అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  అమర్‌ను బంధించిన అరవింద్‌ – పిల్లలను తీసుకుని ఎస్కేప్‌ అయిన రౌడీలు

Nindu Noorella Saavasam Today Episode:   పిల్లల కోసం వెళ్లిన అమర్‌ను అరవింద్‌ వెనక నుంచి తలపై కొట్టడంతో అమర్‌ కిందపడిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఫారెస్ట్‌ లోకి వెళ్లిన అమర్‌ రౌడీలు పాతి పెట్టిన లాండ్‌ మైన్‌ మీద కాలు పెడతాడు. అదే విషయం మేజర్‌కు వాకీటాకీ ద్వారా చెప్తాడు అమర్‌. భాగీ ఏడుస్తుంది. ఇంతలో అమర్‌ మీదకు గజమయూరి పాము అటాక్‌ చేయడానికి వస్తుంది. పామును చూసిన అమర్‌ తన చేతిలో ఉన్న టార్చ్‌ లైట్‌ను పాము నోట్లోకి విసురుతాడు. ఆ ప్రయత్నంలో వాకీటాకీ అమర్‌ చేతిలోంచి దూరంగా వెళ్లి పడుతుంది. అటువైపు నుంచి మేజర్‌ ఎంత పిలిచినా అమర్‌ పలకడు. దీంతో భాగీ కంగారుగా ఏడుస్తూ ఫారెస్ట్‌ లోకి వెళ్తుంది. అమర్‌, పాముతో ఫైట్‌ చేయడం చూస్తుంది. తనకు దగ్గరిలో ఉన్న నిప్పులు పాము మీదకు విసురుతుంది భాగీ. పాము తిరిగి భాగిని చూసి ఆమె మీద దాడి చేయడానికి వెళ్తుంది.

అమర్‌: మిస్సమ్మ దూరంగా పారిపో..

భాగీ: ఏవండీ.. మీరు జాగ్రత్త..

అమర్‌:నేను ఓకే కానీ నువ్వే పారిపో

అంటూ అమర్‌ కేకలు వేస్తాడు. పాము భాగీ మీద అటాక్‌ చేస్తుంది. అక్కడే ఉన్న నిప్పుల కట్టెను భాగీ తీసుకుని పామును బెదిరిస్తుంది. ఇంతలో అమర్‌ రాయి తీసుకుని లాండ్‌ మైన్‌ మీద పెట్టి భాగీని కాపాడటానికి వస్తాడు. పాము భాగీ మీద అటాక్‌ చేయబోతుంటే అమర్‌, భాగీని పక్కకు లాగేస్తాడు. ఆ పాము లోయలోకి పడిపోతుంది. ఇంతలో రాథోడ్‌ రాగానే భాగీని రాథోడ్‌ తో పంపించి పిల్లలను నేను సేఫ్‌గా తీసుకొస్తాను అంటూ ఫారెస్ట్‌ లోపలికి వెళ్తాడు అమర్‌. భాగీని తీసుకుని మేజర్‌ దగ్గరకు వచ్చిన రాథోడ్‌ ఫారెస్టలో జరిగిన విషయం చెప్తాడు. ఇంతలో అమర్‌ వాకీటాకీ నుంచి మాట్లాడతాడు.

అమర్‌: సార్‌ పిల్లలు ఉన్న బిల్డింగ్‌ దగ్గరకు వచ్చాను. కొద్ది దూరంలో ఉన్నాను.

మేజర్‌: సూపర్‌ అమర్‌ అక్కడ సిచ్యుయేషన్‌ ఏంటి..?

అమర్‌: ఎలాంటి సిచ్యుయేషన్‌ ఉన్నా నేను హ్యాండిల్‌ చేస్తాను సార్‌.

మేజర్‌: బీ కేర్‌ ఫుల్‌ అమర్‌..

అని చెప్పగానే ఓకే సార్‌ అంటూ అమర్‌ బిల్డింగ్‌ దగ్గరకు వెళ్లి ఒక్కొక్క రౌడీని కొడుతూ లోపలికి వెళ్లబోతుంటే అంజు చూసి డాడీ అని పిలవబోతుంది. అమర్‌ సైలెంట్‌ గా ఉండమని సైగ చేస్తాడు. సరేనని అంజు అందరికీ డాడీ వచ్చాడని చెప్తుంది. పిల్లలు అమర్‌ను చూడగానే హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అరవింద్‌ వెనక నుంచి వచ్చి అమర్‌ను తలమీద గట్టిగా కొడతాడు. దీంతో అమర్‌ స్పృహ కోల్పోతాడు. అమర్‌ను తీసుకెళ్లి తాళ్లతో కట్టేస్తాడు అరవింద్‌.

అరవింద్‌: అమరేంద్ర గారు ఎప్పుడూ చేయోద్దన్న పనే ఎందుకు చేస్తారు. నాకు మళ్లీ మళ్లీ కోపం వస్తుంది. రావొద్దన్నాను కదా..? ఎందుకు వచ్చారు.

అమర్‌: అరేయ్ ఇదొక్క పెద్ద స్నేక్‌ జోన్‌

అరవింద్‌: మళ్లీ అదే కథా..

ఇంతలో వాకీటాకీలో మేజర్‌ అమర్‌.. అంటూ పిలుస్తాడు.

అరవింద్‌: ఏంటి మేజర్‌ గారు మీరు కూడా మాట మీద నిలబడరా..?

మేజర్‌: అరవింద్‌ మీరున్న ఏరియాలో గజమయూరి అనే పాము ఉందట.. దాన్ని చూస్తేనే మీలో సగం మంది చచ్చిపోతారు. మీకు చెప్తే అర్థం కావడం లేదనే అమర్‌ వచ్చాడు. ముందు అక్కడి నుంచి వచ్చేయండి

అరవింద్‌:  ఏంటి మేజరు పాము పడగ అని కొత్త కథలు నాకు చెప్పొద్దు. ఎలాగూ నా గిఫ్టు నాకు అందింది కాబట్టి అమరేంద్ర సంగతి చూసుకుంటా.. పొద్దున కళ్లా మా వాళ్లందరూ ఇక్కడికి వచ్చేలా చేయ్‌

అమర్‌: అరేయ్‌ నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా..? తీసుకో మీ వాళ్లను వదిలేస్తారు. నా మాట విని పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో..

 అంటూ అమర్‌ చెప్పినా అరవింద్‌ వినడు. మరుసటి రోజు ఉదయం పిల్లలను అక్కడి నుంచి తీసుకెళ్లాలని అలాగే అమర్ ను ఇక్కడే చంపేయాలని అరవింద్‌ తన అనుచరులకు చెప్తాడు. టైం బాంబ్‌ తీసుకొచ్చి అమర్‌ కుర్చీకి పెట్టి పిల్లలను తీసుకుని అరవింద్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Embed widget