Nindu Noorella Saavasam Serial Today March 21st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పిల్లలను చూసి ఎమోషనల్ అయిన అనామిక – మనుకు వార్నింగ్ ఇచ్చిన స్వామిజీ
Nindu Noorella Saavasam Today Episode: స్కూల్‌లో గేమ్స్ ఆడేందుకు రెడీ అవుతున్న పిల్లలన చూసి అనామిక మారిన ఆరు ఎమోషనల్ అవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అనామిక పూర్తిగా అరుంధతిలా మారిపోయిందని స్వామిజీ చెప్పినా మనోహరి నమ్మదు. నా కళ్లతో నేను చూస్తేనే నమ్ముతాను అంటుంది. అయినా నేను ఎలాంటి తప్పు చేయలేదని అటువంటప్పుడు అనామిక ఎలా అరుంధతిలా మారుతుందని తాళిబొట్టు టచ్ చేస్తేనే అలా జరుగుతుందని మీరే చెప్పారు. ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అరుంధతిలా మారిన అనామికకు జరిగింది మొత్తం చెప్తాడు గుప్త. దీంతో మనోహరి తాట తీస్తానని వెళ్తున్న ఆరుకు భాగీ ఎదురవుతుంది. వెంటనే వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది.
ఆరు: ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను
భాగీ: ఏమైంది మీకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు.. అనామిక గారు ఏమైంది..?
గుప్త: బాలిక చెప్పితిని కదా..? నువ్వు ఉన్న ఈ దేహం యొక్క నామధేయం అనామిక. నీ సోదరియే ఈ అనామికకు ఉద్యోగం ఇచ్చినది. కావున నువ్వు ఏమి మాట్లాడినను అనామిక వలే మాట్లాడవలెను. ముందు ఆ ఉపనేత్రము ధరింపుము.
ఆరు: అది నాకు జాబ్ రావడం వల్లే మా ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నాకు ఈ జాబ్ రావడానికి కారణం మీరే కదా. అందుకే మిమ్మల్ని చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను.
భాగీ: మేము మీకు జాబ్ ఇవ్వలేదు అనామిక గారు. మీరే సంపాదించుకున్నారు. ఇంతకీ అత్తయ్యా, మామయ్య ఎక్కడున్నారు.
ఆరు: వాళ్లు దేవాలయానికి వెళ్లారు.
భాగీ: అయితే సరే మనం పిల్లల దగ్గరకు వెళ్దాం ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను.
అంటూ భాగీ లోపలికి వెళ్తుంది. ఇంతలో మనోహరి వచ్చి ఆరు అని గట్టిగా పిలుస్తుంది. ఆరు షాక్ అవుతుంది. ఇంతలో తేరుకుని కూల్ మాట్లాడుతుంది.
ఆరు: చెప్పండి మనోహరి గారు..
మను: గారా..? అదేంటి కొత్తగా
ఆరు: కొత్తగా ఏంటండి.. ఎప్పుడూ అలాగే కదా పిలుస్తాను.
మనోహరి: ఆరు అంటే పలికి అనామకలా మాట్లాడుతుందేంటి..?(మనసులో అనుకుని) నువ్వు..
ఆరు: తెలియనట్టు కొత్తగా అడుగుతున్నారేంటండి.. రోజూ చూస్తున్నారు మాట్లాడుతున్నారు కదా..? ఇందాకా కూడా అను అని పిలిచారు కదా..? ఏంటి అలా చూస్తున్నారు. మీరు అను అనే కదా అన్నారు.
మనోహరి: అవును అను అనే పిలిచాను.
ఆరు: అయినా గేమ్ అడుతూ అలా ఎలా పడుకున్నానండి. మీరు కూడా బలే వారండి లేపకుండా వెళ్లిపోయారు
మనోహరి: చెప్పాను కదా పనుండి వెళ్లిపోయాను
ఆరు: సరే మీరు రెడీ అయి రండి స్కూల్‌కు వెళ్దాం
మనోహరి సరే వెళ్తుంది.
గుప్త: ఏం చేయుచున్నావు బాలిక నువ్వు అనామికలా మాట్లాడటమేంటి..? నువ్వు నువ్వులా మాట్లాడి ఆ బాలికను భయపెట్టి నీ కుటుంబానికి తనను దూరంగా పంపుము..
ఆరు: మాటతో చెబితే వినే స్టేజీలోనో.. నిజం చెప్తానంటే భయపడే స్టేజీలోనో మనోహరి లేదు గుప్త గారు. ప్రస్తుతం నేను అనామిక అని చెబితేనే తనను ఇంట్లోంచి పంపించేయగలను.. మోసాన్ని మోసం చేసే భయపెట్టాలి
మనోహరి: స్వామిజీ చెప్పింది నిజమైతే ఆరు నన్ను చూడగానే గొడవ చేసేది. అలా చేయకుండా ఉందంటే అనామికనే అయ్యుండాలి. మరి స్వామిజీ ఎందుకలా చెప్పారు.
అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది మనోహరి. తర్వాత స్కూల్ లో గేమ్స్ ఆడటానికి రెడీ అవుతున్న పిల్లలు ఆరు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఇంతలో అక్కడికి భాగీ, ఆరు వస్తారు. పిల్లలను చూసిన ఆరు సంతోషంతో పరుగెత్తుకెళ్లి పిల్లలను హగ్ చేసుకుంటుంది. ఇంతలో అంజు అమ్మా అని పిలుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

