Nindu Noorella Saavasam Serial Today June 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు వచ్చిందన్న మను – షాక్‌లో పడిపోయిన చిత్ర
Nindu Noorella Saavasam Today Episode: ఆరు తిరిగి వచ్చిందని మను చెప్పగానే చిత్ర భయంతో వణికిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరును తీసుకుని వెంటనే వచ్చేయమని యముడు చెప్తాడు. గుప్త సరేనని ఆరును ఇక వెళ్దామా అంటే అనామిక కళ్లు తెరిచాక వెళ్దాం అని చెప్పి పక్కనే కూర్చుని అనామికను లేపుతుంది. అనామిక లేచి అటూ ఇటూ చూస్తుంది.
అనామిక: నేనేంటి ఇక్కడ ఉన్నాను. నేను అమర్ సార్ వాళ్ల ఇంట్లో కేర్ టేకర్ గా ఉండాలి కదా..? ఇక్కడ ఉన్నానేంటి..? ఇదేం ప్లేస్ ఇక్కడికి ఎలా వచ్చాను. నన్ను జాబ్‌లోంచి తీసేశారా ఏంటి..? నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి..? ఎక్కడికి వెళ్లాలి..? రమ్య ఇంటికి వెళ్లిపోవడం బెటర్
అనుకుని వెళ్లిపోతుంది అనామిక.
గుప్త: బాలిక ఆ బాలిక కూడా వెళ్లింది కదా మనము వెళ్దాం
ఆరు: గుప్త గారు ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం గుప్త గారు
గుప్త: వలదు బాలిక ప్రభువుల వారు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. మనం వెళ్లాలి పద వెళ్దాం
ఆరు: సరే గుప్త గారు వెళ్దాం పదండి
అని చెప్పగానే గుప్త కళ్లు మూసుకుని మంత్రం చదవగానే గుప్త ఒక్కడే పైకి వెళ్తుంటాడు. ఆరు ఆశ్చర్యంగా గుప్తను పిలుస్తుంది. గుప్త తన పక్కన ఆరు లేకపోవడంతో షాక్ అవుతాడు. ఇంతలో యముడు రావడంతో గుప్త భయంతో.. గుప్త: ప్రభు నా తప్పిదం ఏమీ లేదు.. మేము యమపురికి వచ్చుటకు ప్రయత్నించుచుంటిమి ఈ బాలిక రాలేకుండిచున్నది ఎందులకో తెలియుట లేదు. ఏమైంది ప్రభు ఎందుకు అంత ఆగ్రహంగా చూస్తున్నారు. మేము ఏ తప్పిదము చేయలేదే
ఆరు: గుప్త గారు ఏదో ఒకటి మాట్లాడండి అసలు రాజు గారు ఏం చెప్తున్నారు అదైనా చెప్పండి
గుప్త: ప్రభువులు మమ్మలను ఆగ్రహంగా చూస్తున్నారు. తప్పేమైనా జరిగిందా ప్రభు.. సత్యముగా నేనేమీ చేయలేదు ప్రభు
అనగానే జరిగింది యముడు చెప్తాడు. గుప్త మంత్ర చదువుతున్న టైంలోనే కొన్ని పూలు తీసుకుని అంజు ఆరు ఫోటో దగ్గరకు వెళ్తుంది.
అంజు: అమ్మా ఈ ప్లవర్స్ కోసం నువ్వు చాలా ట్రై చేశావంట కదా..? అందుకే నీ దగ్గరకు తీసుకొచ్చాను.
అంటూ ఆ ప్లవర్స్ ఆరు ఫోటో దగ్గర పెడుతుంది. అదే విషయం యముడు గుప్తకు చెప్తాడు.
యముడు: ఆ పిల్లలు పెట్టిన ఆ పూలు జీవం కోల్పోయే వరకు ఆ ఆత్మను నువ్వు యమపురికి తీసుకురాలేవు
గుప్త: ప్రభు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి
యముడు: ఆ పుష్పం జీవం కోల్పోవడానికి పద్దెనిమిది దినములు పడుతుంది
గుప్త: అంటే మళ్లీ పద్దెనిమిది దినములు మేము ఈ భూమలోకంలో ఉండాలా..?
అని ఏడుస్తూ కిందకు వస్తాడు గుప్త. విషయం అర్థం చేసుకున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. నా స్టే ఎక్స్‌టెండ్ అయిందా గుప్త గారు అని అడుగుతుంది. దీంతో గుప్త కోపంగా చూస్తుంటాడు. తర్వాత ఇంట్లో మను, చిత్ర టెన్షన్ పడుతుంటారు. ఇంతలో భాగీ వస్తుంది.
చిత్ర: మను చూడు నిన్ను ఇంతలా టెన్షన్ పెట్టి ఎంత దర్జాగా వస్తుందో..
మిస్సమ్మ గడప దగ్గరకు రాగానే కింద పడబోతుంటే ఎవరో పట్టుకుంటారు.
చిత్ర: ఇదేంటి కింద పడకుండా.. పైకి లేవకుండా ఆలా గాల్లో ఉందేంటి..? భాగీని ఎవరో పట్టుకున్నట్టు అలా ఆగిపోయిందేంటి..?
మను: పట్టుకున్నట్టు కాదే.. పట్టుకుంది
అని షాకింగ్ గా చెప్తుంది మను. ఎవరు పట్టుకున్నారు అని చిత్ర అడగ్గానే అరుంధతి పట్టుకుందే అని చెప్తుంది. మను మాటలకు చిత్ర షాక్ అవుతుంది. ఇంతలో భాగీ తిరిగి చూడగానే ఆరు కనిపిస్తుంది. అక్కా అంటూ ఆరును భాగీ హగ్ చేసుకుంటుంది. అది చూసి మను, చిత్ర మరింత షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















