అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  పిల్లలను రెచ్చగొట్టిన మనోమరి -  అంజు కిడ్నాప్‌కు అరవింద్‌ కొత్త ప్లాన్‌  

Nindu Noorella Saavasam Today Episode:  అంజును కిడ్నాప్‌ చేసేందుకు అరవింద్‌ కొత్త ప్లాన్‌ ఆలోచిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:    ముగ్గు వేస్తున్న భాగీ దగ్గరకు ఆరు వెళ్లి నిన్న  మీ ఇంట్లో జరిగిన సంఘటన తెలిసింది. అంత మందిని ఎలా కొట్టావు అని అడుగుతుంది. అవసరం నేర్పించింది అక్కా.. పిల్లల కోసం కొద్ది రోజుల నుంచి సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకుంటున్నాను అంటుంది భాగీ.  నీ లాంటి కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టం. నీ ప్లేస్‌లో ఎవరున్నా ఇంత ధైర్యం చేయలేరని ఆరు వెళ్లిపోతుంది. అమర్‌ ఆఫీసుకు వెళ్తుంటే..

భాగీ: ఏదైనా చెప్పాలా అండి

అమర్: థాంక్స్‌ మిస్సమ్మ.. నువ్వు చేసిన పనికి థాంక్స్‌ చెప్పి సరిపెట్టలేను. ఇంకేం చేయాలో తెలియదు.

భాగీ: ఏంటండీ ఈ మాటలు నా పిల్లలను నేను కాపాడుకోవడం నా బాధ్యత. నేను నిలబెట్టుకోవాల్సిన నమ్మకం. ఆరు అక్క నా మీద పెట్టుకున్న నమ్మకం. నేను ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినప్పుడే అక్క నాకు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత అప్పగించింది అండి. పిల్లల గురించి అత్తయ్య, మామయ్యల గురించి మీరేం టెన్షన్‌ పెట్టుకోకండి.

అమర్‌: మిస్సమ్మ నాకు ఎదురు వస్తావా..?

అని అమర్‌ అడగ్గానే మనోహరి కోపంగా ఫీలవుతుంది. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది.  మిస్సమ్మ ఎదురు రాగానే అమర్‌ వెళ్లిపోతాడు. అరవింద్‌ కోపంగా తన మనుషులను కొడుతుంటాడు.

అరవింద్‌: ఒక ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిని పారిపోయి వస్తారా..?

వినోద్‌:  అన్న అమరేంద్ర తన పెళ్లాన్ని షేర్‌ లా తయారు చేశాడు. ఆ ముసలోడేమో గన్‌ పట్టుకుని వచ్చాడు. ఇక అమరేంద్రను గెలవాలంటే అతనొక్కడే కాదు అతని పెళ్లాం కూడా ఇంట్లో ఉండకూడదు.

అరవింద్‌: అయితే  పిల్లల్ని కిడ్నాప్‌ చేయాలంటే కొత్తగా ఆలోచించాలి.

అని మాట్లాడుకుటుండగా ఒక వ్యక్తి వచ్చి స్కూల్‌ లో ఎంక్వైరీ చేసి వచ్చాను. రేపు పిల్లలను ఎక్స్‌కర్షన్‌ కు తీసుకెళ్తున్నారట అని చెప్తాడు.  దీంతో వినోద్‌ వాళ్లను పోలీసులకు లొంగిపోమ్మని అరవింద్‌ చెప్తాడు. తర్వాత పిల్లలను ఎలా కిడ్నాప్‌ చేసేది చెప్తాడు అరవింద్‌.  ఎక్స్‌కర్షన్‌ గురించి పిల్లలు ఆలోచిస్తుంటారు.

ఆనంద్‌: డాడీ ఇంకా ఆ రౌడీలను పట్టుకోలేదేమో అక్కా..

