Nindu Noorella Saavasam Serial Today December 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: యమలోకానికి ఆరు పయనం – అస్థికలు గంగలో కలిపేందుకు అమర్ సిద్దం
Nindu Noorella Saavasam Today Episode: ఇక నీ ఆస్తికలు గంగలో కలపడం కాయం నువ్వు మా లోకానికి రావడం కాయం అని గుప్త చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: స్వామిజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న అమర్ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో భాగీ వచ్చి ఓదారుస్తుంది. ఆరు పక్కనే ఉన్నా చూడలేకపోయాను అంటాడు. రూంలో పిల్లలు కూడా స్వామిజీ మాటలు గుర్తు తెచ్చుకుని అమ్మ ఇక్కడే ఉందంటే మనల్ని చూస్తుంటుంది కదా అనుకుంటారు. మన ఆటలు, మన బాధలు అన్ని అమ్మ చూసే ఉంటుంది అనుకుంటూ ఏడుస్తుంటారు. మరోవైపు నిర్మల, శివరాం, రాథోడ్ కూడా ఆరును గుర్తు చేసుకుని బాధపడుతుంటారు.
నిర్మల: ప్రాణం పోయాక కూడా పక్కనే ఉండి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది చూశారా అండి నా కోడలిని
రాథోడ్: ఇన్ని రోజులు ఈ ఇంటికి వస్తున్న ప్రమాదాల నుంచి ఆ దేవుడు కాపాడాడు అనుకున్నాను కానీ ఈ ఇంటి దేవత అని పసిగట్టలేకపోయాము మేడం
శివరాం: ఈ ఇంటికి వచ్చిన కష్టాలను చూసి పాపం పిచ్చి పిల్ల ఎంత కుమిలిపోయి ఉంటుందో
మరోవైపు
భాగీ: ఏంటండీ చిన్నపిల్లాడిలా అన్ని తెలిసిన వారు అర్థం చేసుకుని ధైర్యంగా ఉండాల్సింది పోయి. ఇలా అయిపోతున్నారు
అమర్: నాకు అర్తం కావడం లేదు మిస్సమ్మ ఆ దేవుడు నాకు ఆరును జీవిత కాలం దూరం చేసి నన్ను తనకు పక్కనే ఎందుకు పెట్టాడో అర్తం కావడం లేదు. నేను తన కోసం ఏడ్చిన ప్రతిసారి తను నా పక్కనే ఉండి నా కన్నీళ్లను తుడవలేక ఎంత నరకం అనుభవించిందో ఏమిటో
భాగీ: మరి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు అక్క చూస్తే బాధపడకుండా ఉంటుందా..? చెప్పండి. వాళ్లు గుర్తుకు వచ్చినప్పుడు మన కంట్లో ఆనందం కనిపించాలి కానీ కన్నీళ్లు రాకూడదు. మీ నవ్వులో మీ జ్ఞాపకాల్లో అక్కను బతికించండి.
ఇంకోవైపు
నిర్మల: స్వామిజీ చెప్పినట్టు అరుంధతి అస్థికలు సాంప్రదాయ బద్దంగా నదిలో కలపాలండి.
శివరాం: సరే వెంటనే స్వామిజీని అడిగి మంచి రోజు చూసి చేద్దాం.
మనోహరి: చెల్లెలిని సాగనంపాలి అనుకుంటే అక్కను పంపిచే అవకాశం వచ్చింది. దేవుడు నా కోసం ఇచ్చిన ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. (మనసులో అనుకుంటుంది.) మనం తప్పు చేశాం.. ఆరు విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేశామో తలుచుకుంటేనే నా మీద నాకే కోపంగా ఉంది.
భాగీ: అక్క విషయంలో ఇంట్లో వాళ్లు తప్పు చేయడం ఏంటి మనోహరి గారు
మను: ఆరు ఆస్థికలు నదిలో కలపకపోవడమే కదా మనం చేసిన తప్పు అమర్
అమర్ : ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆరు ఆస్థికలను నదిలో కలుపుదాం.
మనోహరి: నేను పంతులు గారితో మాట్లాడాను అమర్. ఎల్లుండి మంచి రోజట ఆరోజు నదిలో కలిపితే మంచిది.
నిర్మల: ఎల్లుండా..? ఎల్లుండి పౌర్ణమి ఆరోజు కాకుండా పౌర్ణమి మరుసటి రోజు కలుపుదాం. అరుకు కూడా మంచిది
మనోహరి: ఎల్లుండి పౌర్ణమి అయితే రేపే నదిలో కలుపుదాం
అంటుంది. దీంతో భాగీ కూడా అత్తయ్య చెప్పినట్టు పౌర్ణమి మరుసటి రోజే కలుపుదాం అని చెప్తుంది. అమర్ కూడా అమ్మ చెప్పినట్టు పౌర్ణమి మరుసటి రోజే కలుపుదాం. రాథోడ్ అందుకు ఏర్పాట్లు చూడు అని వెళ్లిపోతాడు అమర్. అంతా కిటికీలోంచి చూసిన గుప్త, ఆరు గార్డెన్‌లోకి వెళ్తారు. ఆరు బాధపడుతుంటే ఇక ఆలోచించి ఏం లాభం బాలిక మారు మాట్లాడక నాతో మా లోకానికి వచ్చేయ్ అని చెప్తాడు. దీంతో తాను రానని ఎలాగైనా ఆ మనోహరి పీడ విరగడి చేశాకే వస్తానని చెప్తుంది ఆరు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!