అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనును హెచ్చరించిన చంభా – బ్లాక్‌ మ్యాన్‌ గెటప్‌ తీసేసిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam serial Today Episode November 9th:  బ్లాక్‌ మ్యాన్‌ నిన్ను చంపకుండా వదిలేలా లేడని చంభా, మనును భయపెడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  రామ్మూర్తే బ్లాక్‌ మ్యాన్‌ అని భాగీకి తెలిసిపోతుంది. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు.. అని బాధపడుతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రామ్మూర్తి బ్లాక్‌ మ్యాన్‌ గెటప్‌ తీసేసి ఆరు ఫోటో చూస్తుంటాడు. ఇంకోవైపు చంభా, మనోహరికి వార్నింగ్‌ ఇస్తుంది.

చంభా: గుర్తు చేసుకో మనోహరి నీ వల్ల బాగా ఎఫెక్ట్‌ అయింది ఎవరో గుర్తు చేసుకో

అమర్‌: మనోహరి కోసం మన ఇంటికి ఎవరైనా వచ్చారా.?

భాగీ: తను అనాథ కదండి ఎవ్వరూ రాలేదు

చంభా: అమరేంద్ర కోసం నువ్వు ఈ ఇంటికి వస్తే నీ కోసం ఆ బ్లాక్ మ్యాన్‌ వస్తున్నాడు .. ఎక్కడ నీ జీవితం ఉందనుకుంటున్నావో అక్కడే నీ మృత్యువు కూడా ఉంది మనోహరి

మను: వాడు ఎవడో తెలిస్తే వాడికే నేను మృత్యుదేవతను అవుతాను వాడిని ఎలాగైనా కనిపెట్టాలి

రామ్మూర్తి: నువ్వు నన్ను కనిపెట్టలేవు మనోహరి. నీ పాలిట యముడిని నేనే..

చంభా: ఆ యముడిని కనిపెట్టడం నీ వల్ల అవుతుంది అనుకుంటున్నావా..?

మను: నా వల్ల కాకపోయినా అమర్‌ వల్ల అవుతుంది. ఆ బ్లాక్‌ మ్యాన్‌ను నేను వదిలిపెట్టినా.. అమర్‌ వదిలిపెట్టడు

రామ్మూర్తి: నా కూతురి చావుకు కారణమైన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఆరోజు నా కూతురును ఎలా వెన్నుపోటు పొడిచావో అదే విధంగా నేను అజ్ఞాతంలో ఉండి నిన్ను చంపేస్తాను. నా కూతురుకు ఆత్మ శాంతి చేకూరుస్తాను.

చంభా:  నీ గురించి అమరేంద్రకు తెలిసిపోతే తనే నిన్ను చంపేస్తాడేమో..?

మను: అలా జరగదు అనవసరంగా నన్ను భయపెట్టకు.. అమరేంద్రకు నిజం తెలిసేలోపే భాగీ చస్తుంది. ఆ బ్లాక్‌ మ్యాన్‌ చస్తాడు

రామ్మూర్తి: నిన్ను చంపకుండా నేను చావను మనోహరి.. అమ్మా అరుంధతి బతికి ఉండగా నీకు ఈ నాన్న ఏమీ చేయలేకపోయాడమ్మా..? నిన్ను చంపిన ఆ మనోహరిని నేను చంపి నీ ఆత్మకు శాంతి నేను చేకూరుస్తానమ్మా..? ఇదే ఈ తండ్రి నీకు ఇచ్చే నివాళి

అనుకుంటూ రామ్మూర్తి ఎమోషనల్‌ అవుతుంటాడు. కట్‌ చేస్తే యమలోకంలో యముడు గుప్తతో మాట్లాడుతుంటే.. నారదుడు వెళ్తాడు. నారదుడిని చూసిన యముడు భయంతో వణికిపోతాడు.

యముడు: గుప్త ఈ నారదుడికి వేరే కార్యమే లేదా..? మన లోకము చుట్టూ విహరిస్తున్నారు..?

గుప్త: ప్రభు ఆయనకు సందేహం వచ్చినచో ఒక పట్టాన వదలరని తమకు కూడా విదితమే కదా ప్రభూ

యముడు: అతని సందేహం వలన మా సింహాసనానికి ప్రమాదం వాటిల్లునేమోనని మా దేహము వణుకుతున్నది

గుప్త: ఆ చింతించకండి ప్రభు అటువంటి ప్రమాదం ఏమీయూ లేదు..?

యముడు: ఇంతకీ ఆ బాలిక దేవకన్య వేషధారణలోనే ఉన్నది కదా…

గుప్త: అవును ప్రభు అదే వేషంలో ఉన్నది..

నారదుడు: ఏమిటి యమధర్మరాజా..? ఏదో వేషధారణ అంటున్నారు

యముడు: ఈ రోజు తమరి వేషధారణ బహు బాగుగా ఉన్నది నారదమునీశ్వరా

నారదుడు: ఈరోజు ఏమిటి ప్రతి రోజూ ఇలాగే ఉంటాను కదా..?

గుప్త: అవును మునీంద్ర తమరు నిత్య యవ్వనులు కదా..?

నారదుడు: మీరు ఇరువురు మమ్మల్ని పని గట్టుకుని పొగుడుతున్నారేంటి..?

అంటూ నారదుడు అనుమానంగా యముడిని, గుప్తను చూస్తుంటాడు.. దీంతో ఇద్దరూ భయంతో వణుకుతుంటారు. ఇప్పుడు కానీ ఆ బాలిక వచ్చినచో మా ప్రభువుల వారి పరిస్థితి ఏంటో అని గుప్త  మనసులో అనుకుంటుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget