Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి అబార్షన్ అయ్యేలా పూజ చేసిన చంభా – యమలోకంలో ఆరును చూసిన నారదుడు
Nindu Noorella Saavasam serial Today Episode November 3rd: భాగీకి అబార్షన్ అయ్యేలా చంభా పూజ చేస్తుంది. దీంతో భాగీకి కడుపులో నొప్పి అంటూ బాధపడుతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకంలో ఉన్న ఆరును చూస్తాడు నారదుడు. ఎవరు ఈ బాలిక కొత్తగా కనిపిస్తుంది పైగా ఈ నరక లోకంలో ఇంత ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తుంది అనుకుంటూ దగ్గరకు వెళ్తాడు.
నారదుడు: ఎవరు బాలిక నువ్వు..?
ఆరు: తమరెవరు నరకలోకానికి ఆర్కెస్ట్రానా..?
నారదుడు: నువ్వు ఆంగ్ల పదమును ఉచ్చరించావు అంటే కచ్చితంగా భూలోక వాసివే అయ్యి ఉంటావు..
ఆరు: అవును నా పేరు అరుంధతి.. కేరాఫ్ భూలోకం
నారదుడు: ఏమిటి తల్లి మీ లోకంలో చలనచిత్రములలో దూరదర్శన్ ధారావాహికలో మమ్ములను ఎప్పుడూ వీక్షించలేదా..?
ఆరు: స్క్రీన్ మీద చాలా చూశాను.. సడెన్‌గా చూసే సరికి గుర్తు పట్టలేకపోయాను అగ్గిపుల్ల స్వామి
నారదుడు: అదేంటి అగ్గిపుల్ల స్వామా..?
ఆరు: అవును మా లోకంలో మీ పేరు అదే.. రెండు గ్రూపుల మధ్య తగువులు పెట్టి తమాషాలు చూస్తుంటారు కదా..?
నారదుడు: మీ లోకంలో మమ్ములను ఈ రకంగా ప్రాపగండ చేస్తున్నారా..?
ఆరు: అవును మీరు ఆ రకంగానే చాలా పాపులర్ అయ్యారు
నారదుడు: బాలికా మేము ఏం చేసిననూ లోక కళ్యాణం కోసమే కదా..?
గుప్త, నారదుడిని చూసి షాక్ అవుతాడు.
గుప్త: అమ్మో నారద మహర్షుల వారు
నారదుడు: ఇంతకీ మానవ కాంతవైన నువ్వు ఇచ్చటికీ ఎటుల వచ్చితివి
ఆరు: ఎటుల వచ్చితిని అంటే అందరూ చచ్చాక నరకానికే కదా వస్తారు
గుప్త: ఈ బాలిక మరణం ప్రభువుల వారి తప్పిదం అని నారద మహర్షులకు తెలిసినచో.. నరక లోకమునకే నరకం చూపించెదరు..
నారదుడు: మరణించి ఇక్కడికి వచ్చిన ఎడల రౌరమున శిక్ష అనుభవిస్తూ ఉండవలెను కదా..? ఇంత ప్రశాంతంగా ధ్యానం ఎలా చేస్తున్నావు..
గుప్త, నారదుడి దగ్గరకు వెళ్తాడు.
గుప్త: నారద మహర్షులకు ప్రణామములు
నారదుడు: ప్రణామములు ఏం విచిత్ర గుప్త ఎలా ఉన్నావు
గుప్త: ఇప్పటి వరకు క్షేమమే మహర్షి.. (తమ రాక వల్ల ఏమి జరుగునో అని భయంగా ఉంది. మనసులో అనుకుంటాడు)
నారదుడు: ఏమిటో అంటున్నావు
గుప్త: ఏమీయూ లేదు.. తమ దయ వల్ల అంతయూ కుశలమే అంటున్నాను..
నారదుడు: ఎలా ఉన్నాడు మీ యమధర్మరాజు
గుప్త: తమ కొరకే వేచి చూస్తున్నారు
నారదుడు: అదేంటి మీ ప్రభువుల వారు ఎప్పుడూ వేచి చూసేది పాపులను శిక్షించుట కొరకే కదా..?
గుప్త: ఆయన పాపులను మాత్రమే శిక్షించెదరు మీరు అందరినీ శిక్షిస్తారు.
నారదుడు: మరలా ఏదో అంటున్నావు విచిత్రగుప్త
గుప్త: ఏమీయూ లేదు మహర్షి.. అల్పాహారం ఏదైనా స్వీకరించెదవా
నారదుడు: ఇదేమైనా స్వర్గమా..? అమృతం స్వీకరించడానికి ఈ నరకమున చీము నెత్తురు తప్పా ఏమీ ఉండదు కదా గుప్త
ఆరు: అసలు వీళ్లకు అలాంటివేమీ ఉండవు.. దయాదాక్షిణ్యాలు అసలు లేవు
నారదుడు: చిత్ర విచిత్ర గుప్త ఈ బాలిక ఎవరు.? ఈమె కథ ఏంటి..?
అంటూ అడగ్గానే.. గుప్త అయోమయంగా చూస్తుంటాడు. మరోవైపు కింద భూలోకంలో మనోహరి చెప్పడంతో చంభా రణవీర్ ఇంటికి వెళ్లి భాగీకి అబార్షన్ అయ్యేలా మంత్రాలు చేస్తుంది. చంభా మంత్రాలు చేస్తుంటే.. భాగీ కడుపు నొప్పితో బాధపడతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















