అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : శోభాచంద్రను చూసిన భూమి – ఆరు, భూమిలను కాపాడిన పరమశివుడు  

Nindu Noorella Saavasam Today Episode:  ఆరు, భూమి ఇద్దరు దీపం వెలిగించగానే చనిపోతారని అపూర్వకు ఫోన్‌ చేసి చెప్తుంది మనోహరి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:   దీపాలు వెలిగిస్తున్న భాగీకి మనోహరి తాను తీసుకొచ్చిన నూనెతో దీపాలు వెలిగించమని చెప్తుంది. ఈ నూనెతో వెలిగిస్తున్నాను కదా..? మరి ఆ నూనెతో ఎందుకు వెలిగించమంటున్నావు అని అడుగుతుంది భాగీ. అసలు ఆ నూనెతో దీపం వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందా..? అయితే నువ్వే వెలిగించొచ్చు కదా..? అని చెప్తుంది. దీంతో ఇంకా ఎక్కువ చెప్తే.. దీనికి అనుమానం వస్తుంది. అని మనసులో అనుకుని కామ్‌గా ఉంటుంది. ఇంతలో పంతులు గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాము ఎవరైనా పాల్గొనవచ్చు అని చెప్పగానే భూమి, అమ్ము వెళ్లి డాన్స్‌ చేస్తారు. భూమి డాన్స్‌ చూసిన శోభాచంద్ర హ్యాపీగా ఫీలవుతుంది.

గుప్త: బాలిక నువ్వు తిరిగి వెళ్లు సమయం ఆసన్నమైంది.

శోభ: నీకు ఎలా థాంక్స్‌ చెప్పాలో కూడా తెలియడం లేదు. నీ పుణ్యాన్ని నా కడుపు కోత తీర్చడానికి వాడావు. కన్న కూతురుని కళ్లారా చూడలేకపోయాననే బాధను నువ్వు తీర్చావు. నువ్వు ఎవరో నాకే ఎందుకు ఈ సాయం చేశావో నాకు తెలియదు. నా వరకు నేను చూడని దైవం నువ్వు. నేను నమ్మిన ధర్మం నువ్వు. ఈ రుణ బంధం తీర్చుకోవాలని లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే నీయంత మంచి బుద్ది ఇవ్వమని ఆ దేవుడిని అడుగుతాను. మళ్లీ చచ్చేవరకు నీలాగే బతుకుతాను.

గుప్త: బాలిక ఆఖరి సారి నీ కూమార్తెను చూసుకోవాలని ఉంటే చూసుకొనుము.

శోభ: అవసరం లేదు గుప్త గారు నా కూతురు చుట్టు ఇంత మంచి వాళ్లు ఉండగా నా కూతురుకు ఏమీ కాదు. సంతోషంగా ఉంటుంది. నేను వెళ్లి వస్తాను అరుంధతి.

ఆరు: అలాగేనండి.

శోభ: గుప్త గారు పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవ దేవుడిని దర్శించుకుని వెళ్తాను.

అని చెప్పి శోభాచంద్ర వెళ్లిపోతుంది. మనం ఇక మిస్సమ్మ వాళ్ల దగ్గరకు వెళ్దాం పదండి అని ఆరు గుప్తను తీసుకుని కొలను దగ్గరకు వెళ్తుంది. తర్వాత అపూర్వ, మనోహరికి ఫోన్‌ చేస్తుంది. ఏమైందని అడుగుతుంది. ఇంకొద్దిసేపట్లో నీ శత్రువు. నా శత్రువు చనిపోబోతున్నారని వీడియో కాల్ చేస్తాను. లైవ్‌ లో దాని చావును చూసి ఎంజాయ్‌ చేయ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తుంది మనోహరి.

ఆరు: గుప్త గారు మనోహరి ఏంటి ఇందాకటి నుంచి ఆఫోన్‌ పట్టుకుని ఏదో చేస్తుంది. దాని వరుస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మౌనంగా ఉన్నారేంటి గుప్త గారు మను ఏమైనా ప్లాన్‌ చేసిందా..?

గుప్త: అవును బాలిక అచట ఉన్న ఆ బాలికలు ఇరువురికి ప్రమాదం జరగబోవుతున్నది.

ఆరు: నో ఇలా జరగకూడదు.. మిస్సమ్మ..

గుప్త: బాలిక ఆగుము. నువ్వు ఎంత ప్రయత్నించినను. నీ మాటలు ఆ బాలికకు వినిపించవు.. నువ్వు ఆ బాలికకు కనిపించవు..

ఆరు: మిస్సమ్మ.. వద్దు…

అని చెప్తుంది. అయినా మిస్సమ్మ దీపం పట్టుకుని ఉంటే భూమి అగ్గిపుల్ల వెలిగిస్తుంది. ఇంతలో దీపంతో సహా మాయం అయిపోతుంది. అందరూ షాక్‌ అవుతారు. శోభాచంద్ర ఆత్మ ఆ దీపాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. గుడి గోపురం మీద శోభ చంద్రను చూస్తుంది భూమి. తర్వాత ఇంకో దీపం వెలిగించబోతుంటే.. గుడిలోని శివలింగం నుంచి ఒక శక్తి వచ్చి ఆ దీపం సజావుగా వెలిగేటట్టు చేస్తుంది. అందరూ హ్యాపీగా దీపాలు వెలిగిస్తారు. కట్‌ చేస్తే.. భాగీని తీసుకెళ్లడానికి వచ్చిన అమర్‌ బయట నిలబడి ఉండటం.. అమర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లడానికి అమ్ము బయటకు రావడం దగ్గర ఓపెన్‌ అవుతుంది.

అమ్ము: డాడ్‌ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. రండి డాడ్‌ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మిస్సమ్మ ఉండాల్సింది ఇక్కడ కాదు డాడ్‌. అమ్మ ఎలాగూ లేదు. ఎంత అనుకున్న మీరు తీసుకురాలేరు. కానీ మీరనుకుంటే మిస్సమ్మను తీసుకురాగలరు. డాడ్‌ ప్లీజ్‌ రండి డాడ్‌.  

అని అమ్ము లోపలికి తీసుకెళ్తుంది. అమర్‌ ను చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ లోపలికి వెళ్లి సైలెంట్‌ గా ఉంటారు. ఇంతలో అమర్‌, రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్లడానికే వచ్చాను. అని చెప్పగానే రామ్మూర్తి తీసుకెళ్లండి బాబు మీ భార్య, వాళ్ల అమ్మ.. తీసుకెళ్లండి అని చెప్తాడు రామ్మూర్తి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget