Nindu Noorella Saavasam Serial Today May 31st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : పిల్లల ప్లాన్‌కు బలైన మనోహరి – మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్
Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మ కోసం పిల్లలు వేసిన ప్లాన్ కు మనోహరి బలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode : భాగీపై రివేంజ్ తీర్చుకునేందుకు తన దగ్గర మంచి ప్లాన్ ఉందని చెప్తుంది అంజు. ఆ ప్లాన్ ఏంటో చెప్పమని మిగతా పిల్లలు అడగ్గానే.. అంజు తన ప్లాన్ చెప్తుంది. తాతయ్య తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వడానికి మిస్సమ్మ ఇప్పుడు మన దగ్గరకి వస్తుంది. తనకి మన స్టైల్లో వెల్కమ్ చెబుదామా అంటుంది అంజు. సరేనంటారు మిగతా పిల్లలు. కారం, పసుపు కలిపిన నీళ్లను బకెట్‌లో పోసి తలుపు పైన కట్టి మిస్సమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు పిల్లల మనసులో మరింత విషాన్ని నింపాలని అనుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్తుంది మనోహరి. మిస్సమ్మే వచ్చిందనుకుని తాడులాగి ఆ నీళ్లు మనోహరిపై పోస్తారు పిల్లలు. అప్పుడే పిల్లలకు ప్రసాదం ఇచ్చేందుకు వచ్చిన మిస్సమ్మ మనోహరిని చూసి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారంటూ అద్దంలో చూసుకుని భయపడి కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతుంది మనోహరి.
మిస్సమ్మ: చూశారా పిల్లలు.. న్యాయం నావైపు ఉంది కాబట్టి మీరు నాకోసం చేసిన పని మనోహరి పాలైంది.
అంటూ పిల్లలకు బొట్టు పెట్టడానికి వస్తుంది. పిల్లలు ముఖం పక్కకి తిప్పుకోవడంతో బలవంతంగా వాళ్లకి బొట్టు పెడుతుంది. అమ్ముకి బొట్టుపెట్టి ఊదడంతో అరుంధతి గుర్తొచ్చి మిస్సమ్మను అమ్మా.. అని పిలుస్తుంది.
అంజు: తను మన అమ్మ కాదు మిస్సమ్మ..
అమ్ము: అమ్మ కూడా బొట్టుపెట్టి ఇలానే ఊదేది అందుకే అలా అన్నాను.
అని చెప్పగానే మిస్సమ్మ ఆశ్చర్యంగా అక్కడనుంచి కిందకు వెళ్లిపోతుంది. హాల్లోంచి వెళ్తున్న మిస్సమ్మకు గార్డెన్లో తిరుగుతున్న అరుంధతి కనిపిస్తుంది. అక్కకు కూడా బొట్టు పెడదామనుకుంటూ పరిగెత్తుతుంది మిస్సమ్మ.
అరుంధతి: వద్దు మిస్సమ్మ నేను బొట్టు పెట్టుకోకూడదు. మా బంధువులు చనిపోయారు. అందుకే దేవుడి బొట్టు పెట్టుకోకూడదు.
మిస్సమ్మ: ఎందుకు అక్కా.. మీరు ప్రతిసారీ నేను ముట్టుకోవడానికి వస్తే అలా ఉలిక్కిపడతారు. సరే.. బొట్టు, ప్రసాదం పెట్టను కానీ ఒకసారి మిమ్మల్ని ముట్టుకుంటాను. (అంటూ అరుంధతి దగ్గరకు వెళ్తుంది మిస్సమ్మ.)
అరుంధతి: వద్దు మిస్సమ్మ.. నువ్వు కొత్తగా పెళ్లైనదానివి కదా.. అంటు ఉన్నవాళ్లని ముట్టుకోవడం మంచిది కాదు.
అంటూ భాగీ, అరుంధతి మాట్లాడుకుంటుండగా అమర్, రాథోడ్ వస్తారు. భాగీ ఒక్కతే మాట్లాడుకుంటూ కనిపించడంతో
అమర్: ఏయ్ భాగీ అక్కడేం చేస్తున్నావు అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్?
మిస్సమ్మ: నేను ఎవరితో అయినా మాట్లాడతాను మీకెందుకు.
అరుంధతి: మీ ఆయన వచ్చారు ఇక నేను వెళ్తాను మిస్సమ్మ..
మిస్సమ్మ: మీరు నా గెస్ట్ అక్కా.. ఆయనకి భయపడి వెళ్లడం ఏంటి?
అని మిస్సమ్మ చెప్పగానే నేను గెస్ట్ కాదు గోస్ట్ అని తెలిస్తే ఏమైపోతావో మిస్సమ్మ అనుకుంటుంది అరుంధతి. మిస్సమ్మ ఒక్కతే మాట్లాడుకుంటూ కనిపించడంతో లూజు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు అమర్. అక్కా నేను రేపు మీతో మాట్లాడతాను అంటూ అమర్‌తో గొడవపడేందుకు వెళ్తుంది మిస్సమ్మ.
మిస్సమ్మ: ఏవండి కొంచెం ఆగండి.. మీతో మాట్లాడాలి.. ఇప్పుడు మీరెందుకు నన్ను లూజు అన్నారు.
అమర్: ఇన్నాళ్లు నీకు పిచ్చి ఉందని అనుమానమే ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫమ్ అయ్యింది, రాథోడ్ ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్ ఉంటే చూడు.
అని అమర్ అనగానే రాథోడ్ నవ్వుతాడు. దీంతో కోపంగా నవ్వుతున్న రాథోడ్ దగ్గరకు వెళ్లి..
మిస్సమ్మ: నన్ను అంత మాట అంటుంటే నవ్వుతావేంటి రాథోడ్..
రాథోడ్: కొన్నిసార్లు నువ్వు చేసే పనులకి నవ్వొస్తుంది. ఒక్కదానివే మాట్లాడుకుంటుంటే మరేం చేయాలి.
మిస్సమ్మ: అరే.. కాస్త చీకటిలో మనిషి కనపడకపోతే లేదంటారా.. ఈసారి అక్క వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను.
అంటూ మిస్సమ్మ లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత మనోహరి బాబ్జికి ఫోన్ చేస్తుంది. రేపు పౌర్ణమి ఎలాగైనా మిస్సమ్మను చంపెయాలని చెప్తుంది. సరే అంటాడు బాబ్జి. తర్వాత పొద్దున్నే లేచి పూజ చేసిన మిస్సమ్మ దేవుణ్ని తనకు కొంచెం మనఃశాంతి ఇవ్వమని అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఏలూరులో దారుణం, ప్రేమించలేదని యువతిని హతమార్చిన యువకుడు, ఆపై ఆత్మహత్య