.

రాథోడ్‌: సార్‌ నిజంగా ఆ అమ్మాయి ఇంటికి వస్తుందనుకోలేదు. ఆఫీసుకు వెళ్లిందంట మీరు ఇంటికి వెళ్లారు అని చెప్పగానే ఇంటికి వచ్చింది.

అమర్‌: ఆ అమ్మాయిని ఆపోచ్చు కదా?

రాథోడ్‌: ఆపడానికి చాలా ట్రై చేశాను సార్‌. కానీ ఆ తలతిక్క పిల్ల ఎవరి మాట వినదు.  అని మీకు తెలుసు కదా? సార్‌.

అమర్: మిస్సమ్మకు తెలియకుండా చేద్దామంటే ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది రాథోడ్‌.

ఆరు: మిస్సమ్మకు తెలియకుండా ఏం చేద్దామనుకుంటున్నారు. అయ్యో ఏమీ అర్థం కావడం లేదే..

రాథోడ్: సార్‌  ఆ అమ్మాయిని బయటకు పిలుస్తాను మీరు మాట్లాడతారా?

అమర్: చేసింది చాలు ఇంకేం చేయకు వెళ్లు.

ఆరు: రాథోడ్‌.. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు  ఏం జరిగింది. మిస్సమ్మ ఫ్రెండును ఎందుకు రమ్మన్నారు. అయ్యో నా వాయిస్‌ వినపడదు కదా?

అమర్‌: అంకుల్‌ ను పిలుద్దామనుకున్నానే..

 అని రామ్మూర్తికి ఫోన్‌ చేస్తాడు అమర్‌. రేపు అంజలి బర్తుడే మీరు మంగళ గారు మార్నింగ్‌ వచ్చేయండి. రేపు రోజంతా ఇక్కడే ఉండాలి. అని మాట్లాడుతుంటాడు అమర్‌. ఇంతలో భాగీని తీసుకుని లోపలి నుంచి వస్తుంది కరుణ.  అమర్‌ ను పిలిచి భాగీ మీతో మాట్లాడాలి అంట అనగానే రా అని అమర్‌ సైగ చేస్తాడు. దగ్గరకు వెళ్లిన భాగీ, రామ్మూర్తిని ఇంటికి రమ్మని చెప్పమని చెప్తుంది. దీంతో అమర్‌ ఫోన్ భాగీకి ఇచ్చి మాట్లాడు అంటాడు. భాగీ రామ్మూర్తితో మాట్లాడుతూ ఎమోషనల్‌ అవుతూ వెంటనే అమర్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఆరు షాక్‌ అవుతుంది. ఏడుస్తూ భాగీ వైపు కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న రాథోడ్‌ ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నాటకం మొదలు పెట్టిన అపర్ణ, ఇందిరాదేవి – ప్రకాష్‌ కామెడీతో రాజ్‌ కు టెన్షన్‌  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
BYD eMAX 7: వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
Dussehra 2024: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!
జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!
Viswam Twitter Review - 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన వైట్ల - మరి ట్రైన్ ఎపిసోడ్, గోపీచంద్ యాక్షన్?
'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన వైట్ల - మరి ట్రైన్ ఎపిసోడ్, గోపీచంద్ యాక్షన్?
Siddu Jonnalagadda: వెంకీ అట్లూరి కాదు... మరో దర్శకుడితో భారీ మైథాలజీ సినిమా ప్లాన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ
వెంకీ అట్లూరి కాదు... మరో దర్శకుడితో భారీ మైథాలజీ సినిమా ప్లాన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ
Embed widget