Nindu Noorella Saavasam Serial Today December 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని భ్రమలో బతకొద్దన్న అమర్ - అమర్‌కు షాక్ ఇచ్చిన బేబీ
Nindu Noorella Saavasam serial Today Episode December 5th: కడుపులో బేబీ మాట్లాడుతుందన్న భ్రమలో బతకొద్దని భాగీకి చెప్తాడు అమర్. ఇంతలో బేబీ అమర్‌తో మాట్లాడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అడవిలోనే భాగీని చంపేయాలనుకున్న మనోహరికి భాగీ ఊబి ముందు నిలబడటం చూసి హ్యాపీగా ఫీలవుతుంది. వెనక నుంచి వెళ్లి భాగీని ఊబిలోకి తోసేయాలని ట్రై చేస్తుంది. ఇంతలో భాగీ పక్కకు తప్పుకోవడంతో మనోహరి ఊబిలోకి పడిపోతుంది. దీంతో మనోహరి భయంగా గట్టిగా ఏడుస్తుంది. భాగీ నన్ను కాపాడు అంటూ అరుస్తుంది.
మను: భాగీ ఇది ఊబిలా ఉంది బయటకు రాలేకపోతున్నాను.. లోపలికి కూరుకుపోతున్నాను.. నన్ను ఎలాగైనా కాపాడు భాగీ ఫ్లీజ్ భాగీ దండం పెడతాను నన్ను ఎలాగైనా కాపాడు భాగీ..
భాగీ: వెనక నుంచి రౌడీలు వస్తున్నారా..? ఎవరూ రావడం లేదు.. అయినా ఇంత స్పీడుగా ఎలా పడిపోయింది. ( మనసులో అనుకుంటుంది.) సరే సరే ఉండు మనోహరి ఎలాగైనా బయటకు లాగుతాను
చంభా: ( మనసులో) తన స్వార్థం కోసం ఎంతో మందిని చంపింది. తన చావు తను చావనివ్వు.. ఇప్పుడు నేను కాపాడటానికి వెళితే నన్ను కూడా ఊబిలోకి లాగేస్తుంది. అమ్మో నేను వెళ్లకపోవడమే మంచిది
ఆరు, గుప్త వస్తారు. ఆరు కంగారు పడుతుంది. భాగీ ఒక కర్ర సాయంతో మనును బయటుక లాగాలని చూస్తుంది.
భాగీ: ఇది పట్టుకో మనోహరి
మను: భాగీ ఇంకొంచెం ముందుకు వెయ్.. ఇంకెంచెం వేయ్ నాకు అందడం లేదు..
భాగీ: అయ్యో మనోహరి నా వల్ల కావడం లేదు..
మను: నన్ను కాపాడు భాగీ ఫ్లీజ్ ఎలాగైనా కొంచెం గట్టిగా విసురు ఫ్లీజ్
భాగీ గట్టిగా విసరగానే.. మనోహరి ఆ కర్రను పట్టుకుంటుంది.
మను: గట్టిగా లాగు భాగీ
భాగీ: నా వల్ల కావడం లేదు భాగీ కడుపులో తిప్పినట్టు అవుతుంది
మను: లాగు భాగీ లేదంటే లోపలికి కూరుకుపోతున్నాను
అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వచ్చి కర్రను పట్టుకుంటాడు.
భాగీ: ఏవండి టైంకు వచ్చారు త్వరగా మనోహరిని కాపాడండి
అమర్: మనోహరి టెన్షన్ పడకు నీకేం కాదు.. త్వరగా బయటకు వచ్చేయ్..
అని మనోహరిని ఊబిలోంచి లాగుతాడు. బయటకు వచ్చిన మనోహరి ఏడుస్తూ..
మను: థాంక్యూ అమర్ టైంకు నువ్వు రాకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేదాన్ని
అమర్: ఇట్స్ ఓకే ఈ ప్లేస్ లో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు. మనోహరి అక్కడ సెలయేరు ఉంది నువ్వు వెళ్లి వాష్ చేసుకుని వచ్చేయ్
మను: సరే అమర్.. (మనసులో ఒసేయ్ చంభా నేను ఊబిలో కూరుకుపోయి చచ్చిపోయేలా ఉన్నా దగ్గరకు వచ్చి కాపాడలేదు కదా..? చెప్తా నీ సంగతి)
అనుకుంటూ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది.
గుప్త: చూశావా బాలిక ఆ దుష్ట బాలికను దేవుడు శిక్షించాలని చూసినా నీ పతి దేవుడు.. నీ సహోదరి కలిసి రక్షించారు.
ఆరు: పోనీలెండి గుప్త గారు ఆ మనోహరికి దేవుడు ఇంకా చావు రాయలేదేమో..?
అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కార్ల దగ్గర అందరూ అమర్, భాగీల కోసం ఎదురుచూస్తుంటారు.
తర్వాత ఇంటికి వెళ్లిపోయాక భాగీ రూంలో బట్టలు సర్దుతుంది. అమర్ వెళ్లి బేబీ మాట్లాడుతుందన్న భ్రమలోంచి బయటకు రా అని చెప్తాడు. కానీ భాగీ మాత్రం బేబీ మాట్లాడటం నిజం అని చెప్తుంది. ఇంతలో బేబీ అమర్‌ను నాన్న అని పిలుస్తుంది. ఆ పిలుపునకు అమర్ షాక్ అవుతాడు. వెంటనే భాగీ మన బేబీ మిమ్మల్ని పిలుస్తుందండి అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















