Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పులికి ఎదురెళ్లిన అంజు – భయంతో భాగీ పరుగులు
Nindu Noorella Saavasam serial Today Episode December 1st: అడవిలో చిక్కుకున్న భాగీ వాళ్ల కార్లకు పులి ఎదరుగా వస్తుంది. ఆ విషయం తెలియక అంజు పులికి ఎదురుగా వెళ్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ సీమంతం కోసం రామ్మూర్తి వాళ్ల ఊరు వెళ్తుంటారు. మధ్యలో కొంత మంది రౌడీలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి డైవర్షన్ బోర్డు పెడతారు. అది చూసిన రాథోడ్ తనకు ఎందుకో అనుమానంగా ఉందంటాడు. మనోహరి మాత్రం భాగీని చంపేందుకు రణవీర్ వేసిన ప్లాన్ లా ఉంది ఇది అని మనసులో అనుకుని హ్యాపీగా ఫీలవుతుంది.
మను: ప్రభుత్వం పెట్టిన బోర్డులు రాళ్లు చూసి అనుమానంగా ఉందంటావేంటి రాథోడ్
భాగీ: ఇదంతా ఎందుకు ముందు ఆయనకు ఫోన్ చేయ్ రాథోడ్
ఫోన్ తీసి చూసిన రాథోడ్ సిగ్నల్ లేదని చెప్తాడు.
మను: మనం సిటీ దాటి చాలా దూరం వచ్చాము.. సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ
మంగళ: అయితే వెనక్కి వెళ్దాం
రామ్మూర్తి: ఎక్కడికి వెనక్కి వెళ్లేది. మనం ఊరుకు వెళ్లాలి
మంగళ: అయ్యో ఊరు వెళ్లాలి అంటే దారి ఉండాలి కదండి
చంభా: అటు దారి ఉంది కదా మేడం అటు వెళ్దాం
రాథోడ్: ఈ దారి సేఫ్ కాదు ముందుకు వెళితే డీప్ ఫారెస్ట్ వస్తుంది
మను: అడవి వస్తే ఏంటి దారి అయితే ఉంటుంది కదా
రాథోడ్: ఇరిటేటింగ్ గా మేడం అడవిలో ఎటని వెళ్తాం.. పైగా ఈ రోడ్డు చూస్తుంటే.. ఒక్క వెహికిల్ కూడా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ వెళ్తున్నట్టు కనిపించడం లేదు
మను: ఆర్మీలో పని చేస్తూ ఇంతలా భయపడతావేంటి..? మనం ఇలాగే లేట్ చేస్తే చీకటి పడుతుంది. అందుకైనా ఈ రోడ్డు గుండా వెళ్తే మేయిన్ రోడ్డు వస్తుంది. అది బెటర్ కదా..?
రాథోడ్: మేడం ఈ రోడ్డు గుండా వెళితే మెయిన్ రోడ్ వస్తుందని అంత గ్యారంటీ ఏంటి..? ఆడవాళ్లను చిన్నపిల్లలను పెట్టుకుని అడవిలో అంత రిస్క్ చేయలేం మేడం.. అయినా ఈ దారిలో ముందు ముందు ఏమోస్తుందో ఎవరికి తెలుసు..?
మను: అయితే ఇప్పుడు ఏమంటారు..? వెనక్కి వెళ్లిపోదామా..? భాగీ సీమంతం ఆపేద్దామా..?
చంభా: లేదు లేదు.. మేడం సీమంతం జరగాల్సిందే.. లేదంటే రామ్మూర్తి సార్ బాధపడతారు. రాథోడ్ గారు ఏమీ కాదండి.. దైర్యంగా ముందుకు వెళ్దాం..
రామ్మూర్తి: అవును రాథోడ్ ఇటే వెళ్దాం.. మనోహరి చాలా ధైర్యంగా చెప్తుంది కదా..? ముందు మేము వెళ్తాము.. మీరు వెనకాల రండి
మను: ముందు నా కారు నడపాలా..?
రామ్మూర్తి: అవునమ్మా.. నువ్వే… ఏంటమ్మా మనోహరి ఆలోచిస్తున్నావు.. రాథోడ్‌కు ధైర్యం లేదన్నావు.. ఇప్పుడు ముందుకు వెళ్లడానికి నీకు కూడా ధైర్యం సరిపోవడం లేదా..?
మను: ( మనసులో) రణవీర్ అడవిలో ఎలాంటి ప్లాన్ వేశాడో తెలియదే.. వెళ్తే నాకేం ప్రమాదం వస్తుందో
చంభా: మొదటికే మోసం వస్తుంది మనోహరి ముందుకు వెళ్లడమే మంచిది
మను: ఎలా వెళ్తాం.. రణవీర్ ఎలాంటి ప్లాన్ చేశాడో మనకు తెలియదు.. ముందు వెళితే మనకే ప్రమాదం
చంభా: ఇంత చేసినోడు మనం ముందు వెళ్తున్నామని తెలసుకోలేడా..? మనకేం ప్రమాదం రానివ్వడు నా మాట విను..
రాథోడ్: ఏంటి మనోహరి మేడం ముందు వెళ్లడానికి మీకు ధైర్యం రావడం లేదా..?
భాగీ: నాన్న ఇక మనం వెనక్కి వెళ్లిపోదాం.. సీమంతం సిటీలోనే చేసుకుందాం
మను: వద్దు వెళ్దాం పద నేను ముందు వెళ్తాను
అందరూ కారెక్కి వెళ్లిపోతారు. ఫారెస్టులో కొద్ది దూరం వెళ్లాక మనోహరి కారుకు ఎదురుగా పులి వస్తుంది. పులిని చూసిన మనోహరి భయంతో కారు ఆపేస్తుంది. ఆ విషయం తెలియక వెనక కారులో ఉన్న అంజు కారు దిగి వచ్చి రామ్మూర్తిని పిలుస్తుంది. ఇంతలో పులి అంజు వైపు పరుగెత్తుకుంటూ వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