అంజు: మేడంకు కాల్ చేసి మీరు కూడా రావడం లేదని చెప్పు అమ్ము

  మరోవైపు ప్రిన్సిపాల్‌ అమ్మును సైడ్‌ చేసి ఎక్స్‌కర్షన్‌కు బంటిని అటెండ్‌ చేస్తే తనకు హెడ్‌ ఫోన్స్‌ వస్తాయి. కానీ అమ్మును ఎలా సైడ్‌ చేయాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో అమ్ము ఫోన్‌ చేసి తాము ఎక్స్‌ కర్షన్‌కు రావడం లేదని చెప్తుంది. దీంతో బంటి, ప్రిన్సిపాల్‌ హ్యాపీగా ఫీలవుతారు. ఎక్స్‌ కర్షన్‌ క్యాన్సిల్‌ అయిందని అంజు డాన్స్‌ చేస్తుంది.

అంజు: దేవుడు చూస్తూ ఊరుకుంటాడా..? ఏంటమ్మా ఏంటి నన్ను వదిలేసి ఎక్స్‌ కర్షన్‌కు వెళ్తారా..? ఇప్పుడు వెళ్లండి.. బట్టలు సర్దుకోండి ప్లానింగ్‌ వేసుకోండి. అమ్ము: మేము వెళ్లంది దేవుడి వల్ల కాదు. ఆ రౌడీల వల్ల. వాళ్లు నిన్ను కిడ్నాప్‌ అటెంప్ట్‌ చేయకపోయినా.. నిన్న అటాక్‌ చేయకపోయినా మేం కచ్చితంగా వెళ్లి ఉండేవాళ్లం.

అంజు: చూడండి అమ్ము ఏం జరిగిన నా మంచి కొసమే జరగుతుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇంట్లోనే ఉండండి.

  చాటు నుంచి వింటున్న మనోహరి.. వీళ్లను ఎక్స్‌కర్షన్‌కు పంపించేలా చేయాలని అప్పుడే పిల్లలకు నేను దగ్గరై.. ఆ మిస్సమ్మ కు పిల్లలను దూరం చేయోచ్చు అని మనసులో అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి మీ డాడీ ఆ రౌడీలను పట్టుకున్నాడట.. మీరు ఇక ఎక్స్‌ కర్షన్‌కు వెళ్లొచ్చు అని చెప్తుంది. అయితే ఈవిషయం వెంటనే మిస్సమ్మకు చెప్తామని పిల్లలు ఆ రూంలోంచి కిందకు వెళ్లిపోతారు. పిల్లల చేష్టలకు మనోహరి షాక్‌ అవుతుంది. తాను కూడా కిందకు వెళ్తుంది.

అమ్ము: మిస్సమ్మ నిన్న మన ఇంట్లో అటాక్‌ చేసిన వాళ్లు దొరికారట కదా..?ఇక మేము ఎక్స్‌ కర్షన్‌కు వెళ్లొచ్చా..?

భాగీ: దొరికారు కానీ..

మనోహరి: ఏంటి మిస్సమ్మ అటాక్‌ చేసిన వాళ్లు దొరికాక ఇంకా పిల్లల ఆనందానికి అడ్డుపడుతున్నావా..? ఏంటి పిల్లల దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈ నాటకాలు ఆడుతున్నావా..?

శివరాం: ఏం మాట్లాడుతున్నావు మనోహరి. మిస్సమ్మ పిల్లలకు తల్లి. తల్లి బిడ్డల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న అవసరం లేదు

భాగీ: పరిస్థితులు సర్దుమణిగాక అందరం కలిసి బయటకు వెళ్దాం.

మనోహరి:  ఫ్రెండ్స్‌ తో వెళ్లడం వేరు మనతో వెళ్లడం వేరు

అని మనోహరి చెప్పగానే అంజు అయినా మిస్సమ్మను రిక్వెస్ట్‌ చేయడం ఏంటి..? మనం డాడీతో మాట్లాడుదాం డాడీ ఓకే అంటే ఇంకెవరి పర్మిషన్‌ మనకు అవసరం లేదంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget