Nindu Noorella Saavasam Serial Today December 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని చంపబోయిన రౌడీ – భూలోకం వచ్చిన ఆరు, గుప్త
Nindu Noorella Saavasam serial Today Episode December 3rd: ఫారెస్టులో భాగీ దగ్గరకు వెళ్లిన రౌడీ కత్తితో భాగీని చంపబోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: పారెస్టులో భాగీ వాళ్లు ఎవరికి వారే చెల్లాచెదురై పోతారు. వెనకాలే రౌడీలు తరుముతుంటే.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెడుతుంటారు. కింద తన కుటుంబం కష్టాల్లో ఉన్న విషయం ఆరుకు అర్థం అవుతుంది. గుప్త దగ్గరకు వెళ్లి తనకు మనసు భారంగా ఉందని తన వాళ్లు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారని చెప్తుంది. దీంతో గుప్త మాయాదర్పణం చూస్తాడు. అందులో అందరూ ఫారెస్టులో పరుగెడుతున్న దృశ్యం కనిపిస్తుంది. అది చూసి ఆరు భయపడుతుంది.
గుప్త: నీ మనసుకు ఎంతటి మహత్తు ఉన్నది బాలిక. జరుగుచున్నది మేమే పసిగట్టలేకపోయాము. నీ మనసుకు ఎలా తెలిసింది
ఆరు: వాళ్లను కాపాడాలి గుప్త గారు నన్న వెంటనే కిందకు పంపించండి.
గుప్త: నువ్వు వెళ్లి ఏమీ చేయుదువు బాలిక నీకిప్పుడు ఎటువంటి శక్తులు లేవు కదా..?
ఆరు: అవునా అయితే మీరైనా కాపాడండి..
గుప్త: ఈ విషయమున మేము కూడా అశక్తులమే బాలిక. ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే మేము ఏమీ చేయలేము.. చేయకూడదు.
ఆరు: అయితే నన్ను కిందకు పంపించండి
గుప్త: నీకు శక్తులు లేకుండా నువ్వు ఏమి చేయుదువు బాలిక.
ఆరు: నేను మా వాళ్లతో ఉన్నప్పుడు వాళ్లకు మంచి జరిగింది గుప్త గారు. నేనేం చేయకపోయినా పర్వాలేదు. నేను వాళ్లతో ఉంటే వాళ్లకు మంచే జరుగుతుంది.
గుప్త: అది నీ ఊహ మాత్రమే బాలిక. ఎటుల జరుగునో అటులే జరుగును. నువ్వు ఈ విషయం వదిలివేయుము..
ఆరు: మా వాళ్లు ఆపదలో ఉంటే ఎలా వదిలేయగలను. నా చెల్లెలు నిండు గర్బిణి గుప్త గారు. ఈరోజో రేపో ప్రసవిస్తుంది. తన కష్టం చూసి కూడా మీ మనసు కరగటం లేదా..? నా పిల్లుల చాలా చిన్న పిల్లలు వాళ్లు అలా అడవిలో అంతలా కష్టపడుతుంటే మీ కళ్లు చెమ్మగిల్లడం లేదా..? ఆ వయసులో మా నాన్న కడుపుతో ఉన్న కూతురు కోసం మనవళ్లు, మనవరాళ్ల కోసం పడుతున్న ఆరాటం కనబడటం లేదా..? వాళ్లకు తోడుగా మా ఆయన కూడా లేరు.
గుప్త: మేమేమీ చేయలేము బాలిక.
ఆరు: మీరు చేయగలరు గుప్త. నన్ను కిందకు పంపిచేయవచ్చు కదా..? ఫ్లీజ్ గుప్త గారు ఇది ఒక చెల్లి తన అన్నయ్యను అడుగుతుంది అనుకోండి.
గుప్త: ప్రభువుల వారి ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయలేను బాలిక.
ఆరు: ఫ్లీజ్ గుప్త గారు నాకు వేరే దారి లేదు. ఇప్పుడు మీరు తప్పా నాకు వేరే దిక్కు లేదు. నాకు ఎంతో సాయం చేశారు. ఇప్పుడు కూడా ఇదొక్క సాయం చేయండి ఫ్లీజ్ గుప్త గారు
గుప్త: అటులనే బాలిక. కానీ నిన్ను ఒంటరిగా పంపించుటకు మా మనసు ఒప్పుకోవడం లేదు. నీతో మేము వచ్చెదము
ఆరు: మీరు కూడా వస్తారా..? చాలా థాంక్స్ గుప్త గారు.
గుప్త: అవును ప్రభువుల వారు నన్ను ఏమనుకున్నను పర్వాలేదు. ఎటువంటి దండన విధించినను ఒక సోదరునిగా నీ కష్టమున పాలు పంచుకొనదెను. నీతో మేము భూలోకం వచ్చెదము.. బాలిక ఈ రూపమున కాదు.. అరుంధతి రూపంలో వెళ్లాలి
అని చెప్పి ఆరును మార్చేసి ఇద్దరూ కలిసి భూలోకం వెళ్తారు. అప్పటికే రౌడీ తరుముతుండటంలో భాగీ ఫారెస్ట్ లో పరెగెడుతుంది. ఒక దగ్గరకు వెళ్లాక పరుగెత్తలేక కూర్చుంటుంది. ఇంతలో రౌడీ వచ్చి దొరికావే అంటూ కత్తితో చంపబోతుంటే.. అప్పుడే అక్కడకు పులి వస్తుంది. పులిని చూసిన రౌడీ పారిపోతాడు. పులి భాగీ వైపు వస్తుంది. భాగీ భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















