Nindu Noorella Saavasam Serial Today January 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ఇంటికి వెళ్లిన భాగీ – భాగీని తిట్టిన చంభా
Nindu Noorella Saavasam serial Today Episode January 21st: మనోహరి గురించి నిజం తెలుసుకోవడానికి అమర్ ఇంటికి వెళ్తారు భాగీ, కరుణ. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి గురించి నిజం తెలుసుకోవడానికి అమర్ ఇంటికి వెళ్తారు భాగీ, కరుణ. దీంతో కరుణ ఆశ్చర్యంగా ఇక్కడికి తీసుకొచ్చావేంటని అడుగుతుంది. సరే ఇంట్లోకి వెళ్దాం పద అంటుంది.
భాగీ: నన్ను ఈ ఇంటికి దూరం చేయడానికి మనోహరి కుట్ర చేసిందని నువ్వు అన్నావు కదా..? అది ఎంత వరకు నిజం అనేది తెలుసుకోవాలి
కరుణ: వారెవ్వా మస్త్ ధైర్యం చేసినవే.. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినవ్ నువ్వు ఎప్పుడూ ఇట్లనే ఉషారుగా ఉండాలే
భాగీ: నువ్వు వెంటనే ఇంట్లోకి వెళ్లి మనోహరితో మాటలు కలిపి తన కుట్ర గురించి కూపీ లాగు
కరుణ: అదేంది నాతో నువ్వు కూడా లోపలికి రా ఆ మనోమరి దుమ్ము దులుపుదాం
భాగీ: నేను లోపలికి వస్తే ఆ మనోహరి నోరు విప్పదు. దాని మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను బయట ఉండాలి కరుణ
కరుణ: ఇది కూడా మంచిదే సరే నేను లోపలికి వెళ్లి వస్తాను నువ్వు గీన్నే భద్రంగా ఉండు (భాగీ, కరుణకు వీడియో కాల్ చేస్తుంది.) అబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారబ్బా
భాగీ: వీడియో కాల్ చేశాను. నేను లోపల జరిగేదంతా లైవ్‌లో చూస్తాను
కరుణ: ఓ పిల్లా నీ మెదడు మస్త్ పని చేస్తుందిలే.. ఇదే ఊపు మీద ఉండు.. ఆ మనోహరిని బొందలగడ్డలో పాతిపెడదాం..
భాగీ: సరే నువ్వు జాగ్రత్తగా వెళ్లు.. మనోహరికి ఏమాత్రం డౌటు రాకుండా మానేజ్ చేయ్ తనతో కాస్త జాగ్రత్త తను ఆవలిస్తే పేగులు లెక్కపెడుతుంది
కరుణ: అది ఆవలిస్తే పేగులు లెక్కపెట్టుడు కాదు. నేనైతే ఆవలిస్తే పేగులు బయటకు తీస్తా.. నా గురించి నువ్వు ఫికర్ చేయకు పోయి వస్తా
అంటూ కరుణ వీడియో కాల్‌లో అంతా చూపిస్తూ వెళ్తుంటుంది. వీడియో ఇళ్లంతా చూస్తున్న భాగీ ఎమోషనల్ అవుతుంది. కరుణ ఇంట్లోకి వెళ్లగానే.. చంభా వస్తుంది.
చంభా: ఏయ్ ఎవరు నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చావు
కరుణ: నేను యాదమ్మ నన్ను గుర్తు పట్టలేదా..?
చంభా: నువ్వు అంటే ఎవరు..? ఎందుకు వచ్చావు..?
భాగీ: ఎప్పుడూ సాప్ట్‌గా మాట్లాడే యాదమ్మ ఇంత రాష్‌గా మాట్లాడుతుందేంటి..?
కరుణ: నేను కరుణను భాగీ కోసం వచ్చిన
చంభా: ఆవిడ గారు ఈ ఇంట్లోంచి వెళ్లిపోయి ఐదు సంవత్సరాలు అయింది. ఆవిడకే ఈ ఇంట్లో దిక్కు లేదు. మళ్లీ తన కోసం నువ్వు వచ్చావా..?
భాగీ: యాదమ్మ నా మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. ఏమైంది తనకు
చంభా: ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు ఈ ఇల్లేదే నీ సొంత ఇల్లు అయినట్టు వచ్చేశావు..
మను: యాదమ్మ తన పేరు కరుణ భాగీ బెస్ట్ ఫ్రెండ్.. హాయ్ కరుణ.. నేను అరుంధతికి ఎంతో భాగీకి కరుణ అంత.. అరుందతి వల్ల నాకు ఈ ఇంట్లో ఎలాంటి రైట్స్ ఉన్నాయో.. భాగీ వల్ల ఈ కరుణకు అవే రైట్స్ ఉన్నాయి.
కరుణ: నేను మీ అంత గొప్పదాన్ని కాదులేండి.. మీరు ఇప్పుడు ఈ ఇంటికి ఓనరు అయ్యుండ్రు
మను: ఇంకా నేను ఓనరు కాలేదు కరుణ మీ ఫ్రెండ్ వెళ్లినప్పటి నుంచి అమరేంద్రను పిల్లలను ఈ ఇంటిని ఒక కేర్ టేకర్ లాగా చూసుకుంటుంన్నాను
కరుణ: బయట అందరూ ఈ ఇంట్లో హావా మొత్తం నీదే అంటున్నారు
చంభా: ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు
మను: ఇంకెందుకు వస్తుంది. బాగీ కోసం వచ్చి ఉంటుంది. భాగీ ఎక్కడుంది..? ఎలా ఉంది..? ఎప్పుడు తిరిగి వస్తుందని అడగడానికి వచ్చి ఉంటుంది. అంతే కదా కరుణ
చంభా: ఆవిడ గారు ఈ ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు.. ఎక్కడుందో… ఎప్పుడొస్తుందో..? మాకెలా తెలుస్తుంది
కరుణ: నేను ఆ విషయం అడగడానికి రాలేదు నేను భాగీని చూసినా
అని కరుణ చెప్పగానే.. మనోహరి, చంభా షాక్ అవుతారు. కట్ చేస్తే.. బయట గేటు దగ్గర భాగీ నిలబడి ఉంటుంది. అప్పుడే అమర్ వస్తాడు. లోపలికి వెళ్లి కారు దిగిన అమర్ బయటకు వచ్చి భాగీని పిలుస్తాడు. భాగీ భయంగా తిరిగి చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















