Nindu Noorella Saavasam Serial Today January 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని రెచ్చగొట్టిన కరుణ – మనోహరిని వదిలిపెట్టనన్న భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode January 27th: మనోహరి నాటకం ఆడిందని ఫ్రూవ్ అయితే అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటానని భాగీ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ కోసం ఆశ్రమానికి వస్తుంది కరుణ అప్పుడే భాగీ బుజ్జమ్మను రెడీ చేస్తుంటుంది. ఇంకా రెడీ చేయకపోవడంతో కరుణ కోపంగా భాగీని ఎంత సేపు రెడీ చేస్తావు త్వరగా చేయ్ అంటుంది.
బుజ్జమ్మ: స్కూల్ కు ఇంకా టైం ఉంది కదా అంటీ అమ్మను ఎందుకు తొందరపెడతావు
కరుణ: నువ్వు గిప్పుడు తయారైనక్క స్కూల్ కు పోతలేవు.. ఫస్ట్ నీ ఫ్రెండ్ గదే గా అంజు వాళ్ల ఇంటికి పోతావు
బుజ్జమ్మ: అవునా అమ్మా ఎందుకు..?
కరుణ: ఆ తర్వాత అటు నుంచి అటే స్కూల్‌కు పోతావు
బుజ్జమ్మ: ఓహో నిన్ను అంజు అక్క ఇక్కడికి వచ్చి నన్ను పికప్ చేసకుని స్కూల్‌కు తీసుకెళ్లిందని ఈరోజు నేను అక్కడికి వెళ్లి అక్కను నేను పికప్ చేసుకోవాలా..?
కరుణ: ఈ రోజే కాదు ప్రతిదినం పొద్దుగాలే కొంచెం సేపు ఈవెనింగ్ కొంచెం సేపు ఆ ఇంట్ల స్పెండ్ చేసి రావాలె
బుజ్జమ్మ: ఎందుకమ్మా ఆంటీ ఇలా చెప్తుంది
భాగీ: నీకు వాళ్లంటే ఇష్టం కద బుజ్జమ్మ అందుకే నిన్ను వాళ్ల ఇంటికి పంపించాలి అనుకుంటున్నాను
బుజ్జమ్మ: కానీ అమ్మా నీకు ఆ ఇల్లన్నా..? ఆ మనుషులన్నా ఇష్టం ఉండదని తాతయ్య చెప్పారు
రాజు: అమ్మా బుజ్జమ్మా.. నేను ఊరికే అన్నాను తల్లీ ఇప్పుడు అమ్మే నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లమంటుంది కదా..? ఇంక ఏ సమస్య లేదు నువ్వు హ్యాపీగా ఉండు
బుజ్జమ్మ: థాంక్యూ అమ్మా
భాగీ: ఎందుకు బుజ్జమ్మ థాంక్స్..
బుజ్జమ్మ: నాకు ఇష్టమైన ఇంటికి పంపిస్తున్నందుకు.. అక్కలతో అన్నలతో ఆడుకుంటున్నందుకు
కరుణ: ( మనసులో) ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఆడుకోనికే పంపిస్తలేదు పాప.. ఆ మనోహరితో మీ అమ్మ ఆడుకోనికే పంపిస్తుంది
భాగీ: బాబాయి గారు బుజ్జమ్మను జాగ్రత్తగా తీసుకెళ్లండి
రాజు: అలాగేనమ్మా.. రా బుజ్జమ్మ
అని ఇద్దరూ వెళ్లిపోతారు.
కరుణ: మొత్తానికి నీలో ఉన్న భయాన్ని బొందల పెట్టి ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చనవే..బుజ్జమ్మను ధైర్యంగా ఆ ఇంటికి పంపించినవు..
భాగీ: ఆ మనోహరి స్కెచ్ ఏంటో తెలుసుకోవాలి కదా కరుణ అలాగే బుజ్జమ్మ ఆ ఇంట్లో ఉంటే అమ్ముకు అపాయం అన్న దాంట్లో నిజం ఎంతో తెలుస్తుంది కదా..?
కరుణ: అది నిజం కాదు పక్కా అబద్దం. మనోహరి ఆడుతున్న గేమ్ ఇది
భాగీ: అందుకే నేను ఇప్పుడు ఈ రివర్స్ గేమ్ ఆడుతున్నాను
కరుణ: ఈ ఆట ఏదో ఐదేండ్ల కిందట ఆడి ఉంటే ఇలా దూరం అయ్యే వాళ్లు కాదు కదా..
భాగీ: అప్పుడు అలా ఆలోచించలేకపోయాను. పైగా అమ్ముకు రెండు సార్లు ప్రమాదం జరిగే సరికి నాకు భయం వేసింది
కరుణ: ఈ భయం వల్లే ఆ ఐదు సంవత్సరాలు నష్టపోయావు నీ భర్తకు పిల్లలకు దూరం అయినవ్.. నీ బిడ్డను ఆ తండ్రికి దూరం చేసినవ్.. ఇప్పుడు మీ ఆయన నీ మీద గుస్స అవుతున్నడు
భాగీ: నేను కోల్పోయి నష్టపోయిన దానికి మనోహరి మీద రెట్టింపు ప్రతికారం తీర్చుకుంటాను. ఇదంతా దాని ప్లాన్ అని ఫ్రూవ్ అవ్వాలి. దాన్ని ఊరికే వదిలిపెట్టను..
కరుణ: బరాబర్ ఫ్రూవ్ అవుతుంది చూడు నువ్వే.. మల్లా తిరిగి వచ్చిన నిన్ను వదిలించుకోవడానికి భయపెట్టడానికి ఆ మనోహరి ఈ పాటికే ఏదో ఒక ప్లాన్ షురూ చేసే ఉంటుంది.
అయ్యుండోచ్చు అంటూ మనోహరి రా వెళ్దాం అంటూ కరుణను తీసుకుని బయటకు వెళ్తుంది. ఇక అమర్ ఇంటికి వెళ్లిన బుజ్జమ్మ అంజు రెడీ కావడానకి టైం ఉందని చెప్పగానే నేరుగా అమర్ రూంలోకి వెళ్తుంది. అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. రూంలో ఉన్న తన చిన్ననాటి ఫోటో చూస్తుంది.
బుజ్జమ్మ: ఈ ఫోటో ఎవరిది అండి
అమర్: అది నా చిన్న కూతురు ఫోటో
బుజ్జమ్మ: అవును ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకళ్లు ఉండేవాళ్లంట కదా ఆవిడ ఎక్కడున్నారు.. ( అమర్ ఏమీ పలకడు.) బుజ్జమ్మ ఫ్లీజ్ అండి నాకు తన గురించి తెలియాలి. నేను తనను చూడాలి ఫ్లీజ్
అంటూ బుజ్జమ్మ బతిమాలుతుంటే.. అమర్ కు అరుంధతి ఫ్లీజ్ అండి అంటూ బతిమాలిన విషయం గుర్తుకు వస్తుంది. ఇంతలో బుజ్జమ్మ నేను అరుంధతిని అడుగుతున్నాను చూపించండి అంటూ రిక్వెస్ట్ చేయగానే.. అమర్, భాగీ ఫోటో తీసి బుజ్జమ్మకు ఇస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
ట్రెండింగ్ వార్తలు





















