అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును చెయ్యి పట్టుకుని పూజకు ఆహ్వానించిన మిస్సమ్మ – తల్లి కోసం ఉపవాసం ఉన్న పిల్లలు

Nindu Noorella Saavasam Today Episode: మంగళగౌరి వ్రతానికి ఆరును చెయ్యి పట్టుకుని మిస్సమ్మ ఆహ్వానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఆలోచిస్తుంటే రాథోడ్‌ ఇంట్లో వాళ్లకు ఎందుకు నిజం చెప్పలేదని అడుగుతాడు. చెప్పి వాళ్లను బాధపెట్టలేనని అమర్‌ చెప్తాడు. నిజం చెప్పకపోయినా వాళ్ల ప్రేమ తక్కువేం కాదు కదా? అంటాడు. మరోవైపు మనోహరి రణవీర్‌ కు ఫోన్‌ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉంటుంది. ఇంతలో రణవీరే వీడియో కాల్ చేస్తాడు.

రణవీర్‌: మనోహరి ఇందాక అందరి ముందు సరిగ్గా పలకరించలేకపోయాను కదా అదుకే పర్సనల్‌ గా వీడియో కాల్ చేశాను. అయ్యో ఏంటి మనోహరి అలా గోడ మీద బల్లిలా అలా బిగుసుకుపోయావు.

మనోహరి: ఎందుకు వచ్చావు. ఏం కావాలి నీకు.

రణవీర్‌: నీ ప్రాణం కావాలి. అని అంటే ఇచ్చేస్తావా? చెప్పు.. నువ్వు కావాలి. నువ్వు నాతో  అక్కడికి రావాలి.

మనోహరి: అది ఈ జన్మలో జరగదు. జరగనివ్వను

రణవీర్‌: జరగాలి జరిగి తీరుతుంది. తాళి కట్టించుకున్నావు కడదాకా కలిసే ఉంటానన్నావు. ఇప్పుడేమో ఇలా మధ్యలో వదిలేసి వచ్చావు.

మనోహరి: వదిలేశానని అర్థం అయ్యింది కదా. మళ్లీ ఇలా నా వెంట వచ్చి నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు.

   అని మనోహరి చెప్పగానే రణవీర్‌ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడం. నీ కోసం అక్కడ చాలా మంది ఎదురుచూస్తున్నారు. నేను తిరిగి వెళ్లడం జరిగితే నీతోనే అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. ముందు నీ ధైర్యాన్ని చంపుతా? అంటాడు. భయంతో మనోహరి ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు మిస్సమ్మ  మంగళ గౌరి వ్రతం చేస్తుంది. ఇల్లంతా చాలా అందంగా అలంకరిస్తుంది. ఇంతలో పిల్లలు వచ్చి టిఫిన్‌ ఇంకా చేయలేదని అడుగుతారు. నిర్మల వచ్చి పూజ జరుగుతుందని చెప్పడంతో లాస్ట్‌ ఇయర్‌ ఆరు చేసిన పూజను గుర్తు చేసుకుని  పిల్లలు ఎమోషన్‌ అవుతారు. మేము కూడా అమ్మ కోసం ఉపవాసం ఉంటామంటారు. బయట ఆరు అటూ ఇటూ తిరుగుతుంది.

గుప్త: కురుస్తున్న వర్షం కన్నా నీ సందేహములకే ఎక్కువ తడిసి ముద్ద అయ్యేటట్టు ఉన్నావు. ఏంటో అడుగు.

ఆరు: అవును గుప్తగారు మీకు ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో.. ఏం జరగబోతుందో తెలిసినప్పుడు.. ఘోర నన్ను బంధించలేడని తెలిసిపోయి ఉంటుంది. కదా? మరి ఎందుకు నన్ను వెతుక్కుంటూ అంత హడావిడిగా వచ్చారు.

గుప్త: ఎప్పుడూ నీ పక్కనే కదా ఉండేది ఎందుక అనుమానిస్తున్నావు.

ఆరు: నా అనుమానం ఏంటంటే మీరు ఎందుకు ఇప్పుడే వచ్చారా అని. జరగబోయేది ఏంటో చూసి అది జరిగినప్పుడు నేను ఏం చేస్తానోనన్న భయంతో వచ్చినట్లు అనిపిస్తుంది. మళ్లీ ఏం ప్లాన్‌ చేశారు గుప్త గారు నిజం చెప్పండి.  

గుప్త: ఏమీయు లేదు బాలిక అయినను నీకు నీ మీద నమ్మకం లేదా?

ఆరు: నువ్వు నిజంగానే నన్ను ఈ క్వశ్చన్‌ అడుగుతున్నావా? రాధిక. గుప్త గారు డౌటే లేదు. అస్సలు నమ్మను. ఆఖరికి ఆ మనోహరిని అయినా నమ్ముతాను కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు నమ్మను.   

   అనగానే గుప్త అలిగి దూరంగా వెళ్లిపోతాడు. ఇంతలో మిస్సమ్మ కుంకుమ తీసుకుని బయటకు వచ్చి అరుంధతిని పిలుస్తుంది. ఎంటి మిస్సమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అని అడగ్గానే ఈరోజు మంగళగౌరి వ్రతం చేస్తున్నానని మిస్సమ్మ చెప్పడంతో అవును నేను మర్చిపోయాను. అని ఆరు అనడంతో అయితే మా ఇంట్లో పూజకు రా అక్కా అంటూ బొట్టు పెట్టి పిలవబోతుంటే ఆరు దూరంగా వెళ్తుంది. ఇంతలో మిస్సమ్మ, ఆరు చెయ్యి పట్టుకుంటుంది. దీంతో ఆరు షాక్‌ అవుతుంది. మిస్సమ్మ, ఆరు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పుట్టిన‌రోజు.. తిరుమలలో జాన్వీ క‌పూర్ - అచ్చం అమ్మలాగే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget