అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నెల తప్పిన భాగీ – షాక్‌లో మనోహరి – హెచ్చరించిన స్వామిజీ

Nindu Noorella Saavasam Today Episode: భాగీ వాంప్టింగ్స్‌ చేసుకోవడంతో నెల తప్పిందని నిర్మల చెప్పడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Nindu Noorella Saavasam Serial Today Episode:    భాగీ మెడలోని తాళి హుక్స్‌ ఊడిపోతుందని ఒక సారి చూడమని రాథోడ్‌ చెప్పగానే అనామిక సరేనని తాళి పట్టుకుని చూడబోతుంటే మనోహరి వస్తుంది. షాక్‌ అవుతుంది. వెంటనే కోపంగా అనామికను తిడుతుంది.   

మనోహరి: ఏయ్‌ ఏం చేస్తున్నావు. తాళిని ఎందుకు ముట్టుకుంటున్నావు. అసలు తాళిని ముట్టుకునే అధికారం నీకెక్కడిది..

భాగీ: మనోహరి గారు అసలు అనామిక ఏం చేసిందని ఇప్పుడు అంతలా అరుస్తున్నావు

మనోహరి:  ఏం చేసిందా..? తాళి ముట్టుకోబోయింది. అనామిక తాళి ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..?

భాగీ: ఏమవుతుంది.. చెప్పు..

మనోహరి: గతం.. తను నీ తాళి ముట్టుకోకూడదు అంతే

భాగీ: ఎందుకు ముట్టుకోకూడదు..?

మనోహరి: ఎందుకంటే అది ఆరు తాళి తన జ్ఞాపకంగా మాకు మిగిలిన వస్తువు. దాన్ని ఎవరు పడితే వాళ్లు ముట్టుకోవడం నాకు అసలు నచ్చదు. అంటే ఆరుకు కూడా తన తాళి ఎవరైనా ముట్టుకుంటే అసలు నచ్చేదే కాదు. అందుకే అనామిక మీద అరిచాను..

భాగీ: తను కావాలని ఏమీ ముట్టుకోవడం లేదు. చైన్‌ తెగిపోయేలా ఉందని రాథోడ్‌ చెబితే చూడ్డానికి వచ్చింది. ఇప్పుడు ఏమైందని అంతలా అరిచావు

మనోహరి:  ఏం కాలేదు. అనామిక నువ్వు పైకి వెళ్లు.. నీకు స్పెషల్‌గా చెప్పాలా? రాథోడ్‌.. నువ్వు వెనకేసుకొస్తున్న ఈ అమ్మాయే నీకు వెన్నుపోటు పొడిచి వెళ్తుంది నువ్వు చూస్తూ ఉండు

భాగీ: పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీ మనసులో విషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి నీకు చెడుగా కనిపిస్తుంది మను

అంటూ భాగీ వెళ్లిపోతుంది. మరోవైపు గార్డెన్‌ లోకి వెళ్లిన రాథోడ్‌ లోంచి గుప్త బయటకు వచ్చి రాథోడ్‌ను తిట్టుకుంటాడు.

గుప్త: పేరుకు మాత్రమే నిండు కుండ రత్తడివి.. ఇచ్చట అంతయూ నిండుగానే ఉన్నది. ఇచ్చట మాత్రం ఏమీ లేదు నిన్ను నమ్ముకున్నందుకు కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అయింది.

రాథోడ్‌: బండి అక్కడ ఆపాను.. ఇక్కడి దాకా వచ్చాను లోపలికి వెళ్లాల్సిన వాడిని ఇక్కడికి ఎందుకు వచ్చాను. ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ఏం జరిగి ఉంటుంది.

మనోహరి: ఏంటి రాథోడ్‌.. చూస్తూ ఊరుకుంటుంటే.. చాలా ఎక్స్‌స్ట్రాలు చేస్తున్నావు

రాథోడ్‌:  ఇప్పుడు నేను అంత కానీ పని ఏం చేశాను మేడం

మనోహరి: ఏం చేశావో.. ఏం చేయడానికి అలా చేశావో నాకు తెలియదు కానీ ఇది ఇంకొక్కసారి రిపీట్‌ అయితే మాత్రం నీకు అసలైన మనోహరిని పరిచయం చేస్తాను.

రాథోడ్‌ : ఏమైంది ఈవిడకు ఇలా మాట్లాడుతుంది. సార్‌ దక్కలేదని మెల్లమెల్లగా పిచ్చి పడుతున్నట్టు ఉంది.

అనుకుంటూ రాథోడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనోహరి  స్వామిజీని కలిసి అనామిక ఎలా కంట్రోల్‌ చేయాలో చెప్పమని అడుగుతుంది. స్వామిజీ సమస్యకు సమాధానం చెప్పలేను కానీ నీకు చాలా తక్కువ సమయం ఉందని మాత్రం చెప్పగలను అంటూ హెచ్చిరిస్తాడు. తర్వాత భాగీ బయటకు వచ్చి వాంప్టింగ్స్‌ చేసుకుంటుంటే వెనకాలే నిర్మల వస్తుంది.

నిర్మల: భాగీ కళ్లు తిరుగుతున్నాయా..?

భాగీ: అవును అత్తయ్యా

నిర్మల: నిజంగానా తల్లి.. అయ్యో నా బంగారు తల్లి నువ్వు ఎక్కువ సేపు ఇక్కడ నిలబడకూడదు పద లోపలికి పద… అమర్‌..  అమర్‌..

అమర్‌: ఏంటమ్మా పిలిచావు

నిర్మల: నీకొక శుభవార్త చెప్పడానికి పిలిచాను నాన్నా.. ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలు కన్నాను కానీ కళ్ల ముందు ఉండే సరికి కాళ్లు చేతులు ఆడటం లేదు.

అమర్‌:  ముందు విషయం చెప్పు అమ్మా ఏమైంది…

అని అమర్‌ అడగడంతో శివరాం సంతోషంగా మీ ఆవిడ వాంతులు చేసుకుంది అమర్‌ అని చెప్తాడు. ఆ మాట వినగానే మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Rains In Telangana : తెలంగాణలో చల్లబడిన వాతావరణం- పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం 
తెలంగాణలో చల్లబడిన వాతావరణం- పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం 
Embed widget