Nindu Noorella Saavasam Serial Today January 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు ఫోటో ముందు ఎమోషనల్ అయిన అమర్ – అమర్ తో తాడో పేడో తేల్చుకుంటానన్న రామ్మూర్తి
Nindu Noorella Saavasam Today Episode: తన రూంలో ఆరు ఫోటో ముందు నిలబడి అమర్ ఎమోషనల్ అవడంతో ఇవాళ్లీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: కింద పడబోతున్న ఆస్తికలు పట్టుకున్న అమర్ వాటిని అంజుకు ఇచ్చి ఓదార్చుతాడు. అమ్మ ఆస్తికలు నదిలో కలపడం నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ ఇక్కడే ఉంటే నీకు జ్వరం వచ్చినప్పుడు చూస్తూ నిన్ను ఏం చేయలేక బాధపడుతుంది. నీకు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తెలుసుకుని బాధపడుతుంది. అమ్మ అలా బాధపడటం నీకు ఇష్టమా.. ఆస్తికలు నదిలో కలిపితే అమ్మకు తనకు ఇష్టమైన దేవుడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు దేవుడితో మీరు హ్యాపీగా ఉండాలని అడుగుతుంది. మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పగానే అంజు సరే డాడ్ అని ఆస్తికలు అమర్‌కు ఇస్తుంది. గార్డెన్‌లో కూర్చున్న ఆరు నవ్వుతుంది.
గుప్త: ఎందుకు బాలిక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు
ఆరు: ఇన్ని రోజుల పడిన కష్టాలు ఒక లెక్క… ఈ రెండు రోజుల నుంచి పడిన కష్టం ఒక లెక్క గుప్త గారు. విధి మరీ పుట్‌బాల్ అడేసుకుంది
గుప్త: నువ్వంటే మానవ జన్మ ఎత్తితి కాబట్టి నువ్వు కర్మ అనుభవించాలి. కానీ నేను ఏం పాపము చేసితి.. ఆ జ్ఞప్తికి వచ్చింది. నేను నీకు సాయం చేశాను కదా అదే నా కర్మ.
ఆరు: మీకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువగా ఉంది. సరే ఇక్కడ ఉండే మూడు రోజులు బాగా చిల్ అవ్వండి గుప్తగారు. తర్వాత ఆలోచిద్దురు
అంటూ వెంటనే పరుగెత్తుకుని డోర్ దగ్గరకు వెళ్తుంది ఆరు. వెనకే గుప్త పరుగెత్తుకొచ్చి చూస్తుంటాడు. మనోహరి వస్తుంది. పైనుంచి అమర్ ఆస్తికలు తీసుకుని వస్తాడు.
మనోహరి: ఆస్థికలు అమర్ చేతిలో ఉన్నాయేంటి ఎవరు తీసుకున్నారు..?
( అని మనసులో అనుకుని) అమర్ ఆస్తికలు పోయాయి అన్నారు కదా..? ఎవరు తీసుకున్నారు
అమర్: పోలేదు మనోహరి ఇంట్లోనే ఉన్నాయి. అంజు తీసుకుంది
మను: అంజు తీసుకుందా.. ఎందుకు
శివరాం: ఎందుకని అలా అడుగతావేంటి మనోహరి. మళ్లీ ఇంకో సారి వాళ్ల అమ్మను దూరం చేసుకోలేకపోయింది. ఆస్తికలు తన దగ్గర ఉంటే తన తల్లి తనతోనే ఉంటుందేమో అనుకుంది.
మను: ఏదేమైనా.. ఆస్తికలు దొరికాయి.. మూడు రోజులు జాగ్రత్తగా కాపాడితే మళ్లీ గంగలో కలిపేయవచ్చు. ఆరుకు ఘనంగా వీడ్కోలు పలకొచ్చు
నిర్మల: సరే నాన్నా అమ్మాయి ఫోటో తీసుకొస్తాను పూజ చేద్దువు కానీ
అమర్: వద్దు అమ్మా
శివరాం: ఎందుకు అమర్ వద్దంటున్నావు.
అమర్: పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆరు లేదనే బాధను దాటి బతుకుతున్నారు. ఇప్పుడు ఆస్తికలు తీసుకొచ్చాక అంజు ఏం చేసిందో తెలుసు కదా..
భాగీ: అవును మామయ్య పిల్లలు మానసింగా బాధలో ఉన్నారు.
నిర్మల: సరే నాన్నా గదిలోనైనా ఫోటో పెట్టి దీపం పెట్టు
అని నిర్మల చెప్పగానే సరేనని అమర్ ఆస్తికలు తీసుకుని పైకి గదిలోకి వెళ్తాడు. ఆరు ఫోటో ముందు దీపం వెలిగించి ఆస్తికలు ఫోటో ముందు పెట్టి బాధపడుతుంటాడు. ఇంకో రెండు రోజుల్లో ఆరు, అమర్ ల ప్రేమకథ ముగిసిపోతుంది. ఆరు లేకుండా ఈ అమర్ ఏం చేయగలడు. నేను, పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నాం ఆరు.. నువ్వు ఎక్కడున్నా..? హ్యాపీగా ఉండాలి అంటూ ఏడుస్తుంటాడు. పక్కనే నిలబడి అంతా చూస్తున్న ఆరు ఏడుస్తుంది. ఆశ్రమానికి వెళ్లిన రామ్మూర్తికి తన పెద్ద కూతురు గురించి అమరేంద్రకు నిజం తెలుసని వార్డెన్ మాట్లాడటం వింటాడు. వెళ్లి వార్డెన్‌ను గట్టిగా అడిగితే వార్డెన్ పలకదు. దీంతో అమర్‌తోనే తాడోపేడో తేల్చుకుంటానని రామ్మూర్తి వెళ్లిపోతాడు. అదే విషయం వార్డెన్ రాథోడ్‌కు ఫోన్ చేసి చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!