అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను దెబ్బకు షాక్‌ అయిన చంభా – తెలివిగా అమర్ నుంచి ఎస్కేప్‌ అయిన మను

Nindu Noorella Saavasam serial Today Episode November 16th:  అమర్‌ దగ్గర తెలివిగా మాట్లాడి తప్పించుకుంటుంది మనోహరి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకంలో మాయాదర్పణంలో కింద హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో చూడమని ఆరుకు చెప్తాడు గుప్త. అక్కడ నా వాళ్లు బాధపడటం తప్పా ఇంకేం ఉంది గుప్త గారు అంటుంది ఆరు.

గుప్త: సరిగ్గా చూడుము బాలిక అక్కడ నీ పిల్ల పిచ్చుకలు కనిపిస్తున్నారా..?

ఆరు: అవును కనిపించడం లేదు ఇంతకీ నా పిల్లలు ఎక్కడ గుప్త గారు

అని అడగ్గానే.. గుప్త వెంటనే గుడిలో హోమం చేస్తున్న పిల్లలను చూపిస్తాడు.

గుప్త: నీ పిల్ల పిచ్చుకలు హోమం చేస్తున్నారు..

ఆరు: మా పిల్లుల సరే పక్కనే ఉన్న ఆ పిల్లలు ఎవరు గుప్త గారు

గుప్త: వాళ్లు నీవు పెరిగిన అనాథ ఆశ్రమం పిల్లలు

ఆరు: వాళ్లేం చేస్తున్నారు అక్కడ

గుప్త: నీ సోదరి రుణం తీర్చుకుంటున్నారు.. అర్థం కాలేదా బాలిక. దైవం మానుష రూపేణా అంటారు. ఆ పిల్లల ఆకలి దప్పికలు తీర్చుటకు నీ సోదరి సహాయం చేసినది. అమ్మలా అన్నం పెట్టిన నీ సోదరికి తమ వంతు దైవ సహాయం చేస్తున్నారు. నీ కన్నబిడ్డలతో పాటు ఆ పిల్ల పిచ్చుకలు కూడా నీ సహోదరి కోసం ప్రార్థిస్తున్నారు

ఆరు: వాళ్ల ప్రయత్నం ఫలిస్తుందా

గుప్త: రావణుడి కోసం రాముడు వచ్చినప్పుడు కంసుడి కొరకు కృష్ణుడు వచ్చినప్పుడు మానవుడి కొరకు మాధవుడు రాడా తల్లి.. మానవ సంకల్పానికి దైవ సహాయం తోడైనప్పుడు ఎటుల ఉండునో ఇప్పుడు వీక్షించుము బాలిక. జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడుము బాలిక

అనగానే ఆరు చూస్తుంటుంది. స్పృహలో ఉన్న భాగీ కదులుతుంది. డాక్టర్‌ వచ్చి చూసి ట్రీట్‌మెంట్‌ ఇస్తాడు. గుడి నుంచి వచ్చిన పిల్లలు భాగీకి బొట్టు పెడతారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే రామ్మూర్తి ఇంట్లో ఉన్న మనోహరి, యాదమ్మకు ఏం కాలేదా..? అని అనుమానంగా అడుగుతాడు.

ఆనంద్‌: డాడ్‌ వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే వరకు వాళ్లు ఎక్కడున్నారు..?

ఆకాష్: వాళ్లు ఇంట్లోనే ఎక్కడో ఉండి పాయిజన్‌ గ్యాస్‌ పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకున్నారేమో

అంజు: అయితే మనోహరి ఆంటీ, యాదమ్మ మాతో పాటు ఇంట్లోనే ఉన్నా మమ్మల్ని సేవ్‌ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు

రామ్మూర్తి: ఇందులో ఏదో మర్మం ఉంది. బ్లాక్‌ మ్యాన్‌ పేరును అడ్డం పెట్టుకుని ఇది ఎవరో చేసిన దాడిలా అనిపిస్తుంది

అమర్‌ బయటకు వెళ్లి మనోహరి ని ఎక్కడికి వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు.

మను:  మిస్సమ్మకు బాగయింది కదా అమర్‌ అందుకే గుడికి వెళ్లి దండం పెటుకుందామని వెళ్తున్నాము

అమర్‌: అయితే సరే కానీ ఇంట్లో గ్యాస్‌ వస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు.?

మను: అమర్ నేను ఆ టైంలో రూంలో ఉన్నాను అమర్‌. రూం క్లోజ్‌గా ఉండటంతో స్మోక్‌ నా రూంలోకి రాలేదు. ఆ తర్వాత భాగీ అరుపులు వినిపించాయి. ఏంటా అని రూం తెరచి చూస్తే.. అప్పటికే స్మోక్‌ అంతా నిండిపోయింది. అదేదో ప్రమాదకరమైన స్మోక్‌ లా ఉందని నేను నోరు ముక్కు మూసుకున్నాను.. ఆ స్మోక్‌ లో భాగీ అంజు ఎక్కడున్నారో అసలు నాకు కనిపించలేదు అమర్‌.. అంతే..

అమర్‌: ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు యాదమ్మ

చంభా: నేను మేడ పైన ఉన్నాను సార్‌

అమర్‌: నువ్వు భాగీకి కేర్‌ టేకర్‌గా వచ్చావు తన పక్కన ఉండకుండా టెర్రస్‌ పైన ఏం చేస్తున్నావు..

చంభా: బట్టలు ఆరేయడానికి వెళ్లాను సార్‌.. అప్పటికే ఇంట్లోంచి పొగలు వస్తున్నాయని చూసి కిందకు వచ్చాను ఆ పొగల్లో నాకు ఏవీ కనిపించ లేదు సార్‌..

అమర్‌: నిన్ను ఎప్పుడూ భాగీ పక్కనే ఉండమని చెప్పాను. కానీ నువ్వు ఆ పని తప్పా మిగతా పనులన్నీ చూస్తున్నావు..

చంభా: క్షమించండి సార్‌ నేను అప్పుడే పైకి వెళ్లాను.. నేను కింద ఉంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు

అమర్‌: నీకు శాలరీ ఇస్తుంది భాగీని సేఫ్‌గా  చూసుకుంటావని ఇంకొకసారి తనని వదిలి ఎటూ వెళ్లకు

చంభా: అలాగే సార్‌ ఎటూ వెళ్లను

అమర్‌ వెళ్లిపోతాడు.

మను: చంభా ఆ చూపులకు అర్థం ఏంటి..?

చంభా: ఇంకా అర్థం కాలేదా..? అమ్మా మనం చెప్పింది తను నమ్మలేదు. మన మీద డౌటు వచ్చింది.

అంటూ మనోహరిని కొద్ది రోజులు భాగీని చంపే ప్రయత్నాన్న పక్కకు పెట్టమని  ఆ బ్లాక్‌ మ్యాన్‌ సంగతి చూడమని చెప్తుంది. అయితే బ్లాక్‌ మ్యాన్‌ సంగతి అమర్‌ చూస్తాడని మనోహరి ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget