Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఘోరాను తిట్టిన మనోహరి – తన బలం చూపించిన ఘోర
Nindu Noorella Saavasam Today Episode: అమర్ చేతిలోంచి తప్పించుకుని వచ్చిన ఘోరాను మనోహరి తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఘోరాను తిట్టిన మనోహరి – తన బలం చూపించిన ఘోర nindu Noorella Saavasam serial today episode January 17th written update Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఘోరాను తిట్టిన మనోహరి – తన బలం చూపించిన ఘోర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/17/dd0111275b2d52d358e8603bd891bee81737079277969879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: ఒక పాడుబడిన బంగ్లాలోకి వెళ్లిన అంజును ఘోర బంధించి ఆరు ఆత్మను బంధించాలని మంత్రాలు చదువుతుంటే అమర్ వచ్చి ఘోరాను కొట్టి అంజును సేవ్ చేస్తాడు. అంజు నుంచి ఆరు బయటకు వస్తుంది. అంజు స్పృహ తప్పి పడిపోతుంది. కింద పడిపోయిన అంజును చూసి రాథోడ్, రామ్మూర్తి, ఆరు బాధపడుతుంటారు.
ఆరు: ఐయామ్ సారీ అంజు చిన్నప్పుడు నేను కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు నాన్నతో ఉండి అవన్నీ తీర్చుకుందామనుకుంటూ.. అదంతా నా స్వార్తం అమ్మా కానీ ఇలా జరగుతుందని నాకు తెలియదు
అంజు మీద వాటర్ చల్లగానే.. స్పృహలోకి వస్తుంది.
అంజు: డాడ్ నేనేంటి ఇక్కడున్నాను.. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు..
రామ్మూర్తి: అదేంటి అంజు పాప నువ్వే కదా..
అమర్ చెప్పొద్దని సైగ చేస్తాడు. రాథోడ్ కు అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లు అని చెప్తాడు. రాథోడ్ అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లి మిస్సమ్మకు ఫోన్ చేసి అంజు దొరికిందని చెప్తాడు. మిస్సమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. పొద్దునుంచి కాలు చేయి ఆడలేదు.. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు అంటుంది. రామ్మూర్తి: బాబు గారు అసలు ఏమవుతుంది.. నేను ఇంట్లో ఉండగా అంజు పాప రావడం ఏంటి..? మేము ఇద్దరం బట్టలు కొనడానికి షాపుకు వెళ్లడం ఏంటి..? ఆ ఘోర మా వెంట పడటం ఏంటి..? ఇంత జరిగాక అంజలి పాప ఇప్పుడు లేచి నేను ఇంట్లో కదా ఉండాల్సింది.. ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతుంది. అసలు ఏం జరగుతుంది బాబుగారు
అమర్: అర్తం అయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆరు ఆత్మ ఇంకా భూమ్మీద ఉందని మీకు తెలుసు కదా..?
రామ్మూర్తి: తెలుసు బాబు అమ్మాయికి మోక్షం కలగాలనే కదా.. రేపు కాశీకి వెళ్దాం అనుకున్నాం
అమర్: ఇవాళ మీ ఇంటికి వచ్చింది. మీతో మాట్లాడింది. మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. మీతో చీర కొనిపించింది. మీ కన్నీళ్లు తుడిచింది. మిమ్మల్ని నవ్వించింది. అంజు కాదు.
రామ్మూర్తి: అంజు కాదా..? మరి ఇవన్నీ చేసింది ఎవరు…
అమర్: మీ కూతురు అరుంధతి.. అవును అరుంధతి, అంజలి రూపంలో మీతో గడపలేని క్షణాలను చూడలేని సంతోషాలను పొందడానికి వచ్చింది.
అని అమర్ చెప్పగానే.. అంజు తనను మాటి మాటికి నాన్నా అనడం.. మీ కూతుర్ని కదా అనడం గుర్తు చేసుకుంటాడు రామ్మూర్తి.
రామ్మూర్తి: బాబు గారు మీరు చెప్తుంది నిజమా
అమర్: అవును కానీ ఎలా అంటే మాత్రం నా దగ్గర సాక్ష్యం లేదు. కానీ అంజలిలో ఇంతసేపు ఉన్నది ఆరు ఆత్మనే..
అని అమర్ చెప్పగానే రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. నా బిడ్డను మళ్లీ నేను దూరం చేసుకున్నాను అని ఏడుస్తుంటాడు రామ్మూర్తి. మరోవైపు ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి ఇది నీవల్ల కాదని నాకు తెలుసు. అమర్ వచ్చే లోపు నువ్వు పారిపోయావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేది. నువ్వు దొరికితే నా పరిస్థితి ఏంటో నీకు అర్తం అవుతుందా.? నువ్వు ప్రయత్నించింది చాలు. ఇక ఆపేయ్ అంటుంది. దీంతో ఘోర కోపంగా.. ఆ ఆత్మ దొరికే వరకు ప్రయత్నిస్తాను. నాదృష్టిలో ఓటమి అంటే చావే.. నా బలం బలగం చూడు మనోహరి అంటూ మరికొంత మంది ఘోరాలను పిలిచి మనోహరికి చూపిస్తాడు ఘోర. వాళ్లను చూసిన మనోహరి ఆశ్చర్యపోతుంది. ఇంటికి వచ్చిన అంజును నిన్న అంతా ఏం జరిగిందో చెప్పమని భాగీ అడుగుతుంది. నాకు ఏమీ గుర్తు రావడం లేదని అంజు చెప్తుంది. ఆ మంత్రగాడే ఏదో చేసి ఉంటాడని అందుకే అంజు అంతా మర్చిపోయిందని అంటుంది నిర్మల. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)