అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యముడిని ఇరకాటంలో పెట్టిన ఆరు – అయోమయంలో నారదుడు

Nindu Noorella Saavasam serial Today Episode November 18th:  నారదుడికి ఆరు నిజం చెప్పడంతో యముడు అయోమయంలో పడిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  నారదుడికి ఆరు నిజం చెప్పడంతో కోపంగా యముడి దగ్గరకు వెళ్తాడు నారదుడు.. కోపంగా తన వైపే వస్తున్న నారదుడిని చూసి అనుమానిస్తాడు యముడు.

నారదుడు: సమవర్తి…

యముడు:  నారదుల వారికి నమస్కారం.. ఏమిటీ  మీ దృష్టి మరల మా వైపు మరలినది

నారదుడు: ఎంత వంచన చేసితివి సమవర్థి నాకే అసత్యం చెప్పితివా..?

యముడు: ఏమిటీ మేము మిమ్ములను వంచించితిమా..? మీతో అసత్యం ఆడితిమా..? ఏమిటి మహర్షి మాతోనే పరిహాసమా..?

నారదుడు: పరిహాసం ఆడునది తమరా..? మేమా..? న్యాయ, అన్యాయ విచారణ అధికారివి మీరు ఇటుల చేయుట అసలు తగదు.. ఒక మానవ కాంత దేవకన్య అని ఇంద్ర కన్య ఇంద్రజ అని చెప్పితివి..

యముడు షాక్

యముడు: అటువంటిది ఏమియూ లేదు మహర్షి మీతో ఎవరు చెప్పిరి

నారదుడు: ఇంకెవరో చెబితే మేము ఎందులకు అడిగెదము..? ఆ బాలికే స్వయంగా చెప్పినది.. నీ బండారం బయట పడినది యమధర్మరాజా..? ఇప్పుడే మీ గురించి ముల్లోకములలో చాటింపు వేయించేదను.. మహేంద్రుడి సభలో పంచాయతీ పెట్టి మిమ్మల్ని విచారణకు అక్కడికి పిలిపించి మిగతా దిగ్పాలకుల ముందు మీ పరువు, పదవి తీయించెదను

యముడు: ( మనసులో)  బాలిక మాకు ఎంతటి సంకటము తెచ్చితివి..మా కిరీటము మా ఆసనమునకే ఎసరు తెచ్చితివా..? ఇప్పుడు ఏమి చేయవలె..

నారదుడు: యమధర్మరాజా..? మీరు చేసిన ఈ తప్పిదమునకు తగిన మూల్యము చెల్లించుటకు సిద్దముగా ఉండుము.. ఇక ఈ రౌరమునకు మీరు ఎంత మాత్రము ప్రభువగా కొనసాగలేరు..

యముడు భయపడుతుంటాడు. చాటు నుంచి వింటున్న ఆరు యముడికి హెల్ప్‌ చేయాలనుకుంటుంది. నవ్వుతూ వాళ్ల దగ్గరకు వెళ్తుంది.

ఆరు: యమధర్మరాజుల వారు మీరు ఓడితిరి నేను గెలిచితిని..

అని చెప్పగానే యముడు అర్థం కాక అటూ ఇటూ చూస్తుంటాడు. ఆరు సైగ చేస్తుంది.

యముడు: అవును తల్లి మీరే గెలిచితిరి మేము ఓడితిమి..

నారదుడు: యమధర్మరాజా ఈ గెలుపు ఓటములు ఏమి..?

ఆరు: ఏమీ లేదు నారదుల వారు మేము దేవకన్య కాదు మానవ కాంత అని మీతో అసత్యం ఆడినచో మీరు నమ్మరు అని యమధర్మరాజుల వారు అన్నారు.. నమ్మిస్తాను అని నేను పందెం కాసితిని మీరు నమ్మేసిరి నేను గెలిచినట్టే కదా..?

యముడు: బలే దానికి బాలిక నారదుల వారు త్రిలోక సంచారి . నువ్వు దేవకన్యవు అని ఇంద్రుడి కుమార్తె ఇంద్రజవు అని వారికి తెలియదా ఏమి. ఏదో నీ సంతోషం కోసం  కాస్త నమ్మినట్టు నటించారు అంతే.. అంతే కదా మహర్షి

నారదుడు: అవును…మీరు చెప్పినది నేను నమ్మలేదు ఇంద్రజ. నీ దగ్గర నేను నమ్మినట్టు నటించితిని.. ఈ యమధర్మరాజును కాసేపు ఆట పట్టించుచుంటిని..

యముడు: మహర్షి రాను రాను ఇంద్రజ అల్లరి పిల్ల అవుతుంది

అవును అవును ఇక నాకు మీ లోకమునకు సెలవు అంటూ నారదుడు వెళ్లిపోతాడు. యముడు.. ఆరును బతికించితివి బాలిక అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget