Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి షాక్ ఇచ్చిన పిల్లలు – అయోమయంలో అమ్ము
Nindu Noorella Saavasam serial Today Episode November 5th: పిల్లల చేతే భాగీకి అబార్షన్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది మను. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కలలో తనకు ఏదో జరిగినట్టు చిన్న బిడ్డ బాధపడుతున్నట్టు కల రాగానే భాగీ భయపడుతుంది. కిచెన్‌లో నుంచుని ఆలోచిస్తుంది. స్టవ్ మీద పాలు పొంగిపోతుంటే అప్పుడే అమర్ వచ్చి స్టవ్ కట్టేస్తాడు. బయటి నుంచి అంతా చూస్తున్న మనోహరి రూంలోకి వెళ్తుంది.
భాగీ: ఏవండి రెడీ అయ్యారా..? కాఫీ పెట్టమంటారా?
అమర్: ఇప్పుడు ఏమీ వద్దులే కానీ రా వెళ్దాం
భాగీని తీసుకుని రూంలోకి వెళ్తాడు.
అమర్: ( మనసులో) భాగీ ఎందుకో డిస్టర్బ్ అయింది. ఏదో ఒకటి చేసి భాగీ మూడ్‌ను మార్చాలి.. భాగీ నేను ఇప్పుడే వస్తాను
అని చెప్పి అమర్ రూంలోంచి బయటకు వెళ్తాడు. మరోవైపు తన రూంలోకి వెళ్లిన మనోహరి, రణవీర్‌కు కాల్ చేస్తాడు.
రణవీర్: చెప్పు మనోహరి ఇంత పొద్దున్నే కాల్ చేశావు
మను: చంబా పూజ మొదలు పెట్టిందా..?
రణవీర్: అవును ఇప్పుడే మొదలు పెట్టింది.. చంభా చాలా నిస్టగా పట్టుదలగా పూజ చేస్తుంది. అయినా ఈ విషయం నీకు ఎలా తెలుసు..?
మను: అక్కడ పూజ తాలుకా ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. భాగీ నిద్ర లేవగానే బాగా డిస్టర్బ్ అయింది.
రణవీర్: అయితే ఈ సారి నువ్వు అనుకున్నది జరగబోతుంది అన్నమాట..
మను: కచ్చితంగా జరగాలి రణవీర్.. అందుకే చంభాను అక్కడికి పంపాను..
రణవీర్: నాకోసం వచ్చిన చంభా నీకోసం చాలా కష్టపడుతుంది. మనుషుల్ని వాడుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా
మను: కుళ్లుకోకు రణవీర్.. నాకు మంచి జరిగితే నీకు మంచి జరిగినట్టే కదా
రణవీర్: (మనసులో) నీకు మంచి జరగడం అంటే చాలా మందికి చెడు జరగడంతో సమానం
మను: పూజ అయిపోగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు
రణవీర్: మళ్లీ నేను చెప్పడం ఎందుకు..? డైరెక్టుగా చంభానే వచ్చి చెప్తుంది కదా
మను: అయితే సరే ఓకే
అంటూ కాల్ కట్ చేసిన తర్వాత మనోహరి హాల్లోకి వచ్చి అటూ ఇటూ చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు. ఎవరూ లేరు ఎక్కడికి వెళ్లారు.. ఒకవేళ బెడ్ రూంలోకి వెళ్లారేమో అనుకుంటూ మనోహరి పైన అమర్ వాళ్ల రూం దగ్గరకు వెళ్లి డోర్ చాటు నుంచి అంతా గమనిస్తుంది. రూంలో భాగీకి పాలు తీసుకొచ్చి ఇస్తాడు అమర్.
అమర్: ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం పాలన్ని తాగాలి.
భాగీ: ఏంటండి మీరు మరీను.. నన్ను మరీ నైంత్ మంత్ ప్రెగ్నెంట్‌లా చూస్తున్నారు..
అమర్: ఏ మంత్ అయితే ఏంటి… నువ్వు ప్రెగ్నెంటే కదా..? నిన్ను కేరింగ్ గా చూసుకోవాలి..
మను: ( మనసులో) ఈ కేరింగ్ అంతా కాసేపే అమర్.. ఆ తర్వాత అది మిస్ క్యారింగ్ అవుతుంది
భాగీ: ఈ ప్రేమంతా నా మీదనా..? లేక నాకు పుట్టబోయే బిడ్డ మీదనా..?
అమర్: మీ ఇద్దరి మీద.. అవును పుట్టబోయే బిడ్డను ఇచ్చేది నువ్వే కదా అందుకే మీ ఇద్దరి మీద
అంటూ అమర్ చెప్పగానే.. భాగీ ఎమోషనల్ అవుతుంది. ఏడుస్తూ.. అమర్‌ను హగ్ చేసుకుంటుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయట పిల్లల గోల విని బయట లాన్‌లోకి వెళ్తుంది. అప్పటికే అక్కడ ఆనంద్, ఆకాష్ గొడవ పడుతుంటారు. ఆనంద్ కోపంగా ఆకాష్‌ను కొట్టడానికి వెళ్తుంటే.. మనోహరి ఆపాలని చూస్తుంది. కానీ వినరు.. ఇంతలో లోపలి నుంచి వచ్చిన భాగీ ఇద్దరిని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఆనంద్ స్పీడుగా పరుగెత్తుకుంటూ వచ్చి భాగీకి డాష్ ఇస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మనోహరి నవ్వుతూ చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















