అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి – అంజు రూంలో ఆరు స్కెచ్‌ చూసిన భాగీ  

Nindu Noorella Saavasam Today Episode: అంజు రూంలో ఆరు స్కెచ్‌ చూసిన భాగీ అక్క ఫోటో ఇక్కడెందుకు ఉంది పిల్లలనే అడుగుదాం అని కిందకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో కూర్చున్న ఆరు దగ్గరకు మనోహరి వచ్చి నువ్వెక్కడున్నావో చెప్పు నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఎప్పుడు చూసినా.. ఆ మిస్సమ్మతో మాట్లాడతావు. ఎవ్వరికీ కనిపించవు.. అంటుంది. దీంతో ఆరు కోపంగా మనోహరికి వార్నింగ్‌ ఇస్తుంది.

మనోహరి: ఏంటి నీ కుటుంబం అంతా నిన్ను కాపాడేసిందని తెగ ఆనందపడుతున్నావా? ఏంటి..? అమర్‌ కు నిజం చెప్పి వెళ్లమని నన్ను బెదిరిస్తున్నావా..? నా గురించి నీకు తెలుసు కదా ఆరు. నేను దేన్నైనా ఒక్కసారి నాది అనుకుంటే దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాను.

ఆరు: ఓడిపోతామన్న భయమే నీతో ఇలా మాట్లాడిస్తుంది మను. మిస్సమ్మ ఇంట్లో అందరి మనసు గెలుచుకుంది. నేనంటే నిన్ను నమ్మాను కాబట్టి నువ్వు మోసం చేయగలిగావు. కానీ మిస్సమ్మ అలా కాదు నిన్ను తొక్కి పట్టి నార తీస్తుంది.

మనోహరి: నాకు తెలుసు నువ్వు చాలా ఆనంద పడుతున్నావని. కానీ ఆ ఆనందం ఎక్కవు సేపు నిలవదు. నా ప్లాన్‌ ఏంటో తెలుసా..?   నువ్వు ఏ పిల్లలకు అయితే దాన్ని దగ్గర చేయాలని చూస్తున్నావో.. ఆదే పిల్లల చేత దాన్ని బయటకు పంపిచేస్తాను.

అని మనోహరి చెప్పగానే ఆరు బాధపడుతుంది. నువ్వు విషం నింపుతానంటుంది. వాడుకుంటానంటుంది నీ కూతుర్నే అని తిడుతుంది. మరోవైపు భాగీ పిల్లల రూం సర్దుతుంది. బెడ్‌ మీద అంజు పెన్సిల్‌ తో వేసిన అరుంధతి ఫోటో కనిపిస్తుంది.  అక్క ఫోటో ఇక్కడ ఉందేంటి..? పిల్లల దగ్గర అక్క ఫోటో ఉండటమేంటి..? వాళ్లనే అడుగుదాం అని తీసుకుని కిందకు వెళ్తుంది. లోపలికి వస్తున్న మనోహరి వచ్చి భాగీ చేతిలో ఫోటో చూసి ఎలాగైనా ఆపాలని ట్రై చేస్తుంది.

మనోహరి: మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావు..

భాగీ: నా ఇంట్లో నేను ఎక్కడికైనా వెళ్తాను. నీకెందుకు

మనోహరి: ఈ స్కెచ్‌ ఏంటి..?

భాగీ: పిల్లలు రూంలో ఈ స్కెచ్‌ దొరికింది. ఈ ఫోటో ఆ అక్క

మనోహరి: ఆవిడ ఫోటో పిల్లల గదిలో ఎందుకు ఉందని అడగడానికే కదా వెళ్తున్నావు. వాళ్లను అడగడం దేనికి ఫోటోల ఉన్న పక్కింటి అక్క బయట వచ్చి వెయిట్‌ చేస్తుంది. వెళ్లి ఆవిడనే అడుగు.

భాగీ: అవునా.. సరే

అంజు: మిస్సమ్మ ఏంటి అందరం ఇక్కడే ఉంటే ఏదో పేపర్‌ తీసుకుని బయటక వెళ్తుంది. అది నేను గీసిన అమ్మ ఫోటోనా..?

అమ్ము: అంజు అక్కడేం చేస్తున్నావు వచ్చి హోం వర్కు చేసుకో..

