అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nindu Noorella Saavasam Serial Today July 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు డైరీ చదివిన అమర్ – మిస్సమ్మను చంపేస్తానన్న మనోహరి

Nindu Noorella Saavasam Today Episode: తన దారికి అడ్డు రావొద్దని వస్తే నిన్ను కూడా అడ్డు తొలగించుకుంటానని మనోహరి, మిస్సమ్మకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాల్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి చేసిన దుర్మార్గాలు అన్ని డైరీలో రాశాను ఒక్కసారి ఆ డైరీ చదవండి అని ఆరు అనగానే అమర్‌కు వెంటనే డైరీ గుర్తుకువస్తుంది. ఆరు డైరీ రాస్తున్న విషయం గుర్తు చేసుకుంటాడు అమర్‌. వెంటనే డెస్క్‌ లో  ఉన్న డైరీ తీసుకుని కొంచెం చదివి లేచి బయటకు వెళ్లిపోతాడు. తర్వాత మనోహరి ఇంటికి వస్తుంది. ఆరు గట్టిగా అరుస్తుంది. వినబడినట్లు మనోహరి ఆగిపోతుంది.

ఆరు: నా అస్థికలు తీసుకెళ్లి ఆ ఘోర చేతిలో పెట్టగానే అంతా అయిపోయింది అనుకున్నావు కదా మనోహరి. దేవుడున్నాడు నువ్వు చేసిన పాపాలు, తప్పులు చూసి కూడా నిన్ను ఎలా గెలిపిస్తాడనుకున్నావు. నిన్ను నా జీవితంలోకి రానిచ్చి తప్పు చేశాను. మా ఆయన డైరీ చూశాడు. అందులో నేను రాసిన నిజాన్ని నీ నిజస్వరూపాన్ని ఆయన చదివేశారు. లోపలికి వెళితే మా ఆయన నీకు ఎదురుపడినప్పుడు నీ చుట్టు ఏం జరుగుతుందో.. ఉచ్చు నీ మెడకు ఎలా బిగుసుకుంటుందో నాకు అర్థం అవుతుంది మను.

మనోహరి: ఏయ్‌ అరుంధతి తెగ రెచ్చిపోతున్నావు. ఏంటో తెగ తిట్టుకుంటున్నావని నాకు అర్థం అవుతుంది. కానీ నీ మాట నాకు వినిపించదు. నీ ఏడుపు నాకు కనిపించదు. చూడు ఆత్మగా ఉన్నావు నీకు ఎక్స్‌ఫైరీ డేట్‌ లేదనుకున్నావా? నీ ఎక్స్‌ఫైరీ డేట్‌ సెట్‌ చేసే వచ్చా? రేపు ఈ టైం లోపు నువ్వు ఆ ఘోర చేతిలో గిలగిల కొట్టుకుంటూ ఉంటావు.

ఆరు: వినాశకాలే విపరీతబుద్ది, నీ పతనం మొదలైంది కాబట్టే నువ్వు ఇదంతా చేస్తున్నావు మను.

 అనగానే నా దారికి అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్లడం నాకు అలవాటు.. ముందు నువ్వొచ్చావు.. తర్వాత నా మొగుడు ఇక నీ పిల్లలు  అనగానే ఆరు పిల్లల జోలికి వస్తే నిన్ను చంపేస్తా అంటుంది. మనోహరి లోపలికి వెళ్లిపోతుంది. మిస్సమ్మతో నీది కాని యుద్దాన్ని ఎందుకు చేస్తున్నావు.. నా దారికి అడ్డు తప్పుకుని నీ దారిని నువ్వు వెళ్లు అని వార్నింగ్‌ ఇస్తుంది. అయితే అక్క అస్థికలకు ఏమైనా జరగాలి నిన్ను వదిలిపెట్టను అంటుంది మిస్సమ్మ.  ఆస్థికలు మీరు ఏమైనా చేసుకోండి అని మనోహరి వెళ్లబోతుంటే పైనుంచి అమర్‌ డైరీ పట్టుకుని కిందకు వస్తూ.. ఆగు మనోహరి అని గట్టిగా పిలుస్తాడు. డైరీ చూసిన మనోహరి షాక్‌ అవుతుంది.

అమర్‌: ఆరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు అనుకున్న.. కానీ ఈ డైరీలో నాకు తెలియనివి.. తెలియాల్సినవి చాలా ఉన్నాయి అని నాకు ఈరోజే అర్థం అయింది.

మిస్సమ్మ: మీకు కూడా తెలియనివి తెలియాల్సినవి చాలా ఉన్నాయా? ఏంటండి అవి.

అమర్‌: అది మనోహరి మాత్రమే చెప్పాలి.

ఆరు: ఇవాళ్టీతో ఈ ఇంటికి కమ్ముకున్న చీకటి వీడిపోతుంది. పట్టిన గ్రహణం వదిలిపోతుంది. అందర్నీ కుదిపేసే నిజం ఇవాళ బయట పడనుంది.

మనోహరి: నేను చెప్పాలా? నాకు

అమర్‌: తెలియదని మాత్రం చెప్పకు మనోహరి. నేను చదివాను. ఆరు లేదు చెప్పేవాళ్లు ఎవరూ లేరు నాకు అనుకున్నావా? మనోహరి. మాట్లాడు.

   అంటూ అమర్‌ గట్టిగా మనోహరిని నిలదీస్తాడు. మనోహరి షాక్‌లో ఉంటుంది. ఇంతలో ఆరు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుందని నాకెందుకు చెప్పలేదు అంటూ అమర్‌ అడగ్గానే మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. రిలాక్స్‌గా వెతకడం ఏంటి అని అడుగుతుంది. తన తల్లిదండ్రులు ఎవరో వెతకాలని.. ఒకవేళ తాను లేకపోతే ఈ  విషయం అమర్‌కు చెప్పమని మనోహరికి చెప్పినట్లు డైరీలో రాసి ఉంటుంది. అది చూపిస్తూ నాకెందుకు నువ్వు చెప్పలేదని అమర్‌ అడుగుతాడు. ఏవో మాటలు చెప్పి మనోహరి తప్పించుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: వచ్చే నెల నుంచి షూటింగ్స్‌ బంద్ - ధనుష్‌పై దండెత్తిన నిర్మాతలు, ఎందుకీ గొడవ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget