Nindu Noorella Saavasam Serial Today January 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కుటుంబాన్ని రౌండప్ చేసిన ఘోర – కాపాడమని గుప్తను వేడుకున్న ఆరు
Nindu Noorella Saavasam Today Episode: ఘోర అనుకున్నట్టే రాథోడ్ చేత అమర్ కార్లను తన ప్లేస్‌కు రప్పించుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today January 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కుటుంబాన్ని రౌండప్ చేసిన ఘోర – కాపాడమని గుప్తను వేడుకున్న ఆరు nindu Noorella Saavasam serial today episode January 20th written update Nindu Noorella Saavasam Serial Today January 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కుటుంబాన్ని రౌండప్ చేసిన ఘోర – కాపాడమని గుప్తను వేడుకున్న ఆరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/ed8bad81ff820f74e051ee4513738bf91737340533903879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: తనకున్న కొంచెం టైంను తన కుటుంబంతో గడపాలనుకుంటుంది ఆరు. అందుకోసం గుప్తను అడుగుతుంది. అయితే మనం కూడా కాశీ వెళ్దామని అక్కడి నుంచి నేరుగా మా లోకం వెళ్లిపోదాం అంటాడు గుప్త సరే అంటుంది ఆరు. ఇంతలో రాథోడ్ స్పీడుగా కారేసుకుని వస్తాడు. విచిత్రంగా చూస్తూ వెళ్తాడు. గార్డెన్‌లో ఆరు వైపు నవ్వుతూ చూస్తాడు. దీంతో ఆరు అనుమానంగా మనం రాథోడ్‌కు కనిపిస్తున్నామా గుప్త గారు అని అడుగుతుంది. రాథోడ్ లోపలకి వెళ్తాడు.
రాథోడ్: గుడ్ మార్నింగ్ సార్ వెహికిల్స్ ఆల్ రెడీ
భాగీ: రాథోడ్ ఈ బ్యాగులు అన్ని కార్లలో పెట్టు
మనోహరి: అమర్ ప్రాణాలకు తెగించి అయినా ఆరును ఆస్థికలను కాపాడతాడు. కానీ ఘోర అంతకన్నా ఎక్కువ కసితో ఉన్నాడు. ఎలాగైనా అమర్ కు విషయం చెప్పాలి
అని మనసులో అనకుంటుంది. ఇంతలో అమర్ అస్థికలు తీసుకుంటుంటే
భాగీ: ఏవండి ఆస్తికలు నేను తీసుకొస్తాను మీరు వెళ్లండి.
అమర్: అలాగే అమ్మా నాన్నాలను త్వరగా రమ్మని చెప్పు
భాగీ: అలాగేనండి..
అమర్ వెనకాలే మనోహరి వెళ్తుంది.
మనోహరి: అమర్ నాకెందుకో ఆ ఘోర మనల్ని అడ్డుకోవడానికి ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది.
అమర్: ఏమైనా అంటే
మను: మనల్ని ఆపడానికి పూజలు చేయడం.. తంత్రాలు చేయడం.. మనుషుల్ని తీసుకొచ్చి అటాక్ చేయడం లాంటివి చేయోచ్చు
అమర్: వాడు ఇప్పటి వరకు నాకు ఎదురుపడలేదు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి. నువ్వు అన్నట్టు వాడు ఈసారి ఎదురుపడితే వాడి ఆటలు సాగనివ్వను
మను: నాకు తెలుసు అమర్ కానీ ఎందుకైనా మంచిది ఎవరైనా సెక్యూరిటీని తీసుకుందామని
రాథోడ్: మీకంతా ప్రాణభయంగా ఉంటే ఇంట్లోనే ఉండిపోండి..
మను: నువ్వేంటి అలా మాట్లాడావు
రాథోడ్: ఎలా మాట్లాడాను మనోహరి గారు. ఘోరాకు మీరు భయపడి మా సారును కూడా భయపెడుతున్నారా..?
ఇంతలో ఇంట్లోంచి అందరూ వస్తారు.
భాగీ: ఏవండి ఇక మనం బయలుదేరుదామా..?
అమర్: సరే వెళ్దాం పదండి..
అందరూ వెళ్లి కార్లు ఎక్కుతుంటే..
భాగీ: అయ్యో ఆరు అక్కా ఫోటో మర్చిపోయాను.. తీసుకొస్తాను
మను: మిస్సమ్మ నువ్వు వెళ్లి కారెక్కు.. నేను తీసుకొస్తాను.
భాగీ: నేనే తీసుకొస్తాను మనోహరి గారు.
అంటూ భాగీ లోపలికి వెళ్లగానే నిజం తెలిసిపోతుందేమోనని భయపడుతుంది. ఇంతలో ప్యాక్ చేసిన ఫోటో తీసుకుని భాగీ రావడంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. అందరూ కార్లలో బయలుదేరుతారు. మనోహరి టెన్షన్ పడుతుంది.
మను: అనవసరంగా వాడిని నమ్ముకుని తప్పు చేశాను.
అని మనసులో అనుకుంటుంది.
శివరాం: ఏంటి మనోహరి అంతలా టెన్షన్ పడుతున్నావు
నిర్మల: కారు ఎక్కిన్నప్పటి నుంచి బయపడుతున్నావేంటి మనోహరి.
భాగీ: అదేంటండి రాథోడ్ అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడు.
అమర్: ఏమో నాకు ఆశ్చర్యంగా ఉంది.
భాగీ: ఎవండి ఎయిర్ ఫోర్ట్ కు వెళ్లేది ఇటు కదా రాథోడ్ అటు వెళ్తున్నాడేంటి..? ఏమైనా షార్ట్ కట్‌లో వెళ్తున్నాడా..?
అమర్: ఏమో నాకు చెప్పకుండా రూట్ మార్చడు
అంటూ అమర్, రాథోడ్ కారును ఓవర్ టేక్ చేస్తాడు. రాథోడ్ కారు ఆపి స్పృహ కోల్పోయినట్టు ఉంటాడు. అమర్ దగ్గరకు వెళ్లగానే గొంతు పట్టుకుని చెట్టు దగ్గరకు తీసుకెళ్లి చంపబోతుంటే.. ఇంతలో ఘోర వస్తాడు. రాథోడ్ కింద పడిపోతాడు. ఘోర ఆస్తికలు ఇస్తే వెళ్లిపోతాను అంటాడు. అందరూ భయపడుతుంటారు. అక్కడికి వచ్చిన ఆరు భయంతో గుప్తను ఏదైనా చేయండి అంటూ ప్రాధేయపడుతుంది. ఏమీ చేయలేమని గుప్త చెప్పగానే ఆరు షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)