భాగీ: అక్కా నా కోసమే వచ్చారట కదా.. మనోహరి చెప్పింది.

ఆరు: నేను నీకోసం వచ్చానని చెప్పిందా..?

భాగీ: అవునక్కా ఇక్కడే ఉన్నారని చూపించింది కూడా.. అక్కా ఏమైంది అక్క మీరొచ్చింది నాకోసమే కదా?

ఆరు: అవును మిస్సమ్మ నీ కోసమే వచ్చాను.

భాగీ: అక్కా మీ గురించి మాట్లాడటానికే పిల్లల దగ్గరకు వెళ్తున్నాను. ఇంతలో మీరే వచ్చారు.

ఆరు: నా గురించి పిల్లలతో ఏం మాట్లాడాలి అనుకున్నావు.

భాగీ: పిల్లల రూంలో నీ ఫోటో ఎందుకు ఉందో అడుగుదామనుకున్న. ఇంతలో మీరే కనిపించారు. అక్కా ఇది మీ స్కెచ్చే కదా? అక్కా వాళ్లకు మీరెవరో తెలియదు అంటారు. ఎప్పుడూ చూడలేదు అంటారు. కానీ మీ ఫోటో వాళ్ల రూంలో ఉంది. అది ఎందుకో అడుగుదామనుకున్న.

అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే దూరం నుంచి మనోహరి చూస్తుంది.

భాగీ: అది ఏంటక్కా మీకు కూడా తెలియదా..? అయితే వెళ్లి వాళ్లనే అడుగుతా..?

ఆరు: అది మిస్సవ్వకుండా ఉండటానికి ఇచ్చా..

భాగీ: మా పిల్లలు మిమ్మల్ని మిస్సవ్వకూడదని మీ ఫోటో ఇచ్చావా..?

ఆరు: మా పిల్లలకు ఇచ్చా.. వాళ్ల దగ్గర నుంచి మీ పిల్లలు తీసుకున్నారట. అది తీసుకుందామనే వచ్చాను.

భాగీ: అక్కా అయినా.. మీరేమో అందరికీ తెలుసు అంటారు. ఇంట్లో వాళ్లేమో తెలియదు అంటారు.

ఆరు: అంటే మిస్సమ్మ కలిసిన వాళ్లందర్ని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం కదా..?

భాగీ: పక్కింటి వాళ్లను ఎలా మర్చిపోతారు. పైగా చుట్టు పక్కల వాళ్లను ఎవర్ని అడిగినా మీరు తెలియదు అంటారు. అయినా మీ పేరు చెప్పరేంటి..?

మనోహరి: మిస్సమ్మ పిల్లలు పడుకోవడానికి రెడీ అయ్యారు. నీకోసం ఎదరు చూస్తున్నారు…రా..

ఆరు: మిస్సమ్మ మా పిల్లలు కూడా పడుకునే టైం అయింది. వెళ్తాను. రేపు కలుస్తాను.

 అని చెప్పగానే భాగీ వెళ్లిపోతుంది. మనోహరి ఫోటో పట్టుకున్న ఆరు దగ్గరకు వెళ్లి ఆ ఫోటో ఇవ్వు అనగానే ఇస్తుంది. ఫోటోను కాలు కింద వేసి తొక్కుతుంది. ఇంతలో లోపలి నుంచి అంజు వస్తుంది. మనోహరిని పిలుస్తుంది. ఇక్కడేం చేస్తున్నారని ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతుంది. మనోహరి షాకింగ్‌ గా చూస్తూ.. బాధపడ్డట్టూ నటిస్తూ.. ఆరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలా ఒంటరిగా నిలబడి ఆకాశంలోకి చూస్తూ నా ఆరుతో మాట్లాడుతుంటాను. అని చెప్పి నవ్వెందుకు బయటకు వచ్చావు అని అంజును అడుగుతుంది మనోహరి.  నేను స్కెచ్‌ వేసుకున్న అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకుని బయటకు వచ్చింది. అందుకే వచ్చానని అంజు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rashmika Mandanna - Diwali: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
Tollywood Celebrities Diwali: దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు
దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Diwali Detox Drinks : టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే
టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే
Embed widget