Nindu Noorella Saavasam Serial Today June 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి షాక్ ఇచ్చిన ఆరు – రూంలో కూర్చోవడం చూసిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: ఆరు పిల్లల బుక్స్ రాపింగ్ చేస్తూ రూంలో ఉండటం భాగీ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర, వినోద్‌ల పెళ్లి గురించి మాట్లాడుతున్న అమర్, చిత్ర తరపును ఎవరు వస్తారని అడుగుతాడు. చిత్ర తనకు ఎవ్వరూ లేరని ఆశ్రమం వాళ్లే వస్తారని చెప్తుంది. అయితే నిన్ను దత్తత తీసుకున్న వాళ్లు రారా అంటూ అమర్ అడగ్గానే అందరూ షాక్ అవుతారు.
వినోద్: ఏంటి అన్నయ్యా నువ్వు మాట్లాడేది. చిత్ర మా అన్నయ్య చెప్తుంది నిజమేనా..?
ఆరు: చిత్రను దత్తత తీసుకున్నారా… ఇదెప్పుడు జరిగింది
భాగీ: అడుగుతుంటే పలకవేంటి చిత్ర
అమర్: వాళ్లు వస్తున్నారు కదా చిత్ర. అంటే పెళ్లిలో నీ తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవాల్సింది వాళ్లే కదా
చిత్ర: అవును బావగారు నేను ఫోన్ చేసి చెప్తాను
వినోద్: అంటే నీకు లీగల్ గా ఫేరెంట్స్ ఉన్నారా..? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు
శివరాం: ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావమ్మా
నిర్మల: ఎవరూ లేరన్నావు అనాథ అని చెప్పావు. మరి ఏంటమ్మా ఇదంతా మా దగ్గర నిజం ఎందుకు దాచావు
వినోద్: అడుగుతున్నది నిన్నే చిత్ర సమాధానం చెప్పు
మనోహరి: వినోద్ చిత్రకు దత్తత విషయం మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఈ టాఫిక్ వచ్చిన ఎమోషనల్ అవుతుంది.
చిత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే మనోహరి వెళ్తుంది.
నిర్మల: ఏంటండి ఏం జరిగిందో అర్థం కావడం లేదు
శివరాం: చిత్రకు ఆమెను దత్తత తీసుకున్న పేరెంట్స్ కు మధ్య ఏదో జరిగింది వినోద్: ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అన్నయ్యా
అంటూ వినోద్ వెళ్లిపోతాడు. అంతా విన్న ఆరు కోపంగా బయటకు వెళ్తుంది. గార్డెన్‌లో నిలబడి ఏవేవో మంత్రాలు చదువుతుంది. ఇంతలో గుప్త వస్తాడు.
గుప్త: ఏమి చేస్తున్నావు బాలిక
ఆరు: చిత్ర గతం తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను రావడం లేదు
గుప్త: కేవలం వీక్షించుట ఏలా మీ కుటుంబ సభ్యుల తలరాతలను నువ్వే స్వయంగా లికించుకొనుము.. ఇక మేము ఎందులకు.. ప్రభువుల వారు ఎందులకు చిత్రగుప్తుల వారు ఎందుకు
ఆరు: ఏంటి గుప్త గారు కామెడీ చేస్తున్నారా..?
గుప్త: మొదలు పెట్టినది ఎవరు అయినా నీకు వచ్చిన శక్తులతో విధిని మార్చాలనుకుంటే అరిష్టములు జరుగును
ఆరు: మీరు పక్కన ఉండగా నన్ను ఒక్క పని చేసుకోనివ్వరు
కొంచెం దూరంగా వెళ్లి మంత్రాలు చదువుతుంది. భాగీ అక్కా అంటూ పిలుస్తూ వస్తుంది.
భాగీ: అక్కా ఒక్క నిమిషం
ఆరు: ఆయన దత్తత గురించి మాట్లాడగానే చిత్ర కళ్లలో కంగారును ముఖంలో భయాన్ని చూశాను భాగీ పైగా మను చిత్రను చాలా కవర్ చేసింది. అంటే చిత్ర కచ్చితంగా ఏదో దాచించి. ఆ దత్తత వెనక సీక్రెట్ తెలుసుకుంటే ఈ పెళ్లిని మనం ఆపొచ్చు
భాగీ: అయ్యో అక్కా.. మీరు ఏదో లోకంలో ఉన్నారు నేను మళ్టీ వస్తాను.
అని వెళ్లిపోతుంది. తర్వాత ఆరు కిటికీ దగ్గరకు వెళ్లి పిల్లలను చూస్తుంది. పిల్లలు మిస్సమ్మ కోసం బయటకు వెళ్లగానే రూంలోకి వెళ్లిన ఆరు బుక్స్ తీసుకుని రాపరింగ్ చేస్తుంది. ఆకాష్ కిటికీలోంచి చూసి భయంతో కిందకు వెళ్లి భాగీని తీసుకొస్తాడు. రూంలోకి వచ్చిన భాగీ ఆరును చూస్తుంది. ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















