Nayanthara: 50 సెకన్ల యాడ్‌కే నయన్‌కు ఇంత భారీ పారితోషకమా? - స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్‌లో తీసుకోలేదేమో!
nayanthara: లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉన్న నయనతార కమర్షియల్ యాడ్స్‌లో పెద్దగా కనిపించదనే విషయాన్ని గ్రహించారా? పేరున్న, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి మాత్రమే అంబాసిడర్ గా వ్యవహరిస్తారు.
Nayanthara Remuneration for Commercial Ad: స్టార్ హీరోయిన్ నయతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సావిత్రి, శ్రీదేవి వంటి అలనాటి తారల తర్వాత ఈ జనరేషన్‌లో లేడీ సూపర్ స్టార్ బిరుదు పొందిన మొదటి నటి ఈమే. అంతేకాదు హీరోలకు పోటీగా రెమ్యునరేషన్ అందుకునే సౌత్ హీరోయిన్లలో నయన్‌దే అగ్ర స్థానం. అంతగా నయన్ సౌత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అన్నట్టు నటించిన నయన్.. ఇప్పుడు ఆ హద్దులు కూడా చెరిపేసింది. రీసెంట్‌గా జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆమె క్రేజ్ నార్త్‌కు కూడా పాకింది.
'జవాన్'లో నయన్ లుక్, గ్లామర్‌కి ఉత్తారది ప్రేక్షకులు సైతం సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందిన నయతారకు అదే రేంజ్‌లో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటుంది. కథ, పాత్ర ప్రాధాన్యత ఉంటేనే ఒకే అంటుంది. నయన్ అందరి హీరోయిన్‌లా కాకుండ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎలా అంటే స్టార్ హీరోయన్, లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉన్న నయనతార కమర్షియల్ యాడ్స్‌లో పెద్దగా కనిపించదనే విషయాన్ని గ్రహించారా? పేరున్న, ఇంటర్నేషనల్ వైడ్‌లో గుర్తింపు పొందిన బ్రాండ్స్‌కు మాత్రమే ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.
వామ్మో.. 50 సెకండ్లకే అంత తీసుకుందా?
వాటిలో మాత్రమే ఆమె నటిస్తారు. అలా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ పెంచుకున్న నయన్ మరి కమర్షియల్ యాడ్స్ చేయాలంటే ఎంత తీసుకుంటుందా? తెలుసా? ఆమె ఒక కమర్షియల్ యాడ్ మిడిల్ రేంజ్ హీరో పారితోషికంకు సమానం ఉంటుందట. తక్కువ శాతం యాడ్స్ కు ప్రయారిటీ ఇచ్చే నయన్ ఓ ప్రకటనలో నటిస్తే ఎంత తీసుకుంటుందనేది ఆసక్తికర అంశం. ఈ క్రమంలో ఆమె ఇటీవల నటించిన టాటా స్కై ప్రకటనకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ తెలిసి అంతా అవాక్క్ అవుతున్నారు. కేవలం 50 సెక్షన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ ప్రకటన కోసం ఆమె రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుందని టాక్. ప్రస్తుతం ఈ వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు స్టార్ హీరోలు కూడా ఒక యాడ్‌కు ఈ రేంజ్‌లో తీసుకోని ఉండరేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భర్తను అన్‌ఫాలో చేసి ఝలక్ ఇచ్చింది..
కాగా ఇటీవల నయనతార తన ఫాలోవర్సకి చిన్న ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త విఘ్నేశ్ శివన్‌ను అన్‌ఫాలో చేసి విడాకుల వార్తలకు తెరలేపింది. ఇక వార్తలు వైరల్ కావడంతో వెంటనే భర్త ఫాలోఅవుతూ అందరిని షాకిచ్చింది. దాంతో అప్పటి నుంచి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్ విడాకులు వార్తలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. భర్త ఫాలో అయ్యి ఈ రూమర్స్‌కి చెక్ పెట్టిన వారి డైవోర్స్‌పై గాసిప్ మాత్రం ఆగడం లేదు. వాటిని ఆపేందుకు తరచూ విఘ్నేశ్, నయన్ జంటగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తాము కలిసే ఉన్నామంటూ అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.