Nindu Noorella Saavasam Serial Today March 17th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: టెర్రరిస్టు ఆపరేషన్‌కు అమర్ – టెర్రరిస్టులకు చిక్కిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: అమర్ పట్టుకోవాలనుకున్న టెర్రరిస్టులకే భాగీ దొరికిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తాను ప్రెగ్నెంట్ కాదని మీరెలా అలా అనుకుంటారని భాగీ అడగడంతో అందరూ షాక్ అవుతారు. అసలు మా మధ్య ఏం జరకుండానే నేనెలా నెల తప్పుతానని నిర్మలకు చెప్తుంది భాగీ. దీంతో అమర్ బయటకు వెళ్లిపోతాడు. మనోహరి కూల్ అవుతుంది.
నిర్మల: ఒక్క నిమిషం నేను ఎంత ఆనంద పడ్డానో తెలుసా..? ఇప్పుడు ఆ ఆనందాన్ని అబద్దం అని మనసుకు ఎలా సర్దిచెప్పుకోవాలో
రాథోడ్: ఎందుకు మేడం అంతలా బాధపడతారు. ఈరోజు అబద్దం అయింది. ఎప్పుడో ఒక్కరోజు నిజం అవుతుంది కదా..?
భాగీ: నిజం అవ్వొద్దని అనుకుంటున్నాను రాథోడ్
అనామిక: మాట వరుసకు కూడా అలా అనొద్దు మేడం
భాగీ: మాట వరుసకు అనలేదు అనామికగారు. మనస్పూర్తిగా అన్నాను. నాకు ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. అది చాలు
శివరాం: కానీ మిస్సమ్మ నీకు అమ్మ అవ్వాలని లేదా..?
భాగీ: నా పిల్లలకు నేను అమ్మనే కదా మామయ్యా.. నా కడుపున పుట్టకపోయి ఉండొచ్చు కానీ ఆయన నా మెడలో మూడు ముళ్లు వేసిన మరుక్షణం నేను అమ్మను అయిపోయాను. ఆయనతో పిల్లలతో ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు
నిర్మల: సవతి తల్లి అమ్మ అవ్వలేదనే మాటను నువ్వు.. తప్పని రుజువు చేస్తున్నావు భాగీ. నువ్వు అమర్ జీవితంలోకి రావడం నిజంగా మా అదృష్టం.
అంతా డోర్ చాటు నుంచి అమర్ వింటాడు. ఎమోషనల్‌గా భాగీని చూస్తాడు. తర్వాత మనోహరి స్వామిజీ దగ్గరకు వెళ్తుంది.
మను: ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు కానీ ఆ అనామికను ఇంట్లోంచి బయటకు పంపించలేకపోతున్నాను. ఇవాళ ఆ అనామిక నన్ను బెదిరించింది. ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను అమర్‌కు శాశ్వతంగా దూరం చేస్తుంది. నా సమస్యకు ఒక సమాధానం ఇవ్వండి స్వామిజీ. అనామికను ఇంట్లోంచి పంపించడానికి నాకు ఒక మార్గాన్ని చూపించండి.
స్వామిజీ: నీ సమస్యే సరైనది కానప్పుడు నేను సమాధానం ఎలా ఇవ్వగలను మనోహరి
మను: అర్థం కాలేదు స్వామిజీ
స్వామిజీ: తప్పు జరుగుతుంది. నువ్వే వెతికే సమాధానంలో కాదు. నీ ప్రశ్నలోనే తప్పుంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? నీకున్న ప్రమాదం అరుంధతినా..? అనామికనా..? నువ్వు ఆ కుటుంబానికి దూరంగా పెట్టాల్సింది. అరుంధతినా..? అనామికనా..?
మను: అరుందతిని స్వామిజీ.. కానీ ఆత్మను ఆ శరీరం నుంచి వేరు చేయడం సాధ్యమేనా..?
స్వామిజీ: సాధ్యమే రేపు పౌర్ణమి రోజు ఆత్మను ఆ శరీరం నుంచి వేరు చేయోచ్చు
మను: అయితే ఏం చేయాలో చెప్పండి స్వామిజీ చేస్తాను
అని మను అడగ్గానే స్వామిజీ చెప్తారు. ఇక అరుంధతి కథ ముగిస్తాను అని మనసులో అనుకుంటూ మను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతా విన్న గుప్త బయపడుతుంటాడు. ఏ పౌర్ణమి రోజు ఆ బాలికకు శక్తి ఇచ్చావో ఆదే పౌర్ణమి రోజు శక్తిహీనురాలిని చేస్తున్నావ జగన్నాథ అంటూ వాపోతాడు. సిటీలో బాంబు బ్లాస్టులో జరగొచ్చన్న సమాచారం రావడంతో మేజర్, అమర్‌ను పిలిచి విషయం చెప్తాడు. ఎలాగైనా ఆ తీవ్రవాదులను ట్రేస్ అవుట్ చేయాలని చెప్తాడు. అమర్ సరే అని ఫైల్ తీసుకుని వెళ్లిపోతాడు. అమర్ వెతుకుతున్న తీవ్రవాదుల కార్లకు భాగీ తన ఫ్రెండ్‌తో స్కూటీ మీద వెళ్తూ గుద్దుతుంది. వాళ్ల దగ్గర బాంబులు, నాటు తుపాకులు, కత్తులు ఉండటం చూసి భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















