అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ – మిస్సమ్మకు నిజం తెలుస్తుందని భయపడ్డ అరుంధతి

Nindu Noorella Saavasam Today Episode: నీ నుంచి ఆ కుటుంబాన్ని కాపాడతానని మిస్సమ్మ, మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో ఉన్న మిస్సమ్మ రాథోడ్‌ను ఇంటికి  వెళ్లమని మనోహరికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చి వస్తానని చెప్పడంతో రాథోడ్‌ ఇంటికి వెళ్తాడు. మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే .. అప్పటికే మంగళ ఫోన్‌ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది. దీంతో మిస్సమ్మను  మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది.

మిస్సమ్మ: పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు. దానికంటే ముందు 101 కొబ్బరి కాయలు మీరే కొనుకొచ్చి గుడిలోపలికి మోసుకొచ్చి కొట్టాలట. ఏమైందక్కా అలా చూస్తున్నావు పద త్వరగా తీసుకొచ్చి కొట్టేస్తే నువ్వు తినేయొచ్చు. ఎందుకక్కా అలా చూస్తున్నావు ఏమైంది?

మనోహరి: ఏం లేదు నా ముందు నిల్చొని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ బయపడతారు. అలాంటిది నువ్వు నన్ను ఎలా మోసం చేశావా అని ఆలోచిస్తున్నాను.

మిస్సమ్మ: నేను మోసం చేయడం ఎంటక్కా..?

మనోహరి: అంత ప్లాన్‌ చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన నాతోనే మళ్లీ ఇంట్లోకి రమ్మని అడిగేలా చేసుకున్నావు. నచ్చేశావు మిస్సమ్మ.

అంటూ మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది.  అయితే మొత్తం మీకు తెలిసిపోయిందా అంటూ మిస్సమ్మ అనగానే మర్యాదగా చెప్తున్నాను ఎలా వచ్చావో అలాగే వెళ్లిపో లేదంటే బాగుండదు అని మనోహరి వార్నింగ్‌ ఇవ్వగానే.. నువ్వు కూడా మర్యాదగా వెళ్లి ఆయనతో నిజం చెప్పి వెళ్లిపో నేను క్షమిస్తాను అంటుంది మిస్సమ్మ. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. దీంతో మిస్సమ్మ ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని నీ నుంచి నేను కాపాడతాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు అరుంధతి కంగారుపడుతుంది. మిస్సమ్మ ఇంటికొస్తే నా ఫోటో చూస్తుంది అని గుప్తను ఏదైనా చేయండి అని అడుగుతుంది.

గుప్త: నేను ఏమీ చేయలేను.. చేయలేను

అరుంధతి: అసలు మిస్సమ్మకు నిజం తెలిస్తే నాకొచ్చే నష్టం ఏంటి? మిస్సమ్మకు నిజం తెలిస్తే వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేస్తుంది. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది.

అనగానే గుప్త కంగారుపడుతుంటాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి గుప్తను తిడతాడు. నువ్వు నాకింద పనిచేస్తున్నావా? నేను నీకింద పనిచేస్తున్నానా అంటూ నిలదీయడంతో గుప్త నాకో సందేహం ఉందని శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆమె ఫోటో పెట్టడం అవసరమా అని అడగ్గానే దేవత ఫోటో ఎక్కడ పెట్టినా మంచిదే అంటాడు రాథోడ్‌. దీంతో అరుంధతి సెంటిమెంట్‌ తో కొట్టావు రాథోడ్‌ అనుకుంటుంది. ఇంతలో మనోహరి వచ్చి తోటమాలివి ఈ గెటప్‌లో ఉన్నావేంటి అని అడిగి లోపలికి వెళ్తుంది. లోపల హాల్ లో అరుంధతి ఫోటో చూసి మనోహరి షాక్‌ అవుతుంది.

మనోహరి: నువ్వు చచ్చాక కూడా నువ్వు నన్ను మనఃశాంతిగా ఉండనీయటం లేదే? నీ చెల్లేమో నీకోసం నన్ను ఓడిస్తానని శపథం చేసిందే.. నీలా ఈఫోటో ఇక్కడ పెట్టింది ఎవరే..

అమర్‌: నేనే ఎందుకు అరు ఫోటో అక్కడ ఉండకూడదా?

మనోహరి: అలా ఏం లేదు అమర్‌ ఎవరు పెట్టారో కనుక్కుని చాలా మంచి పని చేశారని చెబుదామనుకున్నా

అని మనోహరి అనడంతో అమర్‌ ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతాడు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా చూస్తుంటుంది. అమర్‌ వెళ్లిపోతాడు. ఇప్పుడు మిస్సమ్మ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం తెలిసిపోతుందని మనోహరి భయపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి గుప్త, అరుంధతి షాక్‌ అవుతారు. అరుంధతి దగ్గరకు వచ్చిన మిస్సమ్మ మనోహరికి నిజం తెలిసిందని చెప్తుంది. ఇంతలో గుప్త లోపలికి వెళ్లి నీ ఫోటో తీసేయిస్తానని వెళ్లిపోతాడు. మరోవైపు లోపల పంతులు ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. మనోహరి మాత్రం హ్యాపీగా పీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

Also Read: 50 సెకన్ల యాడ్‌కే నయన్‌కు ఇంత భారీ పారితోషకమా? - స్టార్‌ హీరోలు కూడా ఈ రేంజ్‌లో తీసుకోలేదేమో! 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